నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. వసువు లనువా రపేత
వ్యసనులు , దేవతలు, లోకవంద్యులు : వారిన్
వసుమతిఁ బుట్టఁగ శాపము
వసిష్ఠముని యేల యిచ్చెవారిజ నేత్రా!
భావం: వసువులు దోషరహితులు, దేవతలు,లోకుల చేత పూజింపదగినవారు. అటువంటి వారిని వసిష్ఠముని భూలోకంలో పుట్టేటట్లు ఎందుకు శపించాడని శంతనుడు గంగను అడిగాడు. అపుడు ఆమె ఇలా చెప్పింది. నేను మూడులోకాల్లో పరమపవిత్రమని పేరు పొందిన గంగను. వసిష్ఠుడు మహా తప్పశ్శాలి. ఒకసారి వసిష్ఠుని హోమధేనువును వారు అపహరించారు. ఈ విషయం తెలియక వసిష్ఠుడు అడవి అంతటా తన హోమ ధేనువుకోసం వెతికాడు. చివరకు యోగదృష్టితో జరిగినది తెలుసుకొని వసువులను మీరు మానవ జన్మను ఎత్తాలంటూ మహర్షి శపించాడు. తమ తప్పును మన్నించమని గురువును వేడుకున్నారు వారు. ఆ క్రమంలో త్వరగా మానవ జీవితాన్ని ముగించుకోవాలనుకుని వారు నా సాయం అడిగారు. అందుకోసమే వారికి నేను సాయం చేసాను అని గంగ శంతనుడికి జరిగిన కథను చెప్పింది

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము