మంచి మాట

ధర్మ నిర్ణయము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్ష్మణుడు ‘‘రామా మరల బాల్యము పొందినవానివలె విచక్షణా జ్ఞానము లేనట్టి రాజు యొక్క మాటను రాజనీతి ఎరిగిన ఏ కుమారుడు పాటించవలయును? తండ్రియే విచక్షణ కోల్పోయినపుడు అతనిని శాసించి తీరవలయును. మహాకాలుని వలె స్థిరముగానున్న నినె్నదిరింపగల వాడెవ్వడు. వనమునకు వెళ్ళవలవదు. నీకండగా నేను నిలచెదను. రాజ్యాధికారము చేజిక్కించుకొనుము’’ అని నుడువ అంత వ్యాకులిత అయిన కౌసల్య ‘‘కుమారా, నీ తమ్ముడైన లక్ష్మణుడు పలికిన మాటలను వింటివి కదా! మహారాజు గౌరవ పూర్వకంగా నీకు పూజ్యుడైనట్లే నీ తల్లిని నీకు పూజ్యురాలను. నీ వనవాసనముకు నేననుమతింపను. కనుక నీవు వనములకు వెళ్ళవలదు’’ అనిన తల్లితోనూ, సోదరుడైన లక్ష్మణునకు రాముడిట్లనియెను.
‘‘అమ్మా! తండ్రి ఆజ్ఞను జవదాటుటకు నేను అశక్తుడను. పూర్వము కండుడను మహర్షి గొప్ప విద్వాంసుడు, వ్రతదీక్షాదక్షుడు. ధర్మ రహస్యముల నెరిగినవాడు. ఐనను తండ్రి యాజ్ఞమీరక గోహత్యగావించి తండ్రియాజ్ఞకు బద్ధుడయ్యెను. సగరుని పుత్రులు తండ్రి యానతి మీరక భూమిని తవ్వుచూ మృత్యువు పాలయిరి. తండ్రి యానతి మీరక తల్లి రేణుకను పరశురాముడు ఖండించెను. తండ్రి యానతి పాటించుట పూర్వులు అంగీకరించినది ధర్మాత్ములైనవారు అనుసరించినది. వారి మార్గమునే నేను అనుసరించుచున్నాను. జననీ ఈ లోకమున ప్రతి వ్యక్తియు పితృవాక్య పరిపాలన చేసియే తీరవలెను. అందులకు విరుద్ధముగా నేనేమియు చేయుట లేదు. తండ్రి మాట శిరసావహించిన వాడెవ్వడును ధర్మము నుండి పతనము కాడు’’. అనంతరం సోదరునితో ‘‘నాయనా లక్ష్మణా! నాపై నీకు గల ప్రేమ అపారము. నీ తేజస్సు తిరుగులేనిది. నేనెరుగును. సోదరా నాపై ప్రేమ కారణముగా మాతృమూర్తి నాసత్య నిష్ఠను, చిత్తస్థైర్యమును విస్మరించి, దుఃఖమునకు లోనైనది. కానీ సర్వమునెరిగి నీవును ఇట్లు పలుకుచుంటివేల?
లోకమున పురుషార్థములలో ధర్మము అగ్రగణ్యము. సత్యమునకు ధర్మమే ఆధారము. అత్యుత్తమమైన ఈ పిత్రాజ్ఞ ధర్మ సమ్మతమైనది. ధర్మ నిరతుడైన వాడెవ్వడైనను తండ్రి, తల్లి, బ్రాహ్మణుడు ఆదేశించిన పిమ్మట వారి ఆదేశము పాటించవలెను. కావున ఓ వీరా! మన తండ్రి చేసిన వాగ్దానమును అనుసరించియే కైకేయి నాకు వనవాసమును విధించినది. ధర్మమునకు విరుద్ధమైన దుష్ట రాజనీతిని వీడుము. ధర్మమును ఆశ్రయింపుము. నేను చెప్పిన ధర్మమార్గము గ్రహింపుము. పిమ్మట తల్లి కౌసల్యతో రాముడిట్లు నుడివెను. ‘‘తల్లీ! నా ప్రాణములపైన ఆన. నేను వనములకు వెళ్ళుట తథ్యము. అందులకు నన్ను అనుమతించి నీ శుభాశ్శీసులను ప్రసాదింపుము. యయాతి స్వర్గమును వీడి, మరల స్వర్గమును చేరినట్లు నా ప్రతిజ్ఞను నెరవేర్చుకొని పదునాలుగు సంవత్సరముల పిమ్మట అయోధ్యకు తిరిగి వచ్చెదను. ఓ జననీ! నీ హృదయమునుండి శోకమును తొలగింపుము. ఏ మాత్రము దుఃఖింపకుము. ఏలనన తండ్రి యజ్ఞానుసారము వనవాసము ముగించుకొని అయోధ్యకు మరలివచ్చెదను. తల్లీ నీవును, నేనును, వైదేహియు, లక్ష్మణుడును, తల్లి సుమిత్రా దేవియు తండ్రిగారి ఆజ్ఞను తలదాల్చవలసినవారమే. ఇదియే సనాతన ధర్మము. అమ్మా! పట్ట్భాషేక ద్రవ్యములను దూరమొనర్చుము. దుఃఖము నిగ్రహించుకొనుము. నా వనవాస నిశ్చయము ఆమోదింపుము. నన్ను ఆశీర్వదింపుము’’ అనగా పెక్కు భంగుల కౌసల్య చెప్పినను వినని రాముని ధర్మవచనములను ఎట్టకేలకు ఆమోదించిన తల్లితోను, లక్ష్మణునితోను ‘‘నాయనా, మహారాజు జ్ఞానవృద్ధుడు. మాన్యుడు అయిన ఆదేశమెట్టిదైనను మనమాచరింపవలసిందే. అట్లు చేయకుండుట అధర్మము. మహాదోషము. అట్టి నేను భరతుని పట్ట్భాషేకము, నా వనవాసము అని వరదాన రూపమైన తండ్రిగారి ప్రతిజ్ఞను మీరుటకు అశక్తుడను. వారి ప్రతిజ్ఞను అనుసరించుచు, వనవాసమేగెదను. తండ్రి ఆజ్ఞ నాకు, మనందరకు శిరోధార్యమని రాముడనెను. అట్టి రాముని పితృవాక్య పరిపాలన లోకమునకు మంగళదాయకము.

-పట్టిసపు శేషగిరిరావు