డైలీ సీరియల్

యువర్స్ లవింగ్లీ 43

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాకేమని చెప్పాలో అర్థం కాలేదు. ‘వాష్ రూమ్‌కి వెళ్ళొస్తాను’ అన్నాను.
అతడు చిన్నగా నవ్వి ‘సరే’ అని నా చేతిని వదిలిపెట్టి మంచంమీద వెల్లకిలా పడుకున్నాడు.
నేను గభాల్న వాష్‌రూమ్‌లో దూరి తలుపేసుకున్నాను. నాకు ఆపుకోలేనంత దుఃఖం వచ్చింది. తలుపునానుకుని అలాగే నిలబడి భోరుమని ఏడ్చేసాను. అలా ఎంతసేపు ఏడుస్తూ ఉండిపోయానో నాకే తెలియదు. బయటినుంచి ఏవో శబ్దాలు వినిపించాయి. భరణి కంఠం వినిపించింది ఏడుస్తున్నట్లుగా. రెండే రెండు మాటలు.. ‘‘స్స్... స్స్.. సంధ్యా... ననే్నం చేయకు- నీకు దణ్ణం పెడతాను. స్స్.. స్స్.. సంధ్యా’’ అని. ఆ తర్వాత గొంతుకేదో అడ్డుపడ్డట్టు భరణి మాటలు ఆగిపోయాయి.
అంతా నిశ్శబ్దం. కొద్ది క్షణాలు నాకు గదిలో ఏం జరిగిందో అర్థం కాలేదు. నెమ్మదిగా తలుపు తెరచుకుని బయటికి వచ్చాను. మంచంమీద భరణి రెండు చేతులూ గుండెలకి అడ్డం పెట్టుకుని కొయ్యబారిపోయినట్లు అలా ఉండిపోయాడు. అతడి కళ్ళు రెప్ప కూడా వెయ్యకుండా వాష్‌రూమ్ తలుపుల వంక చూస్తున్నాయి.
నేను కంగారుగా భరణీదగ్గరికి వెళ్లి అతడ్ని కుదుపుతూ ‘‘్భరణీ.. ఏమయ్యింది?’’ అన్నాను. కానీ అప్పటికే అతడి ప్రాణం పోయింది. నాకు కాళ్ళూ చేతులూ ఆడలేదు. మామూలు మనిషిని కావడానికి నాలుగు నిమిషాలు పట్టింది.
చనిపోయేముందు భరణి నోటినుంచి వెలువడ్డ ‘సంధ్యా, నీకు దణ్ణం పెడతాను’ అన్న మాటలూ అతడి కళ్ళు వాష్‌రూమ్ ద్వారం వైపు చూస్తూ ఉండడాన్ని బట్టి ఏం జరిగిందో నేను ఊహించగలిగాను.
కొద్ది రోజుల క్రితం నాలాగే భరణి మోసానికి గురైన సంధ్య అనే కాలేజీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందనీ, చనిపోయిన ఆమె ఆత్మ భరణికి అపుడపుడూ కనిపిస్తూ ఉంటుందనీ కాలేజీలో కొంతమంది భరణి స్నేహితులు రహస్యంగా చెప్పుకుంటుంటే విన్నాను.
వాష్‌రూమ్‌లో నేను హృదయవిదారకంగా రోదించడాన్ని గమనించిన ఆ స్ర్తి ఆత్మ నన్ను రక్షించడానికి అక్కడికి వచ్చిందని అర్థమైంది. వాష్‌రూమ్‌లోకి వెళ్ళిన నా రాక కోసం భరణి ఎదురుచూస్తుంటే వాష్‌రూమ్ తలుపు తెరుచుకుని ఆమె ఆత్మ బయటికి వచ్చింది. ఆ ఆత్మని అంత దగ్గరగా చూసిన భరణి షాక్ తిన్నాడు. తననేం చేయద్దని వేడుకుంటున్నా.. ఆ ఆత్మ భరణిని వదల్లేదు. మరో ఆడపిల్లకి అన్యాయం చేయడానికి వీల్లేకుండా అతడ్ని నిశ్శబ్దంగా చంపేసింది...
నన్ను కాపాడిన ఆ అమ్మాయి ఆత్మకి నేను మనసులోనే చేతులెత్తి నమస్కరించాను. జరిగినది అర్థమయ్యాక ఇంకొక్క క్షణం కూడా అక్కడ ఉండలేకపోయాను. పరిగెత్తుకుంటూ అక్కడినుంచి పారిపోయి వచ్చేశాను. అదృష్టవశాత్తు వాచ్‌మెన్ కూడా లేకపోవడంతో ననె్నవరూ గమనించలేదు’’.
ఆమె చెప్పడం ముగించేసరికి నమ్మలేనట్టుగా ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఉండిపోయాడు ఎస్‌ఐ రవీంద్ర. పాణి ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉండిపోయాడు.
అంతలోనే సుమతి కాఫీలు తీసుకువచ్చి టీపాయ్‌మీద ఉంచింది. ‘‘అయిపోయిందా మీ ఇంటర్వ్యూ’’ అంది నవ్వుతూ.
ఏమీ మాట్లాడకుండా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉన్నట్టున్న వాళ్ళ ముగ్గురినీ వింతగా చూస్తూ అంది సుమతి ‘కాఫీ తీసుకోండి’ అని.
ముగ్గురూ వౌనంగానే కాఫీ తీసుకుని త్రాగారు. కాఫీ త్రాగాక కప్పు టీపాయ్‌మీద ఉంచి లేచాడు పాణి. ‘‘ఇంటరాగేషన్.. అదే ఇంటర్వ్యూ అయిపోయింది. మేము బయలుదేరుతాం. థాంక్సండీ’’ అన్నాడు సుమతితో.
‘మంచిది బాబూ’ అంది సుమతి.
వాళ్ళు వెడుతుంటే వాళ్ళతో పాటూ గేటు దగ్గరికి వచ్చింది హరిత.
హరితకి ఒక కార్డు ఇస్తూ అన్నాడు పాణి. ‘‘నేను మీకు ముందే చెప్పాను. సూర్యచంద్రులనీ నిజాన్నీ ఎవరూ దాచలేరని. అందంగా అలంకరించినంత మాత్రాన అబద్దం నిజమైపోదు. ఇంకా మీరు చెప్పని నిజమేమైనా ఉంటే బాగా ఆలోచించి ఈ కార్డుమీద ఉన్న రవీంద్రగారి ఫోన్ నెంబరుకు రేపు ఉదయంలోగా చెప్పండి. ఒకవేళ మీరు ఇంకా మా దగ్గర ఏదైనా దాస్తున్నట్టైతే, దాన్ని తెలుసుకోవడానికి రవీంద్రగారు మళ్లీ మీ ఇంటికి వస్తారు. ఈసారి మఫ్టీలో రారు. ఫుల్ యూనిఫారమ్‌లో అరెస్టు వారెంట్‌తో వస్తారు.’’
హరిత నోట మాటరానట్టు చూస్తూ ఉండిపోతే, పాణి, రవీంద్ర సందు చివర పార్కు చేసిన తమ జీపు వంక నడిచారు.
‘‘ఆమెనందుకెలా భయపెట్టారు? ఆమె అబద్ధం చెబుతోందని మీ అనుమానమా?’’ జీపు ఎక్కాక అడిగాడు రవీంద్ర.
‘‘ఆమె అబద్ధం చెబుతోందని నేననడంలేదు. కానీ నిజాన్ని దాస్తోందని అనిపిస్తోంది’’.
‘‘ఎందుకలా అనుకుంటున్నారు?’’
‘‘్భరణితో తప్పనిసరై అయిష్టంగా గెస్ట్‌హౌస్‌కి వెళ్ళానని చెప్పింది. కానీ అతడితో పాటూ గెస్ట్‌హౌస్‌కి వెళ్ళడానికన్నా ముందు ఆమె అతడితో కలిసి నాలుగుసార్లు అర్థరాత్రులవరకూ పబ్‌లో గడిపింది. అంత అయిష్టం ఉన్న మనిషి అతడితో పబ్‌కి ఎందుకు వెడుతుంది?
ఆమె తల్లి సుమతి ఒట్టి అనుమానం మనిషని మనకి చెప్పింది. వెళ్లిన దగ్గరనుంచీ మన ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండేట్టు నేను కావాలనే నటించాను.
అయినా సరే ఆవిడ అదేం పట్టించుకోకుండా హరిత మనతో మాట్లాడుతున్న గంట సేపూ వంటింట్లో కాఫీ కలుపుతూనే ఉండిపోయింది కానీ కనీసం హాల్లో మనమేం మాట్లాడుతున్నామని తొంగి కూడా చూడలేదు. ఇప్పుడేమంటారు?’’ అన్నాడు పాణి.
రవీంద్ర ఆశ్చర్యంగా నోరు తెరిచాడు. ‘‘అయితే ఆమె చెప్పినది కట్టు కథా? ఆమే భరణిని హత్య చేసిందంటారా?’’
‘‘అబద్ధం చెప్పిన వాళ్ళంతా హంతకులు కాదు’’ నవ్వేడు పాణి.
‘‘సరే ఆ సంగతి పక్కన పెట్టండి. ఇంతకీ భరణిది హత్యా ఆత్మహత్యా సహజ మరణమా? పోస్టుమార్టమ్ రిపోర్టులో వచ్చినట్టు సహజ మరణం అనుకుందామంటే, గెస్ట్‌హౌస్ దగ్గర వాచ్‌మెన్‌ని అబద్ధపు ఫోన్ కాల్‌తో ఆ సమయానికి అక్కడ ఉండకుండా చేయాల్సిన అవసరం ఎందుకుంటుంది?

ఇంకా ఉంది