డైలీ సీరియల్

యువర్స్ లవింగ్లీ 42

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్ష్మి పరిచయమయ్యాక నాకు ఈ కాలేజీ ప్రేమ మీదా, ఆడా మగా స్నేహాలమీద నమ్మకం పోయింది. భరణితో కానీ, వరుణ్‌తో కానీ నాకెవ్వరితోనూ రిలేషన్ కొనసాగించాలన్న ఆసక్తి ప్రస్తుతం లేదు..’’ ఆమె ఇంకా ఏదో చెప్పబోతుంటే పాణి అడ్డుకున్నాడు.
‘‘కథలొద్దు. ఆ రోజు భరణి వెంట మీరు గెస్టుహౌస్‌కి వెళ్లారా లేదా? అది మాత్రం చెప్పండి చాలు!’’ అన్నాడు పాణి కరుగ్గా.
హరిత తల దించుకుని నెమ్మదిగా అంది ‘‘వెళ్ళాను. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రోజు నేను భరణితో పాటూ గెస్ట్‌హౌస్‌కి వెళ్ళాల్సి వచ్చింది...’’
‘‘ఆ రోజు అక్కడ ఏం జరిగింది? ఆ విషయం చెప్పండి’’ అన్నాడు పాణి.
హరిత ఒకసారి వంటగది వైపు తొంగి చూసి నెమ్మదిగా చెప్పసాగింది. ‘‘ఆ రోజు గెస్ట్‌హౌస్‌లో ఏం జరిగిందో చెప్పేముందు అసలు నేను ఆ రోజు భరణితో గెస్ట్‌హౌస్‌కి ఎందుకు వెళ్ళానో కూడా చెప్పాలి.
వరుణ్‌తో తెగతెంపులు చేసుకున్నాక నా దృష్టంతా చదువుమీదే కేంద్రీకరించాలనుకున్నాను. నేను జీవితంలో చదువు తప్ప నాకింకే ఆశయం మిగల్లేదు నాకు.
వయసు ప్రభావం వల్ల తెలిసో తెలియకో వరుణ్‌ని ఎంకరేజ్ చేసాను నేను. కానీ అదే తప్పు భరణి విషయంలో చెయ్యదల్చుకోలేదు. భరణి నా వెంట పడుతున్నా, అతడి ఉద్దేశం నాకు డైరెక్టుగానే తెలుస్తున్నా నేను మాత్రం టెంప్టేషన్ లేకుండా అతడితో అంటీ ముట్టనట్టుగానే ఉండేదాన్ని. కొంతకాలానికి అతడికి నా సంగతి అర్థమై తనంతట తానే నాకు దూరమవుతాడనుకున్నాను. కానీ నేననుకున్నంత సులువుగా నన్ను భరణి వదల్లేదు.
మొదటిరోజు కాలేజీలో నన్ను చూసిన దగ్గరనుంచీ నా మీద కన్ను ఉంది. కేవలం నన్ను పొందాలన్న ఒక్క కోరికతోనే పిరికివాడైన వరుణ్‌ని నాతో తిరిగేలా ఎంకరేజ్ చేస్తూ అతడు అడిగినపుడల్లా సినిమాలకీ, షికార్లకీ హోటళ్ళకీ, పబ్బులకీ తిరగడానికి డబ్బులిస్తూ వచ్చాడు. కానీ మిగిలిన అమ్మాయిల విషయంలో జరిగినట్టుగా అతడు ఊహించినది నా విషయంలో జరగకపోయేసరికి దెబ్బతిన్నట్టు ఫీలయ్యాడు. నాతో పచ్చిగా మాట్లాడడం మొదలుపెట్టాడు.
‘‘ఒకసారి హత్య చేసినా ఒక్కటే శిక్ష, రెండుసార్లు హత్య చేసినా ఒకటే శిక్ష. వరుణ్‌తో తిరిగి నువ్వు అన్ని రకాలుగా చెడిపోయావు. ఇపుడు నాతో తిరగడంవల్ల కొత్తగా కోల్పోయేదేమీ ఉండదు’’ అనేవాడు.
‘‘వరుణ్‌కీ నాకూ మధ్యన నువ్వు ఊహించుకునేలాంటి సంబంధం ఏమీ లేదు’’ అంటే వినిపించుకునేవాడు కాదు.
‘‘మీరిద్దరూ పబ్బులో ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, వరుణ్ వాళ్ళింట్లో గంటలకొద్దీ ఏకాంతంగా గడపడం నాకు తెలియదనుకున్నావా? దానంతటికన్నా నువ్వంటే పడి చచ్చే నాతో తిరగడం ఎక్కువేం కాదులే’’ అని నవ్వేవాడు.
అతడి మాటలు వినడం నాకు నరకంలా ఉండేది. అయినా సహనంగా భరించేదాన్ని. చివరికొక రోజు ఎలా సంపాదించాడో వరుణ్‌తో నేను సన్నిహితంగా ఉన్న ఫొటోలు సంపాదించాడు. వాటిని నాకు చూపిస్తూ ‘నువ్వు నా మాట వినకపోతే వీటినేం చేస్తానో తెలుసా?’ అన్నాడు.
‘ఏం చేస్తావు? నెట్లో పెడతావా?’ అన్నాను నేను నిర్లక్ష్యంగా.
భరణి నవ్వి ‘కాదు- మీ ఇంటికి పోస్టు చేస్తాను’ అన్నాడు.
నేను హతాశురాలయ్యాను అతడి మాటలకి. ఆ ఫోటోలు ఇంటికి చేరాయంటే ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఇప్పటికే ఇంట్లో నా పరిస్థితి ఘోరంగా ఉంది. అదృష్టవశాత్తు ఆ రవిచంద్ర సంబంధం తప్పిపోవడంతో చేసేది లేక నన్ను చదివిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఫొటోలు గాని మా ఇంట్లో చూసారంటే నన్ను ఇంక కాలేజీకి పంపరు. నా భవిష్యత్ మీద నాకున్న ఒకే ఒక్క ఆశ కూడా లేకుండా పోతుంది. నేను ఒణికిపోయాను అతడి మాటలకి.
దాంతో నా బలహీనత అతడికి అర్థమైంది. అతడి బెదిరింపు రోజురోజుకీ ఎక్కువైపోతోంది. నేను ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఉంటే అతడు నన్ను మరింత బలవంతపెట్టేవాడు.
‘హరితా, నిన్ను నేను ఎక్కువగా ఇబ్బంది పెట్టను. ఒక్కసారి, ఒకే ఒక్కసారి నాతో గెస్ట్‌హౌస్‌కి రా. ఆ తరువాత నేను నీ జోలికి రాను. నువ్వు కోరుకున్నట్టుగా హాయిగా చదువుకుని నీ లక్ష్యాలని నువ్వు సాధించుకో’ అన్నాడు.
దానిక్కూడా నేనేమీ మాట్లాడకపోవడంతో ‘నీకు రెండు రోజులు సమయమిస్తున్నాను. ఏ విషయం ఆలోచించుకుని నాకు చెప్పు. నువ్వు ఏమీ చెప్పకపోతే మూడో రోజు ఆ ఫోటోలు మీ ఇంట్లో వాళ్ళకి అందుతాయి’ అన్నాడు అతడు ఫైనల్ అల్టిమేటమ్ ఇస్తూ.
నేను ఒప్పుకోకపోతే అతడు అన్నంత పనీ చేస్తాడని నాకు తెలుసు. అందుకే, లక్ష్మికి కూడా చెప్పకుండా భరణితో ఆ రోజు గెస్ట్‌హౌస్‌కి వెళ్ళాను’’ తప్పు చేసిన దానిలా తల దించుకుని అంది హరిత.
ఒక్క నిమిషం రవీంద్ర, పాణి ఏమీ మాట్లడలేదు.
‘‘గెస్ట్‌హౌస్ దగ్గర ఏం జరిగింది?’’ అన్నాడు పాణి.
‘‘దారిపొడవునా భరణి నన్నూ నా అందాన్ని పొగుడుతూనే వున్నాడు. నా అందం తనని ఎన్ని రకాలుగా ఆకర్షించినదీ చెప్పాడు. ఇన్నాళ్ళ ఎదురుచూపులో తనెంత విరహాన్ని అనుభవించిందీ వర్ణిస్తూ చెప్పాడు. మేము వెళ్ళేసరికి గెస్ట్‌హౌస్ దగ్గర వాచ్‌మెన్ లేడు. మేమే తాళం తీసుకుని లోపలకి వెళ్ళాం. నేరుగా నన్ను పైఅంతస్తులో వున్న బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్ళాడు భరణి.
విశాలమైన ఆ బెడ్రూమ్‌లో నన్ను మంచమీదకి తోసి, ఆపుకోలేనట్టుగా నన్ను కౌగిలించుకుని ఒళ్ళంతా ముద్దులు కురిపించసాగాడు. నేను ఇబ్బంది పడుతుంటే ‘ఏమిటిదీ? ఏమీ అలవాటు లేనట్టుగా అలా అయిపోతావు?’ అంటూ నవ్వాడు. అతడి చేష్టలకన్నా ఆ మాటలు నన్ను ఎక్కువగా బాధించాయి. అతడ్ని పక్కకి తోసేస్తూ లేచాను.
‘ఏమయ్యిందీ’ అన్నాడతడను ఆశ్చర్యంగా నా చేతిని పట్టుకుని నన్ను ఆపుతూ.

- ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ