డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 9

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుస్తకాలుంటే చాలు నాకు, ఇంకేమీ అక్కర్లేదు. బజారుకెళ్లి చీరలు, నగలు కొనుక్కోవడంకంటే నాకిష్టమైన పుస్తకం కొనుక్కోవడమే నాకు ఎక్కువ తృప్తినిస్తుంది’’ అందామె సంతోషం నిండిన కళ్లతో.
‘‘మీరేమైనా అనుకోండి సాహిత్యగారూ.. మన మధ్య ఇంత సారూప్యత ఉన్నప్పుడు మన పరిచయాన్ని ఇక్కడితో ముగించడం నాకిష్టం లేదు’’ అన్నాడు సామ్రాట్ దృఢంగా.
సాహిత్య ఉలిక్కిపడింది.
‘‘అంటే ఏవంటారూ.. మనం రోజూ బస్ ఎక్కి ఇలా ఎక్కడో ఒకచోట దిగి సాహితీ చర్చ చేద్దామంటారా?’’ అంది.
ఆమె మాటల్లో మందలింపుకంటే ఆట పట్టించే ధోరణే ఎక్కువగా ధ్వనించడంతో ‘‘మనిద్దరిదీ ఒకే ఊరైనప్పుడు ఇలా ఊరూ, పేరూ తెలియని చోట కల్సుకుని మాట్లాడుకోవడమెందుకు? మీకూ నాకూ వీలైనపుడు మన ఊళ్ళోనే కల్సుకోవచ్చు, అందుకు మీకు నిజంగా అభ్యంతరం లేకపోతే!’’ వరాలిచ్చే దేవతవైపు ఆశగా చూసే భక్తుడిలా ఉన్నాడు సామ్రాట్.
‘‘నేను అనుకున్నంతా అయింది. మీరు నన్ను అభినందించడం కోసమే నాతో మాటలు కలిపినా చివరికిది చూశారా ఎక్కడికి దారితీస్తోందో!’’ అందామె అయిష్టంగా.
‘‘మన ఈ పరిచయాన్ని కొనసాగించడం నిజంగా మీకంత అయిష్టమా సాహిత్యగారూ?’’ అన్నాడు సామ్రాట్.
‘‘ఇష్టాయిష్టాల సంగతి అలా ఉంచితే మన పరిచయాన్ని కొనసాగించాల్సిన అవసరం నాకు కనబడడం లేదు’’ అందామె క్లుప్తంగా.
‘‘మరీ అంత నిర్దయంగా మాట్లాడకండి సాహిత్యగారూ. ఒకే విధమైన అభిరుచులు గలవాళ్లు జీవితంలో తారసపడటమే ఎంతో అరుదైన విషయం. అటువంటిది అనుకోకుండా మిమ్మల్ని కల్సుకునే అదృష్టం కలిగింది నాకు. మళ్లీ మిమ్మల్ని కల్సుకోవడం సాధ్యం కాదనే విషయం ఊహించాలంటేనే బాధగా ఉంది నాకు’’ అన్నాడు సామ్రాట్ చేజిక్కిన అదృష్టం చేజారిపోతోందనే బాధను మాటల్లో ధ్వనింపచేస్తూ.
కళ్లెత్తి చురుగ్గా అతడివైపు చూస్తూ అంది సాహిత్య., ‘‘చూడబోతే మీరు నేను ఊహించిన దానికంటే సున్నిత మనస్తత్వం కలవారిలా ఉన్నారు. నాకు తెలిసి ఒక వయసొచ్చాక మగవాళ్లు ఇంత సున్నితంగా ఆలోచించరు. మీ ధోరణి చూస్తోంటే ఇంతవరకూ ఎవరూ మీ మనసుకు దగ్గరగా రాకపోవడం గానీ లేదా మీకు దగ్గరగా వచ్చినవారు మీ అంచనాలకు భిన్నంగా ప్రవర్తించి మీకు దూరం అయ్యుండడంగానీ జరిగి ఉండాలి. అవునా?!’’
‘‘మీరూహించినదాంట్లో మొదటిదే నిజం. కౌమార దశలోగానీ, యవ్వనంలో ప్రవేశించాకగానీ ఇంతవరకూ నా మనసుకు దగ్గరగా వచ్చిన వారంటూ ఎవరూ లేరు.
క్లుప్తంగా చెప్పాలంటే నా ఆలోచనలకు దగ్గరగా ఉన్న వ్యక్తి మగవాళ్లలో గానీ ఆడవాళ్లలో కానీ ఇప్పటివరకూ ఎవరూ నాకు తారసపడలేదనే చెప్పాలి.
అందుకే మొదటిసారిగా నా ఊహలకు దగ్గరగా ప్రవర్తించిన మిమ్మల్ని పరిశీలించినకొద్దీ.. మనం మళ్లీ కల్సుకోమేమోననే ఊహ నన్ను చాలా వేదనకు గురిచేస్తోంది’’ అన్నాడు సామ్రాట్.
నిట్టూర్చి అంది సాహిత్య, ‘‘అయితే ఏం చేద్దామంటారు?’’
ఆమెనుంచి వచ్చిన ఆ మాత్రం ప్రతిస్పందనకు అతడి మనసు గాలిలో తేలిపోయింది. ‘‘ఏంచేయడమేవుంది? వీలు చూసుకుని త్వరలోనే ఎక్కడో ఒక చోట కల్సుకుని కాస్సేపు ఒకరి భావాలొకరికి చెప్పుకుందాం’’ అన్నాడు సామ్రాట్ మెరిసే కళ్లతో.
‘‘చెప్పుకుని..?’’ అందామె ‘తర్వాతేవి’టన్నట్టుగా.
ఒక్కక్షణం తడబడి, ‘‘మనం వీలైనపుడల్లా కల్సుకుని కాసేపు ముచ్చటించుకుందాం. ఇందులో తప్పేం ఉందీ?’’ అన్నాడు సామ్రాట్.
‘‘తప్పొప్పుల సంగతి నేను మాట్లాడ్డం లేదు. ఒకరి భావాలొకరికి చెప్పుకున్న తర్వాత ఏవిటీ? అని అడుగుతున్నాను’’ అందామె.
‘‘తర్వాతేవుందీ? అలా చెప్పుకుంటూనే ఉంటాం అప్పుడప్పుడూ!’’
‘‘అదే.. అలా ఎంతకాలం చెప్పుకుంటాం? అని నా ప్రశ్న?’’
‘‘మనమధ్య ఉన్న భావ సారూప్యతే నిర్ణయిస్తుంది మనమెంతకాలం అలా ఒకరి భావాలు మరొకరికి చెప్పుకుంటాం అనేది’’ అన్నాడు సామ్రాట్.
‘‘పదిసార్లు కలిసి మాట్లాడుకుంటే ఒకరి భావాలొకరికి చెప్పుకోవడం పూర్తయిపోతుందా?’’
‘‘ఏమో పదిసార్లే సరిపోతాయో, పదివేల సార్లు మనం మ్చుటించుకున్నా ఇంకా పంచుకోవాల్సిన భావాలు మిగిలి ఉంటాయో ఇప్పుడేం చెప్పగలం?’’ అన్నాడు సామ్రాట్.
‘‘అంటే మన పరస్పర భావాల బదిలీకి కొన్ని సంవత్సరాలైనా పట్టే అవకాశం కూడా లేకపోలేదంటారు. అంతేనా?!’’ అందామె.
ఆమె మాటల్లోని శే్లషను అతడి మెదడు గ్రహించకపోవడంతో, ‘‘ఒక మనిషి మనసులోని భావాలు, బావిలోని జలలా తోడుకున్నకొద్దీ ఊరుతూనే ఉండడంలో వింతేముంది?’’ అన్నాడు సామ్రాట్.
‘‘చూద్దాం.. ముందే జరుగుతుందో! పదండి మన రథసారథి శంఖం పూరిస్తున్నాడు. మనం త్వరపడి బస్ ఎక్కకపోతే.. మనం మళ్లీ మరోచోట కల్సుకోవడం కాదు, మిమ్మల్ని నేనూ, నన్ను మీరూ తిట్టుకోవాల్సి వస్తుంది తర్వాత’’ అని వడివడిగా బస్‌వైపు అడుగులు వేసింది సాహిత్య.
పరుగులాంటి నడకతో ఆమెను అనుసరించాడు సామ్రాట్.

3
ఆఫీస్ టూర్ ముగించుకుని ఇంట్లోకి ప్రవేశించిన సామ్రాట్‌కు హాలులో సోఫాలో కూర్చుని టీవీలో వస్తోన్న కార్యక్రమాన్ని నిర్నిమేషంగా చూస్తోన్న సామ్రాజ్ఞి కనిపించింది. సామ్రాట్‌ను ఓసారి చూసి తిరిగి టీవీ వైపు దృష్టి మరలించింది ఆమె.
గతంలో ఆమె ఉదాసీనతకు మనసులో ఎంతో బాధపడిన సామ్రాట్ ఈసారి ఆమెనసలు పట్టించుకోలేదు. బస్‌లో పరిచయమైన సాహిత్య అతడి మనసంతా నిండిపోయి ఉంది.

- ఇంకాఉంది

సీతాసత్య