డైలీ సీరియల్

యువర్స్ లవింగ్లీ ...15

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతలోనే ‘‘అమాయకురాల్లా వుంది రేఖా.. ఎందుకేడిపిస్తావా అమ్మాయిని? లీవ్ దట్ గాళ్..’’ అంటూ వినిపించిందొక గంభీరమైన కంఠం.
హరిత కళ్ళు తెరిచి చూసింది. ఎప్పుడొచ్చాడో తెలియదు. జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుని హుందాగా వున్న అతను వీళ్ళ దగ్గరికి వచ్చాడు. చూస్తుంటే అతను కూడా స్టూడెంటే అని తెలుస్తోంది. అతని మాటల్లో ఏ శక్తి వుందో కానీ ఆ అమ్మాయి వెంటనే హరిత భుజంమీదనుంచి చెయ్యి తీసేసి నవ్వుతూ అతని వంక చూసింది ఏమీ జరగనట్లుగానే.
అతను వీళ్ళ వైపు తిరిగి అన్నాడు ఉపన్యాస ధోరణిలో. ‘‘హాయ్ గాళ్స్.. అయాం భరణి... మెకానికల్ థర్డ్ ఇయర్. వెల్కమ్ టూ అవర్ కాలేజ్. ఈ ర్యాగింగ్ మిమ్మల్ని ఆట పట్టించడం. ఆల్ దిస్ ఈజె పార్ట్ ఆఫ్ ది గేమ్. ఇదంతా కూడా మీ మంచి కోసమే. మీలోని బిడియాన్ని పోగొట్టడానికే. సో డోంట్ టేకిట్ సీరియస్లీ. మీకేమైనా ప్రోబ్లం వుంటే నాతో చెప్పండి. ఫీల్ ఫ్రీ.. మింగిల్ విత్ పీపుల్’’.
అందరూ అతడి వంక ఆరాధనగా చూసారు. అతను వీళ్ళ వంక నవ్వుతూ చూస్తూ ‘‘ప్లీజ్ క్యారీ ఆన్’’ అని చెప్పి ఆ గుంపుని తనతోపాటూ తీసుకుపోయాడు. వెడుడూ వెడుతూ క్యాజువల్‌గా చూసినట్టు ఒకసారి హరిత వంక చూశాడు.
‘‘ఎవరతనూ? స్టూడెంటేనా?’’ అంది ఒక అమ్మాయి వాళ్ళు వెళ్లిపోయాక ఆశ్చర్యంగా.
‘‘పేరుకి స్టూడెంటే. పెద్ద బిగ్ షాట్ కొడుకు. స్టూడెంట్ యూనియన్ లీడర్‌షిప్ కోసం, ఈ కాలేజీని వదిలిపెట్టకుండా వుండలేక ఒక్కో సెమిస్టర్లోనూ ఏదో పేపర్ని కావాలని వదిలేస్తూ మెకానికల్ ఇంజనీరింగ్ ఏడో సంవత్సరం చదువుతున్నాడు’’ చెప్పింది భరణి గురించి తెలిసిన మరో అమ్మాయి.
హరితకు మాత్రం అతడు ఇంగ్లీషు మాట్లాడుతున్న దేవుడిలా కనబడ్డాడా క్షణంలో. అంతా బ్రతుకు జీవుడా అనుకుంటూ బయటపడ్డారు అక్కడినుంచి. జరిగినదానికి హరితకి ఒక ఐదు నిమిషాలపాటూ స్నేహితుల ముఖం చూడాలంటేనే సిగ్గేసింది.
కావేరి హరితని దగ్గరికి తీసుకుంది. ‘‘మరీ ఇంత చిన్నపిల్లలా వుంటే ఎలా?’’ అంటూ ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసింది. ఆమె చూపిస్తున్న ఆప్యాయతకి హరిత కళ్ళల్లో నీళ్ళొచ్చేసాయి.
ఏదో సమాధానం చెప్పబోయేలోగానే ‘‘ఇంటికెళ్ళాక మీ అమ్మనడిగి తెలుసుకో నీ నెంబరెంతో..’’ అంది కావేరి అందరూ వినేలా గట్టిగా నవ్వుతూ. అందరూ బిగ్గరగా నవ్వేరు.
హరిత ముఖం ఎర్రగా అయింది. ‘‘సరదాకన్నాను. టేకిటీజీ!’’ అంది కావేరి ఆమెని మరింత దగ్గరగా తీసుకుంటూ.
అందరూ కలిసి క్యాంటీన్‌కి వెళ్ళారు. ‘ఫ్రెషర్స్ డే’ అయ్యేవరకూ మనకీ బాధ తప్పదు. అయినా మనమింకా డే స్కాలర్స్ కనుక ఫర్వాలేదు. హాస్టల్లో వుంటే ఇంకా దారుణంగా వుంటుంది. అసలు హాస్టల్స్‌లో జూనియర్స్‌తో వీళ్ళ ప్రవర్తన చూస్తే అసలెవ్వరూ వీళ్ళని అమ్మాయిలనుకోరుట’’ అంది కావేరి.
హరిత ఆశ్చర్యంగా వింది ఆమె మాటలని. అందరికీ టీ ఆర్డరిస్తుంటే హరిత ‘‘నేను టీ తాగను’’ అనడంతో అందరూ వింతగా చూసారు హరితని.
‘‘ఏమ్మా? పాలు తాగుతావా?’’ అంది ఒక అమ్మాయి నవ్వుతూ.
హరిత అమాయకంగా తలూపింది ఆ ప్రశ్నలోని సెటైర్‌ని అర్థం చేసుకోకుండా. దాంతో మిగిలిన అమ్మాయిలు కూడా పెద్దగా నవ్వేశారు.
అప్పటికిగానీ అర్థం కాలేదు హరితకి వాళ్ళంతా అలా ఎందుకు నవ్వుతున్నారో. చదువుకునే పిల్లలు కాఫీ, టీలు త్రాగకూడదని తల్లి నియమం. అందుకే తనకి అవి అలవాటు లేదు.
హరిత ముఖం చూసి కావేరి అందరినీ వారించింది నవ్వకుండా. అప్పటికప్పుడే అందరూ హరితకి ‘అమ్మ కూచి’ అన్న నిక్‌నేమ్ ఖాయం చేసేశారు. వాళ్ళలా అంటుంటే హరితకి ఉక్రోషంగా అనిపించింది. నిజానికి తనేం అమ్మ కూచి కాదు. తల్లే తనని చిన్న పిల్లని చేస్తూ అన్ని విషయాల్లోనూ కల్పించుకుంటూ వుంటుంది. అది ప్రేమో చాదస్తమో తెలియదు. తల్లిమీద బాగా కోపంగా అనిపించిందామెకి ఆ క్షణంలో.
****
‘‘ఎలా వుందే కాలేజ్?’’ హరిత ఇంటికి రాగానే అడిగింది సుమతి.
హరిత కోపంగా చూసింది తల్లి వంక. ఆమెని చూడగానే కాలేజ్‌లో అందరూ తనని ‘అమ్మ కూచి’ అని ఏడిపించడం గుర్తుకు వచ్చింది. ఉక్రోషంగా తల్లి వంక చూస్తూ అలవాటు ప్రకారం బ్యాగ్ టీపాయ్‌మీద పడేసి రెండు కాళ్ళూ మడిచి సోఫాలో కూర్చుంది.
‘‘బయటినుంచి రాగానే కాళ్ళు కడుక్కోకుండా అలా సోఫాలో కూర్చోకూడదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? చిన్నపిల్లలా రెండు కాళ్ళూ పైన పెట్టి మరీ కూర్చుంటావు’’ కోపంగా అంది సుమతి ఆమెకి మంచినీళ్ళందిస్తూ.
‘‘నాకు తెలుసు.. నువ్వు చెప్పక్కర్లేదు’’ అంది హరిత కాళ్ళు క్రింద పెడుతూ.
‘‘కాలేజీ సంగతులు అడుగుతుంటే చెప్పవేం? అందరితోనూ కలివిడిగా మాట్లాడావా? ర్యాగింగేమైనా చేసారా? వాళ్ళు అడిగిన ప్రశ్నలకి తెలివిగా సమాధానాలు చెప్పావా?’’ అంటూ ఆత్రుతగా అడిగింది సుమతి.
కాలేజ్‌లో తనకి జరిగిన అవమానానికి తల్లిని చూస్తుంటే ఒళ్ళు మండిపోతోంది హరితకి.
‘‘నా ముఖం చెప్పాను. అక్కడ అమ్మాయిలంతా ఇండిపెండెంట్‌గా, నాకంటే తెలివిగా వున్నారు. నేనే ఏమీ చేతకానిదానిలా అందరిముందూ తేలిపోయాను. అంతా నీవల్లే!’’ ఉక్రోషంగా అంది.
‘‘నావల్లా? మధ్యలో నేనేం చేసానూ?’’ ఆశ్చర్యంగా అంది ఆమె పక్కనే కూర్చుని జుట్టు సవరిస్తూ.
హరిత ఆమె చేతిని తోసిపారేసింది. ‘‘నేనేం చిన్నపిల్లని కాదు. నేను కూడా పెద్దదాన్నయ్యాను. ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఇక నుంచీ నాకు సంబంధించిన షాపింగ్ నేనే చేసుకుంటాను. నువ్వేం చెయ్యక్కర్లేదు’’ అంది.
‘‘ఏంటే? నేనేదో అడుగుతుంటే నువ్వేదో చెబుతున్నావు?’’ అంది సుమతి.

ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ