నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మ. అమితోగ్రాట విలోనఁ గ్రుమ్మరు వరాహవ్యాళ శార్దూల ఖ
ద్గమ దేభాదులఁ బట్టి తెచ్చి ఘనుఁడై కణ్వాశ్రమోపాంత భూ
జములం దోలిన కట్టుచుం బలిమిమై శాకుంతలుం దొప్పె వ
న్యమదేభంబుల నెక్కు చుం దగిలి నానా శైశ వక్రీడలన్

భావం: భరతుడు అపార బలంతో అత భయంకర మైన అడవులలో తిరుగాడే అడవి పందులను , పాములను, పులులను, ఖడ్గమృగాలను మదించిన ఏనుగులను ఇంకా తదితర మృగాలను అవలీలగా పట్టి తెచ్చి ఘటికుడై ఆ ఆశ్రమ సమీప ప్రాంతంలో ఉన్న చెట్లకు వరుసగా కట్టివేస్తూ ఆసక్తి తో అడవితో తిరిగే మదించిన ఏనుగుల పై ఎక్కి స్వారి చేస్తూ తన బాల్య క్రీడలను అనేకరకాలుగా ప్రదర్శిస్తూ ఉన్నారు. శకుంతలా దుష్యంతులకు పుట్టిన కుమారుడు బాల్యంలోనే శౌర్యపరాక్రమాలను ప్రదర్శిస్తూ పులిపిల్లలతో ఆడుకుంటున్నాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము