డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు 38

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్ధార్థ సంతోషంతో ఎగిరి గంతేసాడు. అన్నయ్య అంటే సందీపే. ఇటువంటి అన్నయ్య ఉండటం ఎంత అదృష్టం.
సిద్ధార్థని పంపించే ఏర్పాటు చేసాక తన యూనిట్‌కి వచ్చాడు మేజర్ సందీప్. అక్కడ కొత్త గాలి వీస్తోందని తెలుసుకున్నాడు. అల్ఫా కంపెనీకి కంపెనీ కమాండర్ మేజర్ భూపేష్ సింహ్ ఆ వాతావణంలో ఉత్తేజన, సంతోషం, విజయం, పులకింత మొదలైనవి నిండిపోయేలా చేసాడు. ప్రతీ యూనిట్ నుండి అభినందనలు వెల్లువై వస్తున్నాయి. రాష్ట్రీయ రైఫిల్స్‌లో ఇది అద్భుతమైన సంఘటన. ఆపరేషను లేదు. రక్తపాత లేదు. రైఫిల్స్ లేవు. మేజర్ భూపేష్ సింహ్ తన తెలివి తేటలతో శతృవులను మట్టుబెట్టాడు.
సంఘటన గురించిన వివరాలు-
మానవ సంబంధాలలో ఉన్న శక్తి బలహీనతలకు ఇంపార్టెన్స్ ఇచ్చే భూపేష్ సింహ్ అప్పుడప్పుడు ఉగ్రవాది హసన్ రాకీతో మొబైల్ పైన మాట్లాడేవాడు. చాలాసార్లు ఉబుసుపోక చెప్పే పోచికోలు కబుర్లు ఇద్దరిమధ్య నడిచేవి. ఇద్దరికీ తెలుసు, ఇద్దరు ఒకరికి ఒకరు శత్రువులని. కాని ఖాళీ సమయంలో గప్పాలు కొట్టడంలో ఇద్దరికి అభ్యంతరం లేదు.
ఇద్దరు వేరు వేరు లోకాలలో బతుకుతున్నారు. అందువలన ఇద్దరు జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండేవారు. అప్పుడప్పుడు హసన్‌రాకీ మైండ్ జాగ్రత్త- జాగ్రత్త అని హెచ్చరిస్తూనే ఉంది. ఆ.. ఈ హిందుస్తానీ ఆర్మీ నన్ను ఏం చేస్తుందిలే అని తనకు తాను చెప్పుకుంటూ ఉంటాడు. ఎవడికి తెలుసు తనే వాడిని మట్టుపెడతాడేమో. భూపేష్‌సింహ్‌తో మాట్లాడితేనే పోయేది ఏముంది? అని అనుకుంటూ ఉంటాడు. ఏమో ఎవరికి తెలుసు. తీపి కబుర్లు చెప్పి వాడు ఆత్మసమర్పణ చేసుకునేలా చేయవచ్చును కదా! లేకపోతే వాడి మనోబలాన్ని దెబ్బతీసేలా ఏదైనా ఛాన్స్ కోసం వెతకవచ్చు.
మేజర్ భూపేష్ సింహ్ చాలా రోజుల నుండి రాష్ట్రీయ రైఫిల్స్‌లో పనిచేయడంవలన మిలిటెంట్ల ప్రపంచం, కెమిస్ట్రీ, మనోవిజ్ఞానం గురించి తెలుసుకున్నాడు. ఏ ఉగ్రవాది మరో ఉగ్రవాదిని చస్తే నమ్మడు అన్న సత్యాన్ని తెలుసుకున్నాడు. ఎప్పుడు ఎవడు ఎట్లా మారాతాడో ఎవరికీ తెలియదు. ఎవరి శక్తియుక్తులకు లొంగిపోతాడో ఎవరికి తెలియదు. ఈ ఉగ్రవాదుల లోకంలో అంతా ఊహలపైనే నడుస్తుంది. ఎటు చూసినా పొగ మంచే. ఆర్మీ వాళ్ళు ఉగ్రవాదుల ఆత్మసమర్పణ వార్తలని పుట్టిస్తారు. కాశ్మీరు ఉగ్రవాదులను ఎప్పుడు ఉగ్రవాదుల రూపంలో వాళ్ళ కోటకి పంపుతారో దేవుడికెరుక. ఈ కార్యకలాపాలన్నీ జరుగుతూనే ఉంటాయి.
ఆ రోజు సాయంత్రం మేజర్ భూపేష్ సింహ్ హసన్ రాకీకి టైమ్‌పాస్ కోసం ఫోను చేసాడు. ఆ మహాశయుడు బాత్‌రూమ్‌లో ఉన్నాడు. మొబైల్ మోగగానే అతడి స్నేహితుడు ఉగ్రవాది అహమద్ రషీద్ మొబైల్ ఎత్తాడు. అటువైపు నుండి పేరు వినబడగానే ఆశ్చర్యపోయాడు.. హిందుస్తానీ ఆర్మీ నుండి ఫోనా! వాళ్ళలో ఎప్పుడు ఉండే జిజ్ఞాస.. ఎవరు.. శత్రువుల నుండి ఫోనా! హలో-
బ్లేడులా పదునైన బుద్ధికలవాడైనా భూపేష్ సింహ్‌కి అర్థం అయింది. హలో అన్న మాట వినబడగానే తెలుసుకున్నాడు. గొంతు మారింది. మరెవరో మాట్లాడుతున్నారు. సూక్ష్మబుద్ధి వెంటనే పనిచేసింది. ‘యార్! వాడిని ఎప్పుడు చంపిస్తున్నావు?’
రషీద్ చెవులు నిక్కపొడుచుకున్నాయి. మైండ్‌లోని దీపం వెంటనే వెలిగింది. తన స్నేహితుడికి ఫోన్.. అది కూడా ఆర్మీ ఆఫీసరునుండి.. యార్ వాడిని ఎప్పుడు చంపిస్తున్నావు? హసన్‌రాకీ హిందుస్తానీ ఆర్మీతో చేతులు కలిపాడు. తనని చంపించడానికే వాడు ప్రణాళిక వేస్తున్నాడు. అందుకే తనని ఇంతగా తీయటిమాటలు చెప్పి రప్పించాడు. వల విసిరాడు.
అనుమానం పెనుభూతం అయింది. స్నేహితుడు పిస్తోలుని బాత్‌రూమ్‌వైపు పెట్టాడు. హసన్ రాకీ బాత్‌రూమ్ నుండి బయటకు వచ్చాడు. బ్లడీ బాస్టర్డ్- థాయ్- థాయ్.. పిస్తోలు గుళ్ళు దూసుకుపోయాయి.. ఢాం.. ఢాం..
హసన్ రాకీ విలవిలలాడిపోయాడు. కళ్ళల్లో ఆశ్చర్యం.. నమ్మలేకపోతున్నాడు. గిలగిలలాడిపోయాడు. ఆర్మీ వాళ్ళు కాదు.. తనని చంపింది తన స్నేహితుడే. మరో ఉగ్రవాది రక్తసిక్తం అయిపోయాడు. ఎదురుగా ఆ చేతుల్లో పిస్తోలు.. గుళ్ళు.. తన స్నేహితుడే తనను వెన్నుపోటు పొడిచాడు. పక్షిలా గిలగిలా తన్నుకుపోయాడు. చచ్చిపోయాడు.
ఆర్మీ వాళ్ళ చేతుల్లో ఉగ్రవాది చావలేదు. ఒక గుండు కూడా ఉపయోగించలేదు.. అయినా బద్ధశత్రువైన ఒక ఉగ్రవాది చంపబడ్డాడు. మేజర్ భూపేష్‌ని ఆర్మీ వాళ్ళందరు ఆకాశానికి ఎత్తారు. ఒక్క మేజర్ సందీప్ మాత్రం ఈ సంతోషాన్ని మనఃస్ఫూర్తిగా అనుభవించలేకపోతున్నాడు. కంపెనీ కమాండర్ భూపేష్‌ని ఈ వార్త ఆనంద వెల్లువలో ముంచేసింది. కాని ఎందుకో ఈ సంఘటన సందీప్‌కి ఎంతో బాధ కలిగించింది. ఆలోచనల సెలయేరులో ఒక రాయి విసిరేసినట్లయింది. వలయాకారంలో అలలు.. జీవితం ఎంత విలువ లేనిది.. నయాపైసా అంత కూడా విలువ లేనిది. చ.. క్షణాలపైన ఆధారపడి ఉంది. కేవలం యాదృశ్చికం. నిజానికి హసన్ రాకీ ఫోను ఎత్తలేదు. ఎన్నోసార్లు ఇట్లా తనకు.. తన స్నేహితులకు జరిగింది. చస్తూ.. చస్తూ.. బతికి బయటపడ్డారు. క్షణక్షణం చావు. బయటపడి బట్టగట్టడం. కాని ఎన్నాళ్ళు.. ఎంత కాలం ఈ యాదృశ్చికం తమకు సహాయం చేస్తుంది. యూనిట్‌లో షాంపెన్ బాటిల్స్‌ని ఓపెన్ చేశారు. అందరు తాగి తూలుతూ ఆనందిస్తున్నారు. కాని సందీప్ మనస్సులో సుడిగుండాలు. అతడు తనని తనే ప్రశ్నించుకుంటున్నాడు. నిజమే ఈ సంఘటన మేజర్ భూపేష్ సింహ్ తెలివితేటలను బయటపెడుతోంది. ఇది ఒక ఉదాహరణ..

- ఇంకాఉంది