డైలీ సీరియల్

యువర్స్ లవింగ్లీ - 47

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలోచనలతో అతడికి రాత్రంతా నిద్ర రాలేదు.
తెల తెలవారుతుండగా అతడి ల్యాండ్‌లైన్‌కి ఫోన్ వచ్చింది. ఫోన్ ఎత్తి ‘హలో’ అన్నాడు నిద్ర మత్తులోనే.
‘‘సార్, ఎమ్మిగనూరు నుంచి కానిస్టేబుల్ భాస్కరఇని మాట్లాడుతున్నాను’’.
అతడి కంఠం వినగానే నిద్రమత్తు వదిలిపోయింది రవీంద్రకి ‘చెప్పు భాస్కర్’’ అన్నాడు.
‘‘నిన్న రాత్రి నుంచీ మీ సెల్‌కి ట్రై చేస్తున్నాను సార్, కవరేజి రావడంలేదు. అందుకే ఇపుడు ల్యాండ్‌లైన్‌కి చేస్తున్నాను’’.
‘‘మీకొక షాకింగ్ న్యూస్ సార్, చనిపోయిన సంధ్య అనే అమ్మాయి గురించిన వివరాలు కనుక్కుని రమ్మని నన్ను ఇక్కడికి పంపించారు కదా? కానీ ఇక్కడికొచ్చి ఎంక్వయిరీ చేసాక నాకు తెలిసినదేమిటంటే మీరనుకుంటున్నట్టుగా ఆ అమ్మాయి చనిపోలేదు- బ్రతికే ఉంది. ఆ విషయం చెబుదామనే నిన్న రాత్రి నుంచీ మీ ఫోన్ కోసం ప్రయత్నిస్తున్నాను’’.
చేతిలో రిసీవర్ జారిపడబోతుంటే తేరుకుని గట్టిగా పట్టుకున్నాడు రవీంద్ర ‘‘ఏమిటి నువ్వు చెబుతున్నది? నిజమేనా?’’’ ఆశ్చర్యంగా అన్నాడు.
‘‘నిజమే సార్, ఖచ్చితంగా చెబుతున్నాను. ఆ అమ్మాయి బ్రతికే ఉంది. అందులో అనుమానం లేదు’’.
రవీంద్రకేం మాట్లాడాలో అర్థం కాలేదు. ‘‘సరే, నువ్వు వెనక్కి వెచ్చెయ్యి’’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అతడికి తల తిరుగుతున్నట్టనిపించింది.
భరణి స్నేహితులతో సహా అందరూ తమతో సంధ్య ఆత్మహత్య చేసుకుందని ఎందుకు చెప్పారు? సంధ్య బ్రతికే ఉందంటే మరి భరణిని చంపినదెవరు?!
‘రాత్రంతా బాగా ఆలోచించండి. నిజమేమిటో మీకే అర్థమవుతుంది. అర్థం కాకపోయినా ఫరవాలేదు. పొద్దునే్న హరిత మీకు ఫోన్ చేసి నిజం చెబుతుంది’ అని పాణి అన్నమాటలు గుర్తొచ్చాయి.
అలా ఎందుకన్నాడు అతడు? హరిత తనకి నిజం ఎందుకు చెబుతుంది? ఏమిటా నిజం?!
గోడ గడియారం వంక చూశాడు రవీంద్ర. సమయం ఆరవుతోంది. కిటికీలోంచి ఆకాశం మెల్లగా తెల్లబడడం తెలుస్తోంది. ‘హరిత ఇంకా ఫోన్ చేయలేదేం?’ అనుకున్నాడు అప్రయత్నంగా. అతడలా అనుకుంటుండగానే కాలింగ్ బెల్ మ్రోగింది. ఆ సమయంలో ఎవరొచ్చారా అని అనుకుంటూ వెళ్లి తలుపు తీసిన అతడు ఎదురుగా ఉన్న వ్యక్తులను చూస్తూ ఆశ్చర్యంతో నోరు తెరచుకుని అలాగే ఉండిపోయాడు.
ఎదురుగా హరిత, ఆమె పక్కనే రాజేష్, మరో అమ్మాయి నిలబడి ఉన్నారు!
అర నిమిషం తరువాత చేరుకుని వాళ్ళని లోపలికి రమ్మన్నాడు రవీంద్ర.
‘‘ఇతడు రాజేష్. ఈమె మా ఇద్దరి స్నేహితురాలు- లక్ష్మి. నా కథ చెప్పినపుడు మీకు నేను చెప్పినది ఈమె గురించే’’ అంది హరిత.
హరిత తల దించుకుని చేతి వేళ్ళవైపు చూసుకుంటూ చెప్పసాగింది నెమ్మదిగా ‘‘డిటెక్టివ్ పాణి గారు చెప్పినది నిజం.
మీరు మా ఇంటికి వచ్చినపుడు కూడా నేను కొన్ని విషయాలని మీకు చెప్పకుండా దాచాను. అయితే ఆయన చెప్పినట్టుగా రాత్రంతా బాగా ఆలోచించిన తరువాత, మా స్నేహితురాలు లక్ష్మితో కూడా చర్చించిన మీద, ఉన్నదున్నట్టుగా పూర్తి నిజం మీకు చెప్పడమే మంచిదని మేము అనుకున్నాము. అందుకే వచ్చాము’’.
ఆమె చెప్పబోయేది వినడం కోసం రవీంద్ర ఆసక్తిగా సోఫాలో ముందుకు వంగాడు. హరిత చెప్పసాగింది.
‘‘మీరు అనుకున్నట్టుగా సంధ్య చనిపోలేదు. బ్రతికే ఉంది. భరణి ఫోన్లో మాట్లాడింది విన్నాక ఆమె తట్టుకోలేకపోయింది. ఒక మోసగాడి నటనని ‘ప్రేమ’ అని నమ్మి తన సర్వస్వాన్నీ అర్పించుకున్నందుకు. అంతకుమించి అతడికోసం తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ఒక నిజమైన ప్రేమికుడు రాజేష్‌ని వదులుకున్నందుకు..
ఆమెకి తనమీద తనకే అసహ్యం వేసింది. అవమానాన్ని భరించలేక ఎవరికీ చెప్పకుండా హాస్టల్ ఖాళీ చేసి వాళ్ళ ఊరు ఎమ్మిగనూరు వెళ్లిపోయింది.
ఊరికి వెళ్లాక కూడా ఆమెని ఆలోచనలు వదల్లేదు. తట్టుకోలేక నిద్ర మాత్రలు మింగింది. ఆఖరి నిమిషంలో ఆ విషయం ఆమె తల్లిదండ్రులకి తెలియడంతో హుటాహుటిన ఆమెని కర్నూలు హాస్పిటల్‌కి తరలించారు.
డాక్టర్లు లాభం లేదని చెప్పేసారు. అయినా తమ ప్రయత్నం తాము చేస్తామని చెప్పి స్టమక్ వాష్ చేయడం మొదలుపెట్టారు. అదృష్టవశాత్తు ఆమె బ్రతికింది. అయితే ఊళ్ళో వాళ్ళ ద్వారా ఆ వార్త తెలుసుకున్న పత్రికా విలేఖరులు, డాక్టర్ల ట్రీట్‌మెంట్ పూర్తయ్యేదాక ఎదురుచూడకుండా, పూర్తి నిజానిజాలు తెలుసుకోకుండా తొందరపడి ‘ఆత్మహత్య చేసుకుని యువతి మృతి’ అని ఆమె ఆత్మహత్య వార్తని పేపర్లో వేసేసారు. ఆ వార్త చదివి రాజేష్‌తో సహా అందరూ చనిపోయిందనే అనుకున్నారు.
కొద్ది రోజుల తరువాత ఎమ్మిగనూరు వెళ్లిన రాజేష్‌కి మాత్రం ఆమె బ్రతికే ఉందని తెలిసింది. సంధ్య రాజేష్‌తో మాట్లడటానికి కాని, తిరిగి వచ్చి కాలేజీలో చేరడానికి కానీ ఒప్పుకోలేదు. ఇంట్లో ఒంటరిగా కూర్చుని ఎప్పుడూ దిగులుగా ఏదో కోల్పోయినదానిలా కూర్చుంటున్న ఆమెని ఎలాగైనా మామూలు మనిషిని చేయాలని రాజేష్ చాలా ప్రయత్నం చేశాడు. నెమ్మదిగా రాజేష్‌తో మాట్లాడడం మొదలుపెట్టిందామె.
కాలేజీకి తిరిగి రావడానికి మాత్రం ఆమె ఒప్పుకోలేదు. ‘అక్కడ అందరి దృష్టిలో నేను చచ్చిపోయాను. అలాగే అనుకోనీ’ అనేది. రాజేష్ కూడా కాలేజీలో ఎవరికీ ఈ విషయం చెప్పలేదు. ఒకసారి రాజేష్ బలవంతంమీద సంధ్యని హైదరాబాద్ తీసుకుని వచ్చాడు.
అప్పుడే మాల్లో షాపర్స్ స్ట్ఫా అద్దాల కిటికీలోంచి సంధ్య క్రింద కూర్చున్న భరణిని చూసింది. ఆమెని చూసి ఆత్మ అని భ్రమపడ్డాడు భరణి. తరువాత భరణి స్నేహితుల ద్వారా భరణి సమయాన్ని గురించి తెలుసుకున్నాడు రాజేష్.

- ఇంకా ఉంది

వరలక్ష్మీ మురళీకృష్ణ