నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. ధర్మార్థ కామ సాధన కుపకరణంబు గృహనీతివిద్యకు గృహము విమల
చారిత్ర శిక్ష కాచార్యకం బన్వయ స్థితికి మూలంబు పద్ధతికి మాఁత
గౌరవంబున కేకకాణం బున్నత స్థిర గుణ మణుల కాకరము హృదయ
సంతోషమునను సంజనకంబు భార్యయ చూవె భర్తకు నొండ్లు గావు ప్రియము
ఆ. లెట్టి ఘట్టములను నెట్టి యాపదలను
నెట్టి తీరములను ముట్టబడిన
వంతలెల్లఁ బాయు నింతులఁ బ్రజలను
నొనగఁ జాడఁ గనిన జనుల కెందు
భావం : ధర్మం , అర్థం, కామం అనే పురుషార్థాలను సాధించటానికి అనువైన సాధనమూ గృహనీతి అనే విద్యకు నెలవైనది. నిర్మలమైన శీలాన్ని గురించి ప్రబోధించే గురుస్థానమూ వంశం నివలటానికి ఆధారమైనదీ, ఉత్తమ గతులు పొందటానికి ఊతకర్ర అయినది. మన్ననకు ముఖ్యహేతువైనదీ ఆదర్శప్రాయమైనది కలకాలం నిలిచేవీ అయిన మణుల వంటి గుణాలకు నెలవైందీ హృదయానందాన్ని కలిగించేది భర్తకు భార్యయే సుమా. మగనికి ఇల్లాలి కంటె ఇంపైనది వేరొకటి లేదు. ఆలుబిడ్డలను అప్యాయంగా చూచేవారికి ఏ చోటనైనా ఎటువంటి పరిస్థితులలోనైనా ఎటువంటి ఆపదలలోనైనా ఏ తీరాలోనైనా చుట్టుముట్టిన దుఃఖాలన్నీ తొలిగిపోతాయి.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము