నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. పాండుకుమారులు పాండు భూపతిపరో క్షంబున హస్తినపురంబునందు
ధృతరాష్ట్రునొద్దఁ దత్పులతో నొక్కటఁ బెరుఁగుచుభూసురవరులవలన
వేదంబులును ధనుర్వేదాదివిద్యలుఁ గఱచుచుఁ గడలేని యెఱుకఁ దనరు
చున్నఁ దద్విపులగుణోన్నతి సైఁపక దుర్యోధనుండు మెత్తి

ఉ. దుర్ణయమున శకునికర్ణ దుశ్శాననుల్ గఱవ బాండవులకు నఱయ చేయఁ
గడఁగె బాండవులును గడు ధార్మికులు గానఁ బొరయ రైరి వారి దురితవిధుల

భావం : పాండురాజ మరణానంతరం పాండవులు హస్తినాపురంలో ధార్తరాష్ట్రులతో పాటు పెరుగుతూ విప్రవరుల వద్ద వేదాలు, ధనుర్వేదాది విద్యలు నేరుస్తూ అపారజ్ఞాన సంపన్నులై ఉండగా, వారి సుగుణ సంపదకు సహించక దుర్యోధనుడు దుష్కార్యాలకు తలపడి, శకుని కర్ణదుశ్శాసనులు బోధించగా పాండవుల కెల్లప్పుడు కీడే చేయడానికి యత్నించేవాడు. పాండవులు పరమధార్మికులవటం చేత ధార్తరాష్ట్రుల దుష్కార్యాల వన హాని పొందకుండ ఉండేవారు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము