నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ. అనిన సదస్యులందఱుఁ బ్రియంబున ‘నిట్టి విశిష్ట విప్రము
ఖ్యునకు మహాతపోధనునకుం దగు పాత్రున కెద్ది యిచ్చినన్
ఘనముగ నక్షయం బగును గావున నీ ద్విజనాథుకోర్కి ఁబెం
పున వృథ సేయఁగాఁ దగదు భూవలయేశ్వర! యిమ్ము నెమ్మితోన్

భావం: అని అస్తీకుడు అడుగగా సభ్యులందరున్నూ ‘తగిన వాడు ఆర్హుడు , గొప్పతపస్సే ధనంగా కలవాడు అయిన ఇటువంటి ఉత్తమ బ్రాహ్మణుడికి ప్రీతితో ఏది ఇచ్చినా అది మిక్కిలి క్షయం లేనిది అవుతుంది. కాబట్టి ఓ రాజా! ఈ బ్రాహ్మణ శ్రేష్ఠునికోరిక వ్యర్థం చేయటం తగదు. గౌరవం తోను, ప్రేమతోను ఇతను అడిగింది ఇవ్వండి. (యజ్ఞాన్ని మానేటట్లు చేయండి) ఆస్తీకుడు అడిగినది విన్న సభాసదులందరూ మహారాజును ఉద్దేశించి ఇట్లాచెప్పారు. దానం చేయడం శ్రేష్ఠమే అయనా అడిగినదే దానం ఇవ్వడం ఇంకా ఉత్తమోత్తమైన దానంగా పరిగణించబడుతుంది. కనుక ఈ తపస్సనే ధనం కల ఉత్తముడైన విప్రుని కోరికను తీరిస్తే మీకు మేలు కలుగుతుంది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము