నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. అడవిలో నేకాంతమతి ఘోర తపమున నున్న మా గురులపై నురగ శవము
వైచుట విని యల్గి వారి తనూజుండు శృంగి యన్వాఁడు కార్చిచ్చునట్టి
శాపంబు నీకిచ్చె సప్తాహములలోన నాపరీక్షితుఁడు నాయలుకఁజేసి
తక్షక విషమున దగ్ధుడయ్యెద మని దానికి గురులు సంతాప మంది

ఆ. భూతలేశ! నన్నుఁబుత్తెంచి రిప్పుడు తద్ధయంబులెల్లఁ దలఁగు నట్టి
మంత్రతంద్ర విధులమర్చి యేమఱకుండు నది నిరంతరంబు ననియుఁ గఱప

భావం: అడవిలో ఏకాగ్రమైన మనస్సుతోతీవ్రమైన తపస్సుచేస్తున్న పూజ్యులైన మా గురువుగారిపై నీవు చచ్చినపామును వేయటం విని కోపిం శృంగి అను ఆ శమీకుని కుమారుడు ‘ఏడురోజులలో ఆ పరీక్షితుడు నాకోపం చేత తక్షకుడనే పాముయొక్క విషం చేత దహింపబడుగాక’ అని దావాగ్ని వంటి శాపం నీకిచ్చాడు. అట్లా అతడు శాపమివ్వటానికి మా గురువుగారు శోకించి ఓ రాజా! దానివల్ల కలిగే భయాలన్నీ తొలగించేటి మంత్రాలు తంత్రాలు మొదలైన విధానాలన్నీ ఏర్పరిచి సంతతం జాగరూకతతో ఉండాలని నీకు బోధించే కొరకు నన్నిప్పుడు నీకడకు పంపారు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము