డైలీ సీరియల్

ఒయాసిస్ 26

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ముద్దుపెట్టుకునే చోటు అది కాదు..’’ అన్నాడు రణధీర్.
‘‘మన సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది?’’ అన్నది దీప్తి అసలు విషయానికొస్తూ..
‘‘వంద కోట్ల బడ్జెట్.. డబ్బు రెడీగా వుంది.. హీరోల డేట్స్ కోసం అయిదారు నెలలు ఆగాల్సి వచ్చేటట్లుంది..’’ అన్నాడు రణధీర్.
‘‘వంద కోట్లు.. యూ ఆర్ గ్రేట్.. నన్ను హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్లేనా?’’ అన్నది దీప్తి.
‘‘ష్యూర్.. వచ్చే నెలలో మంచి రోజు చూసి జూబ్లీ హిల్స్‌లో ఒక బిల్డింగ్ తీసుకుని ఆఫీసు ఓపెన్ చేస్తాను.. అప్పుడు పూజా కార్యక్రమం అయ్యాక, అదే రోజు అగ్రిమెంట్ మీద సంతకం తీసుకోవటం, చెక్ ఇవ్వటం- మొదటి చెక్ నీకే ఇస్తాను.. ఇంతకీ నీకు రెమ్యూనరేషన్ ఎంత కావాలో చెప్పు..’’ అన్నాడు రణధీర్ దీప్తి భుజాలమీద చేతులు వేసి దగ్గరకు తీసుకుంటూ.
‘‘నాకు ఛాన్స్ ఇస్తున్నారు.. అసలు ఏ హీరోయిన్ ఎంత తీసుకుంటుందో కూడా తెలియదు.. అంచేత మీరు ఏమిచ్చినా సంతోషమే..’’ అన్నది దీప్తి పెదాలు అందిస్తూ.
‘‘నీకు డబ్బు కావాలంటే, ముందు పాతిక లక్షలు ఇస్తాను.. పిక్చర్ హిట్ అయ్యాక ఇంకో పాతిక ఇస్తాను.. లేదూ.. పిక్చర్‌లో టెన్ పర్సెంట్ రైట్స్ కావాలంటే అలా అయినా ఇస్తాను..’’ అన్నాడు రణధీర్.
దీప్తి సంతోషంతో కన్నీళ్ళు పెట్టుకుంది. కళ్ళు తుడుచుకుని ఆనందం పట్టలేక రణధీర్‌ని ముద్దుపెట్టుకుంది.
‘‘ఇవాళనుంచీ నా జీవితం గొప్ప మలుపు తిరగబోతోంది.. మీ డైరైక్టర్, మిగతా టీంని పరిచయం చెయ్యరా?’’ అని అడిగింది గోముగా.
‘‘అలాగే.. ప్రస్తుతం హోటలు రూంలోనే స్టోరీ సిట్టింగ్స్, స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.. ఈ వారంలోనే నిన్ను డైరెక్టర్‌కి పరిచయం చేస్తాను.. నీ గురించి చెప్పాను.. అతను కూడా ఓసారి మేకప్ టెస్ట్ చేయిద్దామన్నాడు. ఏమక్కర్లేదయ్యా.. ఆ అమ్మాయిది చాలా స్మయిలింగ్ ఫేస్.. మన కారెక్టర్‌కి బాగా సూట్ అవుతుందని చెప్పాను... ఇంతకీ ఉద్యోగం మానేస్తున్నాట్లేనా?’’ అని అడిగాడు రణధీర్.
‘‘లెవెల్ మెయిన్‌టైన్ చెయ్యాలి కదా.. ఇల్లు కూడా మార్చేసి మంచి అపార్ట్‌మెంట్‌లోకి షిప్ట్ అవుతాను.. మీరే ఎక్కడన్నా చూడండి.. ఇక తరచూ మీరు వస్తుంటారు గదా...’’’
‘‘తప్పకుండా.. నువ్వు ఇప్పటిదాకా పనిచేసింది ఏ కాలేజీ అన్నావు?...’’
‘‘ఆ, అదో డొక్కు కాలేజీ, బాలాజీ అని...’’
‘‘అహోబలరావుగారిదా..’’
‘‘ఆ, ఆయనదే..’’
‘‘మొన్నీ మధ్య ఆయన భార్యను ఎవరో మర్డర్ చేశారు గదా.. పేపర్లో, టీవీల్లో వచ్చింది.. ఎందుకలా జరిగింది పాపం..’’ అని అడిగాడు రణధీర్.
‘‘ఊరికే ఎవడైనా ఎందుకు చంపుతాడు ఈ సిటీలో ఇన్ని లక్షలమంది బతుకుకతున్నారు. ఎవరి జోలికి ఎవరు వెళ్తున్నారు?.. ఒక మనిషిని పనిగట్టుకుని, దానికి పెద్ద ప్లాన్ వేసుకుని, వెళ్లి కసకసా పొడిచి చంపాడంటే, ఈవిడేమీ చెయ్యకుండానే వాడంత కచ్చ గడతాడా? హత్య అనేది ఎప్పుడూ యాక్షన్ కాదు. అది రియాక్షన్ మాత్రమే. అసలు హత్యకు గురి అయిన మనిషి ఎంతో ద్రోహం, మోసం చేస్తేనేగాని, హంతకుడు చంపడు.. కానీ చచ్చిపోయినవాడు చేసిన మోసానికి ఏ శిక్షా ఉండదు. హంతకుడికి మాత్రం శిక్ష వేస్తారు.. భూతద్దాలు వేసి వెతికి పట్టుకుని.. ఏమంటారు? యామై కరెక్ట్..?’’ అన్నది దీప్తి ఆవేశంగా
‘‘చాలా కరెక్ట్.. చట్టానికి దొరకనంతవరకూ ప్రతివాడూ పెద్దమనిషే..’’ అన్నాడు రణధీర్. ‘‘నేను ఇంకొక రూమర్ కూడా విన్నాను.. ఆ నర్సింగ్ హోంలో పెళ్లికాని అమ్మాయిలకు అబార్షన్స్ చేస్తుంటారట..’’
‘‘పెళ్లి అయితే ఎవడిక్కావాలి?.. కాకపోతే ఎవడిక్కావాలి..? ఒక స్ర్తికి తన శరీరంలో ఎప్పుడు ఎలాంటి మార్పులు కావాలో, రావాలో నిర్ణయించుకునే హక్కు ఉంది. అబార్షన్ కాదు అసలు పాయింట్.. అక్కడ జరుగుతున్న అసలు బాగోతం వేరే ఉంది..’’ అన్నది దీప్తి ఆవేశంగా.
‘‘ఏంటది?’’ అని అడిగాడు రణధీర్ ఆసక్తిగా.
‘‘ఏంటదా? సరోగసీ.. ఈ పేరుతో ఆ డాక్టర్ రెండు పార్టీలను మోసం చేస్తోంది..’’ అన్నది దీప్తి.
‘‘ఓ, ఇది కూడా నడుస్తోందా అక్కడ?..’’ అన్నాడు రణధీర్.
‘‘డీల్ మాట్లాడుకున్నాక, దానికి కట్టుబడి ఉండాలా అక్కర్లేదా?’’ అని అడిగింది దీప్తి.
‘‘తప్పకుండా.. నీకు పాతిక లక్షలు ఇస్తానన్నాను. అన్న తర్వాత మాట తప్పకూడదు.. కావాలంటే సాయంత్రం ఐదు లక్షలు అడ్వాన్స్ ఇమ్మంటే ఇస్తాను..’’ అన్నాడు రణధీర్.
‘‘మీరు ఆ అడ్వాన్స్ ఇస్తే నాకెంతో మేలు చేసినవాళ్ళు అవుతారు..’’ అన్నది దీప్తి.
‘‘తప్పకుండా ఇస్తాను. ఇవాళేంటి? అష్టమి అనుకుంటా.. దశమిగాని, ఏకాదశిగాని ఇస్తాను.. ఇప్పటికిప్పుడు అర్జంటుగా ఏమన్నా కావాలా?’’ అని అడిగాడు రణధీర్.
‘‘మీ దగ్గర ఎంతుంది?’’ అడిగింది దీప్తి.
‘‘అయిదు వేలు..’’ అన్నాడు రణధీర్.
‘‘నాలుగు వేలు ఇవ్వండి.. ఒక వెయ్యి మీ ఖర్చులకు ఉంచుకోండి..’’ అన్నది దీప్తి.
రణధీర్ నాలుగు వెయ్యి రూపాయల కాగితాలు ఇచ్చాడు. దీప్తి తీసుకుని, హేండ్ బ్యాగులో పెట్టుకుంది.
‘‘ఇలా చిల్లరగా తీసుకుంటున్నందుకు ఏమీ అనుకోకండి.. ఇల్లు మారుతున్నాను.. షిఫ్టిగ్‌కి కొంచెం తక్కువైంది..’’ అన్నది దీప్తి.
‘‘ఓ ఇల్లు మారుతున్నావా? నన్ను చూడమన్నావు ఇల్లు..’’ అని నవ్వాడు రణధీర్.
‘‘మీరు చూసే ఇంట్లోకి మీ ఇల్లాలిగా మీతోపాటు గృహప్రవేశం చేస్తాను.. అందుకు కొంచెం సమయం పట్టొచ్చు. ఈలోగా ఇప్పుడున్న పోర్షన్ ఖాళీ చేయమంటోంది మా ముసల్ది..’’ అన్నది దీప్తి.

- ఇంకాఉంది

శ్రీధర