డైలీ సీరియల్

ఒయాసిస్ 34

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కానీ పనివాళ్లు ఎంతమంది ఉన్నా, వాళ్లు ఇంటికి కాపలా ఉంటారేగానీ, ఆయనకు అడ్డు చెప్పలేరు. భార్య ఇక్కడ ఉండదు. భార్య చేయవల్సిన పని, భార్య స్థానంలో ఆయన అధీనంలో ఇన్ని నెలలపాటు ఉంటే, ఆయన బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందోనన్న భయంతో, సెక్యూరిటీ ఉండదన్న అభిప్రాయం ఏర్పడింది..’’
‘‘దీప్తితోపాటు నువ్వు ఆయన ఇంటికి వెళ్లావా? ఆయన్ను కలిసి మాట్లాడావా?’’ అని అడిగాడు రణధీర్.
‘‘వెళ్లాను. ఆయనతో గంటసేపు ఇద్దరం మాట్లాడాం.. మీకేం భయంలేదని ఆయన చెప్పినా, మాకు నమ్మకం కురదరలేదు.. ఈ విషయమే శే్వతగారితోనూ దీప్తి చెప్పింది. ఇదిలా ఉండగా.. ఇంకో విషయమేమిటంటే ఆయన రెండు లక్షలకన్నా ఎక్కువ ఇవ్వనంటున్నారనీ, లక్షకు కూడా ఒప్పుకునేందుకు రెడీగా ఉన్నారనీ శే్వతగారు దీప్తితో బేరానికి దిగారు. ఇదంతా ఏదో మోసంలా వుందనీ, తనకి ఇష్టం లేదనీ అబార్షన్ చెయ్యమనీ.. దీప్తి ఆమె చుట్టూ తిరగడం మొదలుపెట్టింది.. ఇప్పటికే పాతికవేలు ఇచ్చాం గనుక, అబార్షన్ కుదరదని ఆమె చెబుతూ వచ్చింది.
‘‘ఇదిలా ఉండగానే, శే్వతగారు హత్యకు గురైనారు. ఆ మర్నాడే దీప్తి ఐదువేలు నర్స్‌కి ఇచ్చి అబార్షన్ చేయించుకుంది. ఒక పక్క నాతో ఉంటూ, నా మాట వింటున్నట్లు నటిస్తూనే, దీప్తి నాకు తెలియకుండా రాజశేఖర్‌గారితో కాంటాక్ట్‌లో ఉంటోంది. ఆయన చాలా పెద్ద ఆశలు కల్పించాడు. నా ముందే ఆయన నుంచివచ్చిన కాల్స్‌ను ఆన్సర్ చేసేది. పూర్తిగా తెలియకపోయినా, దీప్తి క్రమంగా ఆయనకు దగ్గరవుతోందని, అయన ట్రాప్‌లోకి వెళ్లిపోతోందనీ అర్థమైంది. తను విడిగా ఉంటాననీ, ఇక తనతో కాంటాక్ట్ పెట్టుకోవద్దనీ నాకు స్పష్టంగా చెప్పింది. మా ఇద్దరిమధ్యా పెద్ద ఫైటింగ్ జరిగింది. కొట్టుకున్నాం.. అప్పటికప్పుడు తన బట్టలు, సామానూ తీసుకుని వెళ్లిపోయింది. ఇప్పుడు దీప్తి రాజశేఖర్‌గారి అధీనంలోకి వెళ్లిపోయింది.. ఇదీ జరిగింది..’’ అన్నాడు సతీష్.
‘‘ముసలమ్మ నగల సంగతేంటి?’’ అని అడిగాడు రణధీర్.
‘‘నేనే చేశాను సర్. తప్పయిపోయింది.. ఎప్పటినుంచో ఆ నగలు కొట్టెయ్యలన్న ఆలోచన ఉంది. దీప్తి వెళ్లిపోయింది. నేనూ ఇంకొక ఫ్రెండ్ రూంకి షిప్ట్ అయ్యాను. డబ్బు ఇబ్బందివల్ల తప్పు చేశాను.. క్షమించండి..’’ అంటూ సతీష్ వంగి ఆయన పాదాలు పట్టుకునే ప్రయత్నం చేశాడు.
రణధీర్ క్షణకాలం ఆలోచించాడు.. ‘‘వీడు బయట ఉంటే డబ్బుకోసమైనా దీప్తి వెనకాల పడతాడు. ఏదో టైంలో వాడి గొప్ప చెప్పుకోవటానికి రణధీర్ అనే ఇన్స్‌పెక్టర్ తనకు తెల్సునని దీప్తికి చెప్పినా చెప్పవచ్చు. దీప్తి దృష్టిలో తను చక్రపాణి.. సినిమా ప్రొడ్యూసర్.. కొంతకాలం తను ఆ పాత్ర పోషించాలి.. అంచేత వీడు బయట ఉండటం అంత మంచిది కాదు..’’ అనుకున్నాడు.
సతీష్ దొంగిలించిన నగలు, డబ్బూ తెచ్చిస్తానని శంభూప్రసాద్ కాళ్లు పట్టుకున్నాడు.
ఆ డబ్బు, నగలూ జానకమ్మకి ఇప్పించాడు శంభుప్రసాద్. సతీష్‌ని మాత్రం రిమాండ్‌లో ఉంచే ఏర్పాటు చేశాడు.
‘‘కొన్నాళ్లు వీడ్ని రిమాండ్‌లో ఉంచు..’’ అని శంభుప్రసాద్‌కి చెప్పాడు రణధీర్.

10
దీప్తి, రణధీర్ స్టార్ హోటల్లో కూర్చున్నారు. దీప్తి చాలా సంతోషంగా ఉంది. ఊరుకూరికే పకపకా నవ్వేస్తోంది. టిఫిన్లు వచ్చాయి. తిన్నారు. కాఫీలు తాగారు.
‘‘ఏమి ఇవ్వాళ చాలా జోరుమీదున్నావు? ఏదో నక్కను తొక్కినట్లున్నావు..’’ అన్నాడు రణధీర్.
‘‘నిజంగానే చాలా హేపీగా ఉన్నాను. కారణం ఏమిటో చెప్పుకోండి..’’ అన్నది దీప్తి.
‘‘సంబంధం కుదిరిందేమో..’’ అన్నాడు రణధీర్.
‘‘మీకు తెలియకుండా సంబంధం ఎలా కుదురుతుంది? అది కాదు. ఇంకేదో ఉంది.. గెస్ చెయ్యండి..’’ అన్నది దీప్తి.
‘‘లాటరీ ఏమైనా తగిలిందా?’’
‘‘లాటరీ కాదు గానీ దాదాపు అలాంటిదే.. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి నేను యం.డి అయ్యాను..’’ అన్నది దీప్తి నవ్వుతూ.
‘‘అవునా.. అమ్మదొంగా.. చెప్పవేం? సో గ్లాడ్.. నిజంగా అదృష్టం నిన్ను తుమ్మబంకలా అంటుకుంటోంది..’’ అన్నాడు దీప్తి భుజాల చుట్టూ చేసి వేసి దగ్గరకు అదుముకుంటూ.
‘‘ఇదంతా మీ చలవ.. ముందు మీరు హీరోయిన్ ఛాన్స్ ఇచ్చారు. అదింకా నెరవరకముందే మరో ఛాన్స్ వెతుక్కుంటూ వచ్చింది..’’ అన్నది దీప్తి.
‘‘అయితే మా సినిమా చెయ్యవా? ఇంకోర్ని చూసుకోవాలా?’’ అన్నాడు రణధీర్.
‘‘అదేం లేదండీ బాబూ.. మన పిక్చర్ స్టార్ట్ అయ్యేదాకా ఊరికే ఉండటం ఎందుకని? ఇంకోటి ఏంటంటే.. సినిమావాళ్లు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సిద్ధాంతాన్ని బాగా అమలుపరుస్తారు.. సినిమాల్లో సంపాదించేదానితో పాటు ఆదాయం వచ్చే ఆస్తులూ సమకూర్చుకుంటే ఆనక నిశ్చింతగా నిద్రపోవచ్చు..’’ అన్నది దీప్తి.
‘‘చాలా ఎదిగిపొయ్యావు. ఎంత ప్లాన్డ్‌గా ముందుకెళ్తున్నావంటే నువ్వు త్వరలోనే కోట్లకు పడగలెత్తుతావు.. నేను చెప్పే జోస్యం జరిగి తీరుతుంది..’’ అన్నాడు రణధీర్.
‘‘్థంక్స్.. అన్నిటికన్నా నాకు బాగా సంతోషంగా వున్న విషయం ఏమిటంటే, మీ చేతిలో పడ్డాను. ఇంక తిరిగి చూసుకోవాల్సిన పనిలేదు.. చెప్పండి.. మీకేం కావాలో కోరుకోండి..’’ అన్నది దీప్తి.
‘‘మంచి టిఫినూ.. కాఫీ. అయ్యాయి గదా.. చాలు..’’ అన్నాడు రణధీర్.
‘‘అదిసరే.. ఇంకేదన్నా..’’
‘‘ఇదయ్యాక సినిమాకెళ్దాం..’’
‘‘అది సరే.. ఇంకేదన్నా మంచి గిఫ్ట్ ఇవ్వాలని ఉంది..’’
‘‘ఇంకేం అడగను? నీ రియల్ ఎస్టేట్‌లో ఒక చిన్న ఫ్లాట్...’’

- ఇంకాఉంది