నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. బలయుతులు మాటయిరువది
పలువురు నుతులుద్ధవిల్లి నానాదేశం
బులకుఁ బతులైరి మఱి వా
రలలోసంవరణుఁ డఖిల రాజ్యోన్నతుఁ డై
భావం: భరతుడు రాజ్యపరిపాలనా బాధ్యతలను చేపట్టి కేకయ రాజపుత్రిక అయిన సునందను వివాహం చేసుకొన్నాడు. వీరికి భుమన్యుడు పుట్టాడు. ఈ భుమన్యుడికి దాశార్హుడి కూతురైన విజయకు సుహోత్రుడను కుమారుడు కలిగాడు. తరువాత ఈ సుహోత్రునికి ఇక్ష్వాకుని పుత్రిక అయిన సువర్ణకూ హస్తి అనే కుమారుడు పుట్టాడు. ఈ హస్తి త్రిగర్త రాజు కుమార్తె అయిన యశోధరను వివాహం చేసుకొన్నాడు. వీరిరువురికీ వికుంఠనుడు పుట్టాడు వీరికి దాశార్హరాజు పుత్రిక వసుదేవకూ అజమీఢుడు అనువాడు పుట్టాడు. ఈ అజమీఢుడికీ కైకేయి, గాంధారి, ఋక్ష అనే ముగ్గురు స్ర్తిలకు -బలవంతులైన నూట ఇరవై నలుగురు కొడుకులు పుట్టి వివిధ దేశాలకు రాజులైనారు. మఱి, వారందరిలో సంవరణుడు సమస్త రాజ్యాలలోను శ్రేష్ఠుడైనాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము