నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. ‘నా కభిమతంబు నిట్టెద
మీకును నుపకార మగు సమీహిత బుద్ధిం
జేకొని చేసేద మీరల
శోకస్థితి నుండుఁ’ దనుచు సురనది కరుణన్
భావం: వసువులు ఎంతో దిగులుగా భూలోకానికి వస్తుండడం చూచి వారందరూ ఎందువల్ల భూలోకానికి వస్తున్నారో గంగాదేవి తెలుసుకొంది. అపుడు ఆ వసువులు మహాభిషుని సంగతి తెలుసుకొంటారు. త్రికాలవేత్తలైన ఆ వసువులు- ఆ మహాభిషుడే బ్రహ్మ ఇచ్చిన వరం శాపమూ వల్ల ప్రతీప మహారాజుకు శంతనుడై పుట్తాడు. వానిని నీవు వివాహం చేసుకొంటావు అని భవిష్యత్తులో జరగబోయే విధివిధానాన్ని గంగాదేవి తో చెప్పారు. ఇక అపుడు మేము వసిష్ఠుని శాపం వల్ల భూలోకంలో పుణ్యస్ర్తికి మేము జన్మిస్తాము. కనుక నీవే ఆ పుణ్యమూర్తివి కమ్ము. నీవు ఆ శంతన మహారాజు వివాహం చేసుకొంటారు. మీకిద్దరికీ మేము జన్మిస్తాము. మా కోరికను తీర్చుము అని వసువులు అడిగారు. అపుడు ‘నాకోరిక కూడా అటువంటిదే. మీకోరికను ఇష్టమైన మనస్సుతో అంగీకరించి అమలుపరుస్తాను. మీకు మేలు కూడా జరుగుతుంది. మీరింక నిశ్చింతగా ఉండండి. ’ అంటూ గంగాదేవి కరుణతో వసువులతో చెప్పింది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము