డైలీ సీరియల్

ఒయాసిస్ 21

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరన్నా వచ్చినపుడు చాలా అన్యోన్యంగా ఉంటున్నట్లు ప్రవర్తిస్తాం.. ఎవరైనా అంతే..’’
‘‘చివరగా ఒక మాట.. వైస్ ప్రిన్సిపాల్ ఛాయగారికి వాళ్లింట్లో బాగా చనువుంది. ఆ ఇంట్లో ఆమె పాత్ర ఎలాంటిది?’’
‘‘ఆ ఇంట్లో ఆమె బాగా చనువుగా మసులుతుందని మాత్రం తెలుసు’’
‘‘్ఛయగారి గురించి మీ అభిప్రాయం?’’
సింహాద్రి ఆలోచిస్తూ, ఆగి, ఆగి, ఒక్కోమాటే చెప్పాడు.
‘‘ఆమె బాగా చదువుకుంది. తెలివిగలది.. ఏ సందర్భంలో ఎలా మెలగాలో తెలుసు. ఎవర్ని ఎలా టాకిల్ చెయ్యాలో తెలుసు’’.
ఆ చివరి వాక్యంతో రణధీర్‌కి మొత్తం అర్థమైపోయింది.
ఆయన దగ్గర సెలవు తీసుకుని బయటకు నడిచాడు.
రణధీర్ డాక్టర్ హేమంత్‌ని కలవడానికి వెళ్లాడు. అది చాలా పెద్ద హాస్పిటల్. అక్కడ డాక్టర్లందరూ ఆయా విభాగాల్లో ఆరితేరినవాళ్ళు. మంచి పేరు, ప్రతిష్ఠలు అనుభవం సంపాదించినవాళ్ళు.
హేమంత్ కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఆయన కోసం చాలా మంది నిరీక్షిస్తున్నారు.
గంటసేపు ఎదురుచూసిన తర్వాత హేమంత్‌కి ఖాళీ సమయం దొరికింది. అపుడు రణధీర్ లోపలికి వెళ్లి తనను పరిచయం చేసుకున్నాడు.
‘‘డాక్టర్ శే్వతగారి మర్డర్ కేసు నేను ఇనె్వస్టిగేట్ చేస్తున్నాను. ఆమెతో పరిచయం ఉన్నవాళ్ళందర్నీ కలిసి ఏ చిన్న క్లూ అయినా దొరుకుతుందా అని చూస్తున్నాను. మీ నుంచి కూడా ఏదన్నా సమాచారం లభిస్తుందేమోనని వచ్చాను..’’
‘‘ఇటీజ్ వెరీ అన్‌ఫార్చునేట్.. స్టూడెంట్స్‌గా ఉన్నప్పటినుంచి మేం ఫ్రెండ్స్. అందరికీ హెల్ప్ చేయాలన్న ఆలోచన తప్ప పొరపాటునన్నా అపకారం చేసే మనిషి కాదు. అంత మంచి డాక్టర్‌ని అలా కర్కశంగా, దారుణంగా చంపడానికి చేతులెలా వచ్చాయో..? ఆమె మీద అంత కసి, ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం ఏమిటో.. అంతా మిస్టరీగా ఉంది..’’ అన్నాడు హేమంత్.
‘‘చాలాకాలం నుంచీ మీరు ఫ్రెండ్స్ అంటున్నారు గదా.. చిన్నప్పటినుంచీ మీకు తెల్సినదంతా, గుర్తున్నదంతా చెప్పండి..’’ అని అడిగాడు రణధీర్.
‘‘చిన్నప్పటినుంచీ కాదు. మెడికల్ కాలేజీలో చేరినప్పటినుంచే పరిచయం. మా బ్యాచ్‌లో వాళ్ళందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతుండేవాళ్ళం..’’
‘‘కాలేజీలోనేనా? బయట కూడా కల్సుకుంటుండేవాళ్లా?’’
‘‘అప్పట్లో బయట కూడా కల్సుకుంటుండేవాళ్ళం..’’
‘‘సినిమాలూ, షికార్లు..’’
హేమంత్ నవ్వాడు. ‘‘సినిమాలకు ఎక్కువ వెళ్ళేవాళ్ళం కాదు.. ఎవరింట్లో ఏదన్నా ఫంక్షన్ జరిగితే మా సర్కిల్‌లో వాళ్ళందర్నీ పిలుస్తుండేవాళ్ళు. అలా కలుసుకున్నపుడు సరదాగా కబుర్లు చెప్పుకోవడం, జోకులు వేసుకోవడం, అంతా ఫ్యామిలీ మెంబర్స్‌లాగా మూవ్ అయ్యేవాళ్ళం..’’
‘‘శే్వత మీ ఇంటికి రావడం, మీ ఫ్యామిలీ వాళ్ళతో మూవ్ కావడం లేక మీరు ఆమె ఇంటికి వెళ్లడం, వాళ్ళ ఫ్యామిలీతో మూవ్ కావడం జరిగేదా?’’
‘‘ఒకటి రెండుసార్లు మా ఇంట్లో ఫంక్షన్స్‌కి వచ్చింది. మా ఇంట్లో వాళ్ళందరికీ శే్వత తెలుసు.. ఒకసారి నేను వాళ్ళ మదర్‌కి బాగాలేదంటే వెళ్లాను..’’
‘‘ఇఫ్ యూ డోంట్ మైండ్.. ఒక పర్సనల్ కొశ్వన్.. మీరు ప్రేమించుకున్నారా?’’ అని అడిగాడు రణధీర్.
‘‘ప్రేమించుకున్నాం అని కాదు గానీ, వుయ్ లైక్ ఈచ్ అదర్..’’
‘‘ఒక స్ర్తి ఒక పురుషుడి మధ్య మొదట పరిచయం కలుగుతుంది. అది స్నేహంగా మారుతుంది.. ఇష్టం ఏర్పడుతుంది. ఆకర్షణ కలుగుతుంది. మనసులు కలిసాక, మనుషుల కలయిక కోసం తహతహ ఏర్పడుతుంది.. దీనే్న ప్రేమ అంటారు.. మీ ఇద్దరిమధ్యా పరిచయం, లేదా స్నేహం ప్రేమ దాకా వచ్చిందని విన్నాను. నిజమేనా?’’ అని అడిగాడు రణధీర్.
‘‘ఆ వయసులో వుండే ఆకర్షణ చాలా బలంగా వుంటుంది. కొంతకాలం దూరమైతే ఆ ఆకర్షణకుండే బలం తగ్గిపోతుంది. మీరు చెప్పిన ఈక్వేషన్ రివర్స్ గేర్‌లోకి వెళ్లిపోతుంది. ప్రేమ తగ్గిపోయి, కొన్నాళ్లకి ఇష్టం తగ్గిపోయి, స్నేహమూ దూరమైపోయి, పరిచయమూ మాయమైపోతుంది. ఒకప్పటి ప్రేమికులు కొనే్నళ్ళపాటు దూరమయ్యాక ఒకరి మొహం ఒకరు చూడటానికే ఇష్టపడరు’’ అన్నాడు హేమంత్. ‘‘కొనే్నళ్ళపాటు పూర్తిగా దూరమైన వారి సంగతి సరే.. అదలా ఉంచండి.. మొదట అయాచితంగా, అతి సహజంగా ఏర్పడ్డదే అసలైన ప్రేమ అని, ఆ తర్వాత మనసు మళ్లించుకుని ఏర్పర్చుకునేవన్నీ అసహజమైన ప్రేమలనీ, బలవంతపు ప్రేమలనీ అంటాను.. మీరు శే్వతను పెళ్లి చేసుకోవాలనుకున్నారా? ఆమెతో ఆ విషయం చెప్పారా?’’ అని అడిగాడు రణధీర్.
‘‘మేం వృత్తిలో స్థిరపడిన తర్వాతగానీ పెళ్లి గురించి ఆలోచించలేం.. శే్వతకు అదృష్టం కలిసొచ్చింది. అహోబలరావుగారి దృష్టిలో పడింది. ఆయనతో వివాహమంటే పరమపద సోపాన పటంలో పెద్ద నిచ్చెన ఎక్కినట్లే భావించాలి. ఆయనతో శే్వత వివాహం సెటిలయ్యాక, శే్వతతో అదే చెప్పాను.. ఆ వివాహంతో ఆమె జీవితం అనూహ్యమైన స్థాయికి ఎదిగింది. ఆయనతో పెళ్లి జరగకపోయుంటే, ఆమె ఎక్కడో నెల జీతానికి పనిచేయాల్సి వచ్చేది. కానీ ఆయన భార్య కావడంవల్ల స్వంతంగా నర్సింగ్ హోం పెట్టి, ఇటు పేరు ప్రఖ్యాతులు, అటు డబ్బు సంపాదించుకోగలిగింది’’ అన్నాడు హేమంత్.

- ఇంకాఉంది

శ్రీధర