డైలీ సీరియల్

ఒయాసిస్ 24

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హై పొటెన్సీ మందులు. అవి వేసుకున్నప్పటినుంచీ ఆయన గుండె విపరీతంగా కొట్టుకుంటూ మనిషికి కిందా మీద అయ్యేవాడు. అరగంటదాకా నానా అవస్థపడేవాడు. నెల రోజుల్లో ఏనుగులాంటి మనిషి పీనుగలాగ తయారయ్యాడు. ఏవన్నా మందులు వేసుకుంటే ఉన్న బాధ తగ్గాలి. కానీ ఇదెక్కడి చోద్యం? మందులు మింగితే లేనిరోగం పట్టుకుంది. నేను పట్టుబట్టి నాలుగు రోజులు ఆ మందులు వేసుకోవటం ఆపేయించేశాను. మనిషి మళ్లీ శుభ్రంగా తయారయ్యాడు’’ అన్నది ఛాయ.
‘‘అంటే రోగాన్ని డయాగ్నయిజ్ చేయటంలో పొరపాటు అయ్యుంటుందా? అందుకే చాలామంది ఒక డాక్టర్ దగ్గర పరీక్ష చేయించుకొని ఆ డాక్టర్ రోగ నిర్థారణ చేశాక, మరొక డాక్టర్ దగ్గరకు వెళ్లి పరీక్ష చేయించుకుంటారు. సెకెండ్ ఓపీనియన్ తీసుకోవటం మామూలుగా జరిగే విషయమే’’
‘‘నిజమే.. డాక్టర్ రోగ నిర్థారణ చేసే సమయంలో పొరపాటు పడొచ్చు. కానీ పరీక్షలు చేసేటప్పుడు మెషీన్స్ కూడా పొరపాటు పడుతుంటాయా?’’ అని అడిగింది ఛాయ.
‘‘మెషిన్స్ పొరపాటు పడకపోవచ్చు. అనేక కారణాలవల్ల తప్పుడు రిపోర్ట్సు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉంటున్నాయి. ఉదాహరణకి ఒక ల్యాబ్‌లో టెస్ట్ చేయించుకుంటే వచ్చే రిపోర్ట్సుకి, మరో ల్యాబ్‌లో టెస్ట్ చేయించుకుంటే వచ్చే రిజల్ట్సుకి చాలా వ్యత్యాసం వుంటుంది. రాంగ్ రిపోర్ట్సుని బట్టి డాక్టర్ రోగనిర్థారణ విషయంలోనూ రాంగ్ డయాగ్నయిజ్ చేస్తాడు. అది డాక్టర్ తప్పుకాదు’’
‘‘అహోబలరావుగారి విషయంలో జరిగింది చెప్పాను. ఇందులో ఎక్కడ ఎవరు తప్పు చేశారన్నదాన్ని నేను నిర్ణయించలేను.. ఒకరకంగా ఆయన ఆరోగ్యానికి మందులు తీసుకుంటున్నాననుకుంటూ, లేని అనారోగ్యానికి గురవుతుంటే ఆ మందులు ఆపించి, ఆయన్ను మళ్లీ మనిషిని చేశానని ఆయనకు నేనంటే గురి.. అభిమానం...’’ అన్నది ఛాయ.
‘‘మరి అందుకు ఆయన నీకు బహుమానం ఏమీ ఇవ్వలేదా?’’ అని అడిగాడు.
‘‘త్వరలో ఇవ్వబోతున్నారు. నాకు కాలేజీ ప్రిన్సిపాల్‌గా ప్రమోషన్ ఇవ్వబోతున్నారు’’ అన్నది ఛాయ నవ్వుతూ...
రణధీర్ చెయ్యి చాపాడు. ఆమె చెయ్యి కలిపింది. ఆమె చెయ్యి పట్టుకుని లాగాడు. ఆమె ముందుకు తూలింది.
‘‘అబ్బా.. ఏమిటీ మోటుసరసం..’’ అన్నది కోపం తెచ్చుకుని.
‘‘ప్రిన్సిపాల్ అయ్యాక మంచి పార్టీ ఇవ్వాలి..’’ అన్నాడు రణధీర్.
‘‘తప్పకుండా..’’ అన్నది ఛాయ.
‘‘మరి ఈనాటి కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం’’ అన్నాడు రణధీర్ వెళ్ళటానికి లేచి నిలబడుతూ..
‘‘తదుపరి కార్యక్రమాలేం లేవా?’’ అని అడిగింది ఛాయ.
‘‘ప్రమోషన్ వచ్చాక పెద్ద పార్టీ ఇద్దువుగానీ’’ అన్నాడు రణధీర్ బయటకు వెళ్తూ..
ఛాయ కిందదాక వచ్చి ఆయన్ని సాగనంపింది.
ఈమె ఎందుకు తననింత కవ్విస్తోంది..? ఇందులో ఏదన్నా పరమార్థం దాగుందా? అని ఆలోచించాడు కారు డ్రైవ్ చేస్తూ.
***
7
ఉదయం తొమ్మిది గంటల సమయంలో రణధీర్ ఇంట్లో టిఫిన్ చేస్తున్నాడు.
సెల్‌ఫోన్ మోగింది. సత్యభామ మాట్లాడింది.
‘చక్రపాణిగారు ఉన్నారా?’’ అన్నది అవతలి స్వరం.
‘‘చక్రపాణా, వాడెవడు?’’ అని అడిగింది సత్యభామ.
‘‘సినీ ప్రొడ్యూసర్.. చక్రపాణిగారు..’’
‘‘రాంగ్‌నెంబర్..’’ అని సత్యభామ ఫోన్ నొక్కేసింది.
‘‘ఎవరూ?’’ అని అడిగాడు రణధీర్.
‘‘ఎవడో సినీ ప్రొడ్యూసర్ చక్రపాణి కావాలట.. రాంగ్ నెంబర్’’ అన్నది సత్యభామ.
మళ్లీ ఫోన్ మోగింది. ఈసారి చెంగున ముందుకు దూకి రణధీర్ అందుకున్నాడు. ఫోన్ తీసుకుని బయటకు నడిచాడు.
‘‘ఎవరో మీది రాంగ్ నెంబర్ అంటున్నారు.. ఆవిడెవరు?’’ అని అడిగింది దీప్తి.
‘‘మనవాళ్లేలే... ఏంటి పొద్దునే్న?..’’’
‘‘మన పిక్చర్ గ్రాండ్‌గా రావాలని గుడికొచ్చి మీ పేరున అర్చన చేయించాను.. మీకు ప్రసాదం ఇద్దామని..’’
‘‘్థంక్యూ... థాంక్యూ..’’
‘‘ఎక్కడున్నారో చెప్పండి. నేను మీ దగ్గరకొస్తాను..’’ అన్నది దీప్తి.
‘‘ఎందుకు నేనే బయల్దేరుతున్నాను.. ఎక్కడున్నావో చెప్పు.. పది నిముషాల్లో వస్తాను..’’ అన్నాడు రణధీర్.
ఆమె చెప్పింది.
రణధీర్ బయల్దేరుతుంటే సత్యభామ అడిగింది.
‘‘ఎవత్తె అది? అది పిలవగానే పరుగు పరుగున పోతున్నారు?’’ అని అడిగింది సత్యభామ.
‘‘నాకు ఎవరు ఫోన్ చేస్తారు చెప్పు?.. అదో నేరస్థురాలు..’’ అన్నాడు రణధీర్.
‘‘అదీ, మీరూ కల్సి ఏం నేరం చేయబోతున్నారు..?’’ అని అడిగింది సత్యభామ.
‘‘నీకు నమ్మకం లేకపోతే చెప్పు. రాజీనామా ఇచ్చి నీకెదురుగా కూర్చుంటాను..’’ అన్నాడు ఆమె కెదురుగా కూర్చుంటూ.
‘‘నాకెదురుగా చాలాకాలం నుంచి కూర్చుంటూనే ఉన్నార్లెండి. ఇప్పుడదెవతో మీకెదురుగా కూర్చోవాలనుకుంటోంది. మీరూ ఓ.. ఒకటే తొందరపడిపోతున్నారు..’’ అన్నది సత్యభామ మొహం తిప్పేసుకుని.
‘‘అంత అసూయ ఎందుకు సత్యా?’’ అన్నాడు ఆమె నడుం చుట్టూ చేతులు వేస్తూ.. ఆమెను ఎలా ప్రసన్నం చేసుకోవాలో అతనికి తెలుసు.

- ఇంకాఉంది

శ్రీధర