నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధ్యాక్కర
‘తడయక పుట్టినాఁడ తల్లి చేఁ దండ్రిచే విడువఁ
బడితి: నిప్పుడు పతిచేతను విడువఁ బడి యొదనొక్కొ
నుడువులు వేయు నింకేల? యిప్పాటి నోములు తొల్లి
కడఁగి నోఁ చితిని గా కేమి’ యనుచును గందె డెందమున
భావం: దుష్యంతుడు తనను నిరాకరించిన విధాన్ని చూచి శకుంతల మిగుల వ్యాకులపాటు చెందింది. ఆపై మనసున ఎంతో దుఃఖించింది. ఇక అపుడు ‘పుట్టిన నాడే వెంటనే తల్లి దండ్రుల చేత ఆనాడు విడువబడినాను. ఇప్పుడు భర్తచేత కూడా విడువబడతాను కాబోలు. ఇక వేయి మాటలేల ? పూర్వం ఇటువంటి కొరనోములే నోచాను కాబోలవ. ఇంత గాక ఏమి అవుతుంది? అని శకుంతల మనసులో బాధపడింది. తనకు కలిగిన అవమానాన్ని తట్టుకొని తన్ను కన్నకూతురికన్నా ఎక్కువగా ప్రేమించి పెద్ద చేసి అత్తవారింటికి పంపిన కణ్వుని తలుచుకొని తాను పూర్వం పుణ్యకార్యమేమీ చేయనందునే ఇలా పుట్టినప్పటి నుంచి కష్టాలుకలుగుతున్నాయని శకుంతల వాపోయింది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము