డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 21

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చూస్తాను.. ఇలా ఎంతకాలం సాగుతుందో? నాకు కోపం వచ్చేవరకూ మనిషినే! ఒకసారి కోపం వచ్చిందంటే నన్నింకెవరూ ఆపలేరు’’ అంది రోషంగా సామ్రాజ్ఞి.
‘నీకు కోపం రానిదెప్పుడులే’ అని మనసులో అనుకుని ఆ మాటే పైకి అంటే ఏం జరుగుతుందో తెలిసినవాడు కావడాన వౌనంగా ఉండిపోయాడు సామ్రాట్.
‘‘ఏం.. నోట్లోంచి మాటలు రావడంలేదూ? నేను చెప్పింది నిజమేనా?’’ అంది సామ్రాజ్ఞి రెట్టిస్తూ.
‘‘దేని గురించి నువ్వు మాట్లాడేదీ?!’’ అన్నాడు సామ్రాట్ అమాయకంగా మొహంపెట్టి.
‘‘ఆహా.. ఈ తెలివితేటలకేం తక్కువలేదు. నన్ను రెచ్చగొట్టి నాతో వాగించి ‘ఈరోజుకి బాగా కాలక్షేపం అయిందని’ మురిసిపోతూ ఏమీ తెలియనట్టు అమాయకంగా మొహం పెడ్తారా? మీ వేషాలు నా దగ్గర సాగవు’’ అంది సామ్రాజ్ఞి ఆవేశంగా.
‘‘సామూ ఇహముందు ఇటువంటి చర్చ మన మధ్య రాకుండా జాగ్రత్తపడతానులే! అయినా మీ అమ్మ గురించీ, మా అమ్మ గురించీ ప్రస్తావన మనం ఎప్పుడూ తీసుకురావద్దు. సరేనా?’’ అన్నాడు సామ్రాట్ రాజీకి వస్తున్నట్టుగా.
‘‘మీకిష్టం లేకపోతే మీ అమ్మ ప్రస్తావన తీసుకురావడం మానేయండి. నేను మాత్రం మా అమ్మ గురించి రోజూ ప్రస్తావిస్తాను మీకిష్టమున్నా లేకపోయినా’’ అంది సామ్రాజ్ఞి.
‘‘సరేగానీ.. నువ్వెంతో కష్టపడి నా కోసం ప్రేమగా ఎంపిక చేసి తెచ్చిన బట్టలు చాలా బావున్నాయి. నీకు నచ్చిన చీర దొరకలేదా, నీకేమీకొనుక్కోలేదూ?’’ అన్నాడు సామ్రాట్ సాధ్యమైనంత అనునయంగా- ఆమెను ఆ మూడ్ నుంచి బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నానని అనుకుంటూ.
‘‘మీరు ప్రతిదానికీ నన్ను విమర్శిస్తూ ఉంటే మిమ్మల్ని ఆకట్టుకుందుకేం చేయాలనే రంధే తప్ప నా గురించి తీరుబడిగా ఆలోంచుకునే అవకాశమెక్కడుంటుంది నాకూ?’’ అంది సామ్రాజ్ఞి దొరికిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ.
‘‘నా ఉద్దేశ్యం అది కాదు సామూ.. నువ్వెంత కష్టపడి నాకోసం ఎంపిక చేసి తెచ్చిన బట్టలు నిజంగా చాలా బావున్నాయి. నీకు నచ్చనిదే నువ్వే పనీ చేయవని తెల్సినవాణ్ణి కనుక నీకు నచ్చిన చీర దొరక్క తెచ్చుకోలేదా? అన్నానంతే!’’ అన్నాడు సామ్రాట్.
‘‘మాటల్నెలా అయినా మార్చగలరు మీరు. మీ అంత తెలివితేటలు నాకు లేవు మరి!’’ అంది సామ్రాజ్ఞి ‘క్రింద పడినా తనదే పైచేయి’ అన్నట్టుగా.
‘‘మొదటిసారి నాకోసం ఓ బహుమతిచ్చిన నిన్ను మెచ్చుకోవడం మానేసి నేనే ఏదేదో తెలియక మాట్లాడానులే. ఈ విషయం ఇక్కడికితో వదిలేద్దాం. ఆకలేస్తోంది.. భోజనానికి లేద్దామా?’’ అన్నాడు సామ్రాట్.
ఎటువంటి సూటీపోటీ మాటలు లేకుండా భోజన కార్యక్రమం పూర్తయ్యాక పడుకోబోయేముందు అంది సామ్రాజ్ఞి ‘‘నేను తెచ్చిన బట్టలు మీకు బాగా నచ్చాయని అన్నారు కదా!’’
‘‘అవును, ఏం?’’ అన్నాడు సామ్రాట్, ఆమె మనసులో ఏం ఉందో ఊహించే ప్రయత్నం చేస్తూ.
‘‘అవి ఎంపిక చేసింది నేను కాదు’’ అంది సామ్రాజ్ఞి అతడివైపుకు తిరిగి పడుకుని అతడి కళ్లలోకి చూస్తూ.
ఆమె చూపుల్లో ‘ఎవరో కనుక్కో!’ అనే ప్రశ్న కనిపించి, ‘మీ అమ్మ?!’ అనబోయి లేనిపోని ప్రమాదం కొని తెచ్చుకోవడం ఇష్టం లేక క్లుప్తంగా ‘‘మరి?’’ అన్నాడు సామ్రాట్ ఆశ్చర్యాన్ని నటిస్తూ.
నిజానికతడికి ఆ విషయం పట్ల ఆసక్తి లేదు. కానీ తను అనాసక్తిని వ్యక్తం చేస్తే అది మరో యుద్ధానికి దారితీస్తుందనే స్పృహ ఉండటంతో తనకా విషయం తెల్సుకోవాలని ఆసక్తి ఉన్నట్టే నటించడం తప్పలేదతడికి.
‘‘ఊహించలేరా?’’ అందామె.
సామ్రాట్‌ను అలా కాసేపు సందిగ్ధావస్థలో ఉంచటం ఎంతో బావుందామెకు.
‘‘ఊహూ.. న్వు ఏడాది సమయమిచ్చినా నేను చెప్పలేను’’ అన్నాడు సామ్రాట్, ‘ఎదుటివారి ఓటమి ఆమెకెంతో సంతోషాన్ని కలిగిస్తుంద’నే గ్రహింపుతో.
‘‘మీరేకాదు.. ఎవరూ ఊహించలేరులెండి. మీకేదైనా కొనాలని నేను బట్టల దుకాణానికి వెళితే అక్కడ ఒకావిడ పరిచయమైందిలెండి. ఆవిడా నాలానే మొగుడికి బట్టలు కొనాలని వచ్చిందిలెండి.
మీరావిణ్ణి చూడలేదుగానీ ఎంత బావుందనుకున్నారు? ఆడదాన్ని నాకే అసూయ కలిగించేటంత ఆకర్షణీయంగా ఉందావిడ.
నేను ఎంపిక చేస్తే మీకు నచ్చుతాయో లేదోనని బట్టలు ఎంపిక చేసి పెట్టమని ఆవిణ్ణి అడిగాను. ఇవి ఆవిడ ఎంపిక చేసినవే! కనుక నేను తెచ్చిన బట్టలు మీకు నచ్చాయంటే అది ఆవిడ గొప్పదనమే!
మీరు మెచ్చుకోవాలంటే ఆవిణ్ణే మెచ్చుకోవాలి. అలానే అవి మీకు నచ్చకపోయినా అందులో నా ప్రమేయమేమీ లేదు. ఆవిడ చాలా మంచిదానిలా ఉంది. ఎంత బాగా మాట్లాడిందనుకున్నారూ?
వీలు చూసుకుని ఇద్దరం ఒకరింటికి మరొకరు వెళ్లాలని అనుకున్నాం కూడా’’ అంది సామ్రాజ్ఞి.
సామ్రాట్ మనసులో ఆ రోజు సాయంత్రం తాము కల్సుకున్నపుడు ఒక జత బట్టలిస్తూ, ‘వారం రోజుల్లో రాబోయే నీ పుట్టినరోజుకి ఇది నా బహుమతి. నువ్వు కాదనకూడదు’ అన్న సాహిత్య గుర్తుకొచ్చింది ఎందుకో ఆ క్షణంలో.
అందుకే అప్రయత్నంగా అన్నాడు సామ్రాట్ ‘‘ఇంతకూ ఆవిడ పేరేవిటన్నావు?’
‘నేనేవీ అనలేదు. నేనావిడ బావుంటుందని అనగానే వెంటనే ఆవిడ పేరు తెల్సుకోవాలనిపించిందా మీకు? మగబుద్ధి మరి! సరే ఆవిడ పేరు మీకు చెప్పినంత మాత్రన నాకు పోయేదేవీ లేదు కాబట్టి చెప్తున్నాను. ఆవిడ పేరు సాహిత్య’’ అంది సామ్రాజ్ఞి

7
సాహిత్య చెప్పిన గుర్తుల ప్రకారం శ్రమపడనక్కర్లేకుండా తేలిగ్గానే వాళ్లింటికి వెళ్లగలిగింది సామ్రాజ్ఞి.
నిజానికి ఆ రోజు సామ్రాట్, సాహిత్య బోట్‌క్లబ్ దగ్గరున్న పార్కులో ఆ సమయానికి కల్సుకోవాలని అనుకున్నారు.

-ఇంకాఉంది

సీతాసత్య