నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ. భరతుఁ డశేష భూభువనభార దురంధరుఁడై వసుంధరం
బరఁగి యనక యాగములఁ బాయక భాస్కర జహ్ను కన్యకా
సురుచిర తీర దేశముల సువ్రతుఁడై యొనరించి భూరి భః
సురులకు నిచ్చె దక్షిణలు శుద్‌ద సువర్ణ గవాశ్వహస్తులన్
భావం: ఆకాశవాణి వల్ల తన మనో రధం పూర్తవగా ఎంతో ఆనందంతో శకుంతలను ప్రేమాదరములతో దుష్యంతుడు స్వీకరించాడు. ఆ తరువాత తన ప్రేమ ఫలంగా దొరికిన భరతునకు వరాజ్యాభిషేకం చేశాడ. ఆతరువాత తన వారసత్వంగా రాజ్యభారాన్ని అప్పగించి తాను సుఖసంతోషాలతో జీవితాన్ని గడిపి చివరకు తాను తపోవనానికి వెళ్లాడు. ఇక అపుడు భరతుడు అపారమైన సామ్రాజ్య భారాన్ని వహించి లోకంలో ప్రసిద్ధి కెక్కి, గంగాయమునా నదీ పవిత్ర తీర ప్రాంతాలలో దీక్షతో అనేక యజ్ఞాలను ఆసక్తి తో చేసి బ్రాహ్మణులకు అధికంగా దక్షిణలను, మేలిమి బంగారాన్ని, గోవులనూ, గుఱ్ఱాలనూ, ఏనుగులనూ దానం చేశాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము