నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ. అతిశయ రూప వన గణాధిక సుందర మైన యాసత్
ద్వితయమునందు సంతత రతిన్ విపశుం డయి రాజకృత్యముల్
మతి నొకనాఁడుఁ జేయ కహిమద్యుతి తేజుఁడై రాజయక్ష్మ బా
ధితుఁడయి దేవలోకసుదతీప్రియుఁ డయ్యె విచిత్ర వీర్యుఁడన్
భావం: సూర్య ప్రకాశుడైన విచిత్ర వీర్యుడు రూపంలోను, వనంలోనా గుణాలలోను అత్యంత సుందరులైన ఆ భార్య లిరువురి యందును నిరంతర రతిభావానికి వశుడై రాజవిధులను గురించి యెన్నడూ మనసుకు పట్టించుకొనక క్షయరోగ పీడితుడై స్వర్గస్థుడైనాడు. శంతనమహారాజు యోజనగంధి అని పిలువబడే సత్యవతిని పెళ్లిచేసుకొన్నాడు. ఆ శంతనసత్యవతులకు చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అనువారు పుట్టారు. ఆ విచిత్రవీర్యుడు చిన్నవాడైనప్పటికీ చిత్రాంగదుడు గంధర్వుల చేత చంపినందువల్ల విచిత్రవీర్యుడే రాజ్యాధికారాన్ని పొందాడు. ఆ విచిత్రవీర్యునకు అంబిక, అంబాలి కలనే కాశీరాజు కుమార్తెలను ఇచ్చి భీష్ముడు వివాహం చేశాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము