మంచి మాట

వేద ప్రమాణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదములు స్వతఃప్రమాణములని ఋషి పుంగవులు తెలియజేశారు. ఒక్క వేదాలు మాత్రమే స్వతఃప్రమాణములు. మిగిలిన గ్రంథములున్నియూ పరతఃప్రమాణములనబడును. బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు మొదలగునవన్నీ కూడ వేదానుకూలత ప్రమాణములు. వేదాలు స్వతఃప్రమాణములని మహర్షులు, శంకరాచార్యులు, రామానుజులవారు మధ్వుడు మొదలగు మహానీయులు పేర్కొన్నారు. ‘‘వేద మూలం ఇదం జ్ఞానం.’’
మానవుడు సంఘజీవి. మానవుని విధులు, కర్తవ్యము, కర్మలు అన్నీ వేదములందు విపులంగా వివరించబడినవి. అందుకే వీటిని వేద విహిత కర్మలుగా పరిగణిస్తారు. వీటిని సమాజములోని వ్యక్తులు ఆచరించినట్లైతే సమాజము నీతివంతంగా సుభిక్షంగా ఉంది. పూర్వకాలము స్ర్తిపురుష భేదములేకుండా వేదాలు అందరూ చదివేవారు. కొందరు స్ర్తిలు వేద మంత్రాలను ప్రచారం కూడా చేశారు. వేద విజ్ఞానము లేనిదే మానవుడు చేయవలసిన కర్మలను సక్రమముగా ఆచరించలేడు.
‘‘ఈశావాస్య మిదం జగత్’’ ఈశ్వరుడు అంటే ఐశ్వర్యవంతుడని, నియమించేవాడని అర్థము. మహోన్నత సృష్టికర్తయైన పరమేశ్వరుడు ప్రపంచంలో సృష్టితోపాటు కొన్ని నియమ నిబంధనలు కూడా నిర్ణయం చేశాడు. భూభ్రమణము ఒక నియమము. అదే విధంగా సూర్యచంద్రులు ఇతర గ్రహాలు ఒక నియమంతో తమతమ గతులు తప్పకుండా తిరుగుతున్నాయి. వాయువు వీస్తున్నది. అగ్నిదహిస్తున్నది. నీరు శుభ్రం చేస్తుంది. ఇవన్నీ నియమంతో కూడుకొన్న వాటి ధర్మాలు.
నియమంతో ఉన్న వస్తువులు క్రమబద్ధంగా ఉంటాయి. ఉద్యానవనంలోని మొక్కలు చెట్లు ఒక క్రమపద్ధతిలో నియమంగా ఉంటాయి. అవి మనచే ఏర్పాటుచేయబడినవి. దానికి ఒక తోటమాలి యుండి అతని సంరక్షణలో ఉంటాయి. కాని అడవిలోని చెట్లు అలా కాదు. వాటికి తోటమాలి లేనందున అవి ఒక క్రమపద్ధతిలో నుండక విచ్చలవిడిగా పెరుగుతాయి.
చంద్రుడు భూమిచుట్టు ఒక నియమిత పరిధిలో తిరుగుతున్నాడు. ఒకవేళ చంద్రుడు నియమం ప్రకారం భూమి చుట్టూ తిరుగకుండా అనియమంగా తిరిగినట్లైతే ఎవరుకూడా చంద్రుని వద్దకు వెళ్ళలేరు. దీనినిబట్టి ఈ సృష్టిఅంతయూ ఒక నియమబద్ధ పద్ధతిలో నడుస్తున్నదని అర్ధమగును. ఈ పద్ధతిని నియమించిన పదార్థమునకే ఈశుడని పేరు. ‘‘తేనత్యక్తేన భుంజేధాః’’ అనగా ప్రపంచమును త్యాగభావంతో అనాసక్త చిత్తముతో అనుభవించవలెనని అర్థము.
ఈ ప్రపంచములోని 84 లక్షల జీవకోటిలో మనుష్యుడు ఉత్తముడు. ఆహారము, నిద్ర, భయము, మైధునము(ప్రత్యుత్పత్తి) కలిగిన మానవుడు మిగతా జీవరాసులకంటే జ్ఞానవంతుడు. అందువలన మానవ జన్మ ఉత్తమమైనది. జ్ఞానంతోపాటు మానవుడు క్రౌర్యం, ద్వేషం, అన్యాయాచరణలలో కూడా పాలుపంచుకుంటున్నాడు.
బాగుగా ఆలోచించినట్లైతే అసలు ఈ మానవ జీవితంయొక్క పరమార్థం ఏమిటి? సుఖశాంతులు అందరికీ అవసరమే. వాటిని కాదనేవాళ్ళు ఈ సృష్టిలో లేరు. సుఖాన్ని అనే్వషిస్తాము. సుఖాన్ని ఆహ్వానిస్తాం. సుఖం కలిగితే సంతోషిస్తాము. కాని దుఃఖాన్ని మాత్రము కోరుకొనము.
దుఃఖాన్ని దూరముగా తరిమివేయుటకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాము. అందుకే ప్రతి మానవుడు నాకు దుఃఖము వద్దు సుఖమే కావాలి అని కోరుట. సుఖాన్ని కోరియే మనుష్యుడు ఎన్ని ఇబ్బందులనైనా అధిగమించి భార్యాబిడ్డలను పోషించడానికి ప్రయత్నిస్తాడు.
సుఖాన్ని కోరే మనిషి సంపదలను ప్రోగుచేస్తాడు. సంపద అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. మన జీవితము సుఖముగా గడుపుటకు కావలసిన వస్తుసముదాయతే సంపద. అయితే ఈ సంపదలను ఎప్పుడు కూడా త్యాగభావంతోనే అనుభవించాలి. నాది కాదని అనుభవించాలి. వేదం అదే చెబుతుంది. ‘‘తేన త్యక్తేన భుంజీదాః’’.

- పెండెం శ్రీధర్