నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరలము
కువలయంబున వారి కోరిన కోర్కి కిం దగ నీవు పాం
దవకులంబు వెలుంగ ఁ బుట్టి దృఢంబుగా నృపలక్ష్మితో
నవనిరాజ్యభరంబు దాల్చినయంతభుండి మఖంబులం
దివిరి యిష్ట్ధనంబు లిచ్చుట దృప్తులైరి మహాద్విజుల్

భావం: భూవలయంలోని ప్రజలు కోరిన కోరికను తగినట్లు నీవు పాండవుల వంశం ప్రకాశించేటట్లుగా పుట్టి స్థిరంగా రాజ్యలక్ష్మితో భూరాజ్యభారం వహించినప్పటినుండి యజ్ఞాలతో కుతూహలపడి బ్రాహ్మణులకు అభీష్టాలైన ధనాలు ఇస్తూండటం వలన వారు తృప్తిపొందిన వారయ్యారు. సర్పయాగం ఆపుచేయంచమని అడిగిన సర్పాలతో మీరు కోరుకున్న పని సానుకూలం అయ్యేట్టుగా చేస్తానని చెప్పి జనమేజయుని దగ్గరకు వచ్చిన ఆస్తీకమహాముని జనమేజయుడు చేసే యాగాల వల్ల కేవలం దేవతలే కాక ఆ యాగాల్లో భూరీ విరాళాలు అందుకున్న బ్రాహ్మణ వంశం అంతా కూడా ఆనందిస్తోంది అని చెబుతూ రాజులో మంచిబుద్ధి అంటే సర్పయాగం మానేసే విధమైన బుద్ధి కలుగాలని యత్నం చేస్తున్నాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము