డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 25

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అందుకని కాస్సేపు మీ ఒళ్లో ఆవిడ, మరికాసేపు ఆవిడ ఒళ్లో మీరూ తల పెట్టుకుని ఒకరి బాధలొకరి చెప్పుకుని ఉపశమనం పొందుతున్నారా?’’ అంది సామ్రాజ్ఞి వెటకారంగా.
‘‘ఇంతకుముందు ఒకరికొకరు ఒళ్ళు తగిలేంత దగ్గరగా కూర్చున్నామని ఎవరో చెప్పారన్నావు. ఇప్పుడు నువ్వు చెప్పినమాటను నువ్వే మార్చి ఒకరి ఒళ్ళో మరొకరు తల పెట్టుకుని ఉపశమనం పొందామని అంటున్నావు.
చూశావా.. ఇంతలోనే మాటలెలా మారిపోయాయో! నా గురించి చెప్పిన వాళ్ళు తాము చూసినదానికి ఏమేం జోడించి చెప్పారో ఎవరికి తెలుసు?’’ అన్నాడు సామ్రాట్.
‘‘ఎవరో ఒకావిడ, మీరూ ఈ రోజు సాయంత్రంకలిసి దేవాలయ ప్రాంగణంలో ఉన్నమాట నిజమే కదా?’’’ అంది సామ్రాజ్ఞి.
‘‘అవును. నేనేమీ కాదనలేదే!’’
‘‘‘అయితే ఆ విషయం ఇంటికి రాగానే నాతో చెప్పొచ్చు కదా?’’
‘‘ననె్నక్కడ చెప్పనిచ్చావు నువ్వు! నేను ఇంటికొచ్చీ రాగానే నామీద విరుచుకుపడిపోతే అందుకు కూడా నాదే తప్పా?!’’
‘‘లేదు. నేను మిమ్మల్ని నిలదీయకపోతే ఈ విషయం ఎప్పటికీ చెప్పేవారు కాదు. మీ బుద్ధి నాకు బాగా తెలుసు’’ అంది సామ్రాజ్ఞి.
‘‘మరింకేం! నన్ను మళ్లీ అడగడమెందుకూ? తెల్సినదానివి తెల్సినట్టుంటే సరిపోయేదిగా!’’
‘‘తన మొగుడు మరో ఆడదానితో పళ్లికిస్తూ కాలక్షేపం చేస్తున్నాడని తెల్సిన తర్వాత కూడా నోరు మూసుకుని పడి ఉండడానికి నేనేమీ చేతకానిదాన్నికాదు.
మీరేమో ఆవిడెవరో తన బాధ చెప్పుకుందుకు మీతో కల్సి గుడికి వచ్చిందన్నారు. కానీ తీరా చూస్తే మీ ఇద్దరూ అక్కడికి చేరింది ఒకరి మొహం మరొకరు చూసి మురిసిపోతూ కాలక్షేపం చేయడానికి.
పోనీ ఇదైనా నిజం చెప్పండి. ఆవిడ ఒక్కసారి కూడా నవ్వలేదూ మీరు కల్సి ఉన్న సమయంలో?!’’
‘‘నేనలా అనలేదే! నవ్వు అనేది జంతువులకు చేతకానిదీ మనిషికొక్కడికే సాధ్యమయ్యేదీ అని నీకు మాత్రం తెలియదూ?’’
‘‘అంటే మీతో తన బాధ చెప్పుకుందుకొచ్చిన మనిషి కాస్సేపు మీతో గడిపాక తన బాధను మర్చిపోయి తాను జంతువును కాననీ, మనిషిననీ గుర్తొచ్చి పకపకా నవ్వుతూ మీతో సమయం గడిపిందన్నమాట. అంతేనా?!’’
‘‘ప్రతి మాటకూ నువ్వలా పెడర్థం తీస్తే నేను చేసేదీ, చెప్పేదీ ఏమీ లేదు’’
‘‘చేయవలసినదంతా చేసేశాక, చెప్పవలసిందంతా దాచేశాక ఇక మీతో మాట్లాడ్డం వల్ల ప్రయోజనం లేదు. అదెవరో చెప్పండి. నేను కల్సుకుని ఆవిడ బాధేవిటో తెల్సుకుని కన్నీళ్లు తుడిచి నా జన్మ చరితార్థం చేసుకుకంటాను. ఆ భాగ్యమైనా నాకు కల్పిస్తారా?’’ అంది సామ్రాజ్ఞి గుండె మండిపోతుండగా.
‘‘నీకు ఎదుటివాళ్లను మాటలతో హింసించి బాదపెట్టడమే తప్ప విషయాన్ని సరైన కోణంలోంచి చూసి అర్థం చేసుకోవడం ఎన్నటికీ చేతకాదు. ఇది మాత్రం నిజం’’ అన్నాడు సామ్రాట్.
‘‘ఆవిణ్ణి ఎనె్నన్నో కోణాలనుంచి చూసిన తర్వాత మీకు నా గురించి ఇప్పటికైనా నిజం తెల్సినందుకు చాలా సంతోషం. రేపటినుంచి ఆఫీసయింతర్వాత రోజుకో అందగత్తెను వెంటేసుకుని ఊళ్లోని పార్కులూ, గుళ్లూ, ఇతర విహార స్థలాలూ తిరుగుతూ మీ జన్మ, వాళ్ల జన్మలూ సార్థకం చేసుకోండి.
నేను ప్రతిరోజూ మీ గురించిన రాసలీలలు విని తరిస్తూ నా అదృష్టానికి నన్ను నేనే అభినందించుకుంటూ శేష జీవితాన్ని ఆనందంగా గడిపేస్తాను. సరేనా?’’ అంది సామ్రాజ్ఞి వెటకారంగా.
‘‘నీ శేష జీవితాన్ని గురించి నువ్వే అలా ఒక నిర్ణయానికి వచ్చాక ఇహ నేను చెప్పేదేవుందీ? కాకపోతే నాతో కలిసి కాలక్షేపం చేసేందుకు రోజుకో అందగత్తెను కూడా నువ్వే ఏర్పాటు చేస్తే ఇంకా బావుంటుందేమో ఆలోచించు’’ అన్నాడు సామ్రాట్.
‘‘ఆ.. ఆ.. అదేపనిలో ఉంటాను రేపట్నుంచీ. మీరే చూద్దురుగానీ..’’’ అని భోజనాల బల్లమీద ఉన్న పళ్లాన్ని ఎతిత విసురుగా నేలకు కొట్టి పడక గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది సామ్రాజ్ఞి.
8
‘‘ఇప్పుడు నాకేం చేయాలో తెలియడం లేదు’’ అన్నాడు సామ్రాట్.
మిత్రుడు చెప్పిందంతా ఓపిగ్గా విన్న మహర్షి ‘‘నీది ఒకరకంగా గడ్డు సమస్య. మరొక రకంగా కాదు. తనకు తెలియకుండా భర్తకు పరాయి స్ర్తితో పరిచయం ఉందనే విషయాన్ని ఇతరుల ద్వారా తెలుసుకున్న భార్య తన భర్తను ఎన్నటికీ నమ్మదు, క్షమించదు కూడా.
పురుషుడు స్ర్తిని తన ఆస్తిలా భావిస్తాడని అంటారు కానీ, నిజానికి స్ర్తియే భర్తను తనకు సంబంధించిన విలువైన ఆస్తిలా భావిస్తుంది. అందుకే తన భర్త, ఇతర స్ర్తిలకు దగ్గర కావడమనే విషయాన్నామె అంత తీవ్రంగా పరిగణిస్తుంది.
తన హక్కును వదులుకోవడంలో సందర్భాన్ని బట్టి ఎంతో కొంత సడలింపును పురుషుడైనా ప్రదర్శిస్తాడేమోగానీ స్ర్తి ఆ విషయంలో ఈషణ్మాత్రం కూడా రాజీపడదు.
తరతరాలుగా బ్రతుకుపట్ల ఆమెలో జీర్ణించుకుపోయి ఉన్న అభద్రతాభావమే అందుకు కారణం కనుక ఆమెనూ తప్పుపట్టేందుకు లేదు.
స్ర్తిలోని ఆ అభద్రతాభావానికి కారణం- ఆర్థికం కావచ్చు, సామాజికం కావచ్చు. పురుషుడితో పోలీస్తే తాను శారీరకంగా బలహీనురాలు కావడం కావచ్చు, తన సంతానపు భవిష్యత్తుమీద ఆమెకున్న అంతులేని ఆశలూ కావచ్చు. ఇవన్నీ కానీ, వీటిలో కొన్ని గానీ లేదా ఏదో ఒకటేగానీ ప్రధాన కారణం కావచ్చు.
స్వేచ్ఛను కోరే మగాడెప్పుడూ సంకెళ్లు తెంచుకుందుకు ప్రయత్నిస్తే స్ర్తి సరిగ్గా అందుకు విరుద్ధంగా కొత్త సంకెళ్లను అతడికి తగిలిస్తూ వాటి నుంచి అతడు బయట పడకుండా ఉండేందుకు అహరహమూ ప్రయత్నిస్తూ ఉంటుంది.

-ఇంకాఉంది

సీతాసత్య