నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మ. తన కాజ్ఞావశవర్తులై మహి సమస్తకత్త్రవం శేశు లె
ల్లను భక్తిం బనిసేయుచుండఁగ విశాలం బైన సత్కీర్తి ది
గ్వనితా వౌక్తిక దామ లీల వెలుఁగన్ వారాశిపర్యంత భూ
జన రక్షాపరుఁడయ్యె శంతనుఁడు రాజద్రాజ ధర్మస్థితిన్

భావం: భూతలంపై క్షత్రియ వంశీయులైన రాజులందరూ వినయంతో శంతనుడి ఆదేశాలను పాటిస్తూ సేవలందిస్తున్నారు. ఉత్తమకీర్తి, దిక్కులనే వనితలకు ధరింపచేసిన ముత్యాల దండ మెరిసిపోతున్న తీరులో శంతనుడి కీర్తిప్రతిష్టలు వెలుగొందుతున్నాయి. సమస్త సముద్రాల వరకు విస్తరించిన రాజధర్మ వ్యవస్థను, పుడమిని, ప్రజలను రక్షించడంలో రాజాధిరాజైన శంతనుడు నిమగ్నమైనాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము