భక్తి కథలు

కాశీఖండం 179

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బావుల సంఖ్య లెక్కపెట్ట అలవికాదు.
నానా దేవతలూ ముసుగుని ముచ్చటని, రహస్యాన్ని బాహాటం చేసి, బట్టబయలు కావించి ఆ స్థానంలో సమావేశం అయి ఆ దైవం మనకి కాశిలో కసవై పుట్టే అదృష్టాన్ని మనకు కల్పింపకుంది. ఈ కశ్మలం అయిన స్వర్గం ఎందుకు?’’ అని ఉత్కంఠతో పలుకుతారు.
కాశీపురం కోట్లకొలది శివలింగాలు కన్నతల్లి. కైవల్యం అనే ఫలాన్ని ఒసగే కల్పలత. కాశి గంగానదికి గారామైన చెలికత్తె. దేవతలు, నదులు, ఉరగులు, దైత్యులు ప్రస్తుతింపతగినది.
నగజా! కాశి సమస్త పుణ్యతీర్థాలకి పుట్టిల్లు. సకల వేద పురాణ శాస్త్రాలకి గరిడి స్థానం. నివాసస్థలం. సమస్త పాప మేఘ సమూహాలకి ఝంఝామారుతం. కాశీ సకల మోక్షాలకీ నెలవు.
ఓ దుర్గాదేవీ! హిమాలయ పర్వతంమీద దుస్సహమైన తపస్సు సల్పి, ఆ తపోభార గరిమ చేత నువ్వు నన్ను కుతూహలుణ్ణి చేశావు. ఈ కాశి సహజసిద్ధమైన తేజస్సుతో నన్ను ఆనందింపజేస్తుంది. నీ మార్గం, కాశికానగర మార్గమూ పరికించు- ఏది ఎక్కువో తెలుస్తుంది.
ఓ దేవీ! విశాలాక్షీ! సర్వదేవ నమస్కృత చరణా! నువ్వు నాకు ఎంత ప్రియవో మోక్ష నిలయమైన కాశీ కూడా అంత ప్రియమైనది!
పద్మనేత్రా! కుమారస్వామి, నందీశ్వరుడు, మహాకాలుడు, విఘ్నేశ్వరుడు, నైగమేయుడు, విశాఖుడు నాకెంతటి పరమహితులో అరసిచూడగా అవిముక్త క్షేత్రంలోని ప్రజలున్ను అంతటి పరమాప్తులే!
నళిన నయనా! ఆనంద కాననంలో విడువక నివాసము వుండే జనులు పురాజన్మయందు యజ్ఞాలు కావించి హవిస్సులు వేల్చినవారు. మహాతీవ్ర తపములు ఆచరించినవారు. సకల తీర్థాల్లో క్రుంకులిడిన పావనులు-
గిరిజా! కాశిలో నివసించే ప్రజలు తప్ప యక్షులు, గంధర్వులు, గరుడులు, విద్యాధరులు, పన్నగులు భువనాలకు భారంగా మాత్రమే జన్మించినవారు. ఈ విధంగా పలకడం అర్థవాదం కాదు- అంటే కాశీపురాన్ని కొనియాడడం కాదు.
ఓ తామరసాక్షీ! అన్య ప్రదేశలలో జన్మించిన మానవులు ఎంతటి ఘనులైనా- కాశీపురంలో కాపురం వుండే పుల్కసుణ్ణి- కడ జాతివాణ్ణి- పోలలేరు. అట్టివారు శ్రోత్రియుల గృహంలో పుట్టినా, నాల్గు వేదాలు సమగ్రంగా అభ్యసించనీ!
కాశిలో కాపురం వున్న కాపుకొడుకు సాక్షాత్తూ ముక్కంటియే. కాశీలోని ఐదు కోసుల తుది సీమలో మొలిచిన గరికపోచతో కల్పవృక్షాలు సయితం సాటి రావు. ప్రళయ కాలంలో చెలియలికట్ట దాటి వచ్చినపుడు కూడా జలధి పొంగు కాశీపురాన్ని ముంచివేయలేదు. బ్రహ్మాది దేవతలకయినా కాశీనగర వీధులలో పాద సంచారమే తప్ప వాహనాలు ఎక్కడానికి నియమం లేదు. ఎంతటి మహాదురితాలకైనా కాశీ చుక్కెదురు. ఉపవాసాలకి కాశీ విషం. భవానీ! శుభాలకి ఆటపట్టు కాశి. కాశీ ముక్తికి పుట్టిల్లు.
మంచుకొండరాచూలీ! సకల కుండాలలో స్నానం ఆచరించిన ఫలమూ, అన్ని శివలింగాలకీ, మ్రొక్కినట్టి ఫలమూ- ఈ తీర్థాల నామాలు విన్న మనుజులకి సిద్ధిస్తాయి. నిజం సుమా!

-ఇంకాఉంది

శ్రీపాద కృష్ణమూర్తి