డైలీ సీరియల్

బడబాగ్ని 32

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేదంటే ఇంద్రజిత్‌ని వాడుకునే అవసరం, అవకాశం బయట వాళ్లకెవరికి ఉంటుంది.. అయినా ఇంతమంది ప్రాణాలు తీసిన ఆ నరరూప రాక్షసుడిని, అందులోనూ నా ప్రాణానికి ప్రాణమైన కమల్‌ని చంపిన వాడిని నే ఊరికే వదిలే ప్రసక్తే లేదు.. ఎంత కష్టమైనా నేను ఈ చిక్కుముడి విప్పే తీరతాను.. ఈ మిస్టీరియస్ సీరియల్ కిల్లింగ్స్ మిస్టరీ ఛేదించి తీరుతాను’’ ఆవేశంగా అన్నాడు రాహుల్.
‘‘కానీ ఎలా..’’ ఆవేదనగా అన్నాడు అనే్వష్.
‘‘చూద్దాం.. ముందుగా నేను కమల్ స్టే చేసిన తాజ్‌లో దిగి అతని మరణం తాలూకు రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తా.. అలాగే.. ఆ మహేష్ ఏక్సిడెంట్ సంగతీ, ఎందుకంటే ఆ రెండిటికీ ఖచ్చితంగా లింక్ ఉంది.. అలాగే లాయర్ భగవాన్ గురించి, అతని నిజాయితీ గురించి విచారించి, అతను మంచివాడే, ఈ కేసుతో అతనికి ఎటువంటి సంబంధం లేదని తేలితే ఆయన సహాయం తీసుకుంటా. ఎందుకంటే ఆయన పేరుమోసిన క్రిమినల్ లాయర్, ఇలాంటి కేసులు ఎన్నో చూసిన అనుభవశాలి. కానీ ఆయన గురించి కొన్ని పుకార్లు ఉన్నాయి.. వాటిలో నిజానిజాలు తేల్చాల్సి వుంది. చూద్దాం కథ ఎలాంటి మలుపు తిరుగుతుందో...’’ సాలోచనగా అన్నాడు రాహుల్.
‘‘ఈ కేసులో ముందు నాకు.. నాకే కాదు భగవాన్‌గారికీ నీమీదే అనుమానం కలిగింది.. అలా అనుమానం కలిగేలా ఉంది నీ ప్రవర్తన. అది ఎందుకో నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. మేం నిన్ను అనుమానిస్తుంటే నువ్వు ఈ లోపు నీ ఎంక్వయిరీ చేసుకునే అవకాశం నీకు చిక్కింది. అందరికీ నీమీద ఒక క్రిమినల్‌గానే దృష్టి ఉంది కానీ హంతకుడి చూపు నీ మీద పడలేదు. ఎప్పుడైతే నిన్ను ముద్దాయిగా బోనులో నిలబెట్టామో అప్పుడు నువ్వు నీ నిర్దోషిత్వం రుజువు చేసుకుని, ఈ కేసులో నీ పరిశోధన గురించి చెప్పేవో అప్పుడు.. ఆ హంతకుడి దృష్టి నీమీద, నువ్వు చేస్తున్న ఎంక్వైరీమీద పడింది.. అదే కమల్ మరణానికి కారణం అయింది. నువ్వన్నది నిజమే.. ఇంతవరకూ వచ్చాక ఇప్పుడు ఈ కేసు నీరుకారిపోకూడదు. అలా చేస్తే కమల్ చావుకి అర్థం ఉండదు. మేం ముగ్గురం రేపే బయలుదేరి మా మా పోస్టింగ్ ప్లేసెస్‌కి వెళ్లిపోవాలి. నాతోబాటు అజిత్, అరుణ్ కూడా ఇక్కడకి బయలుదేరారు కానీ నేనే వద్దన్నా, ఎందుకంటే నీకు అజిత్‌తో సరిపడదు కదా. అందుకే నేనొక్కడినే వచ్చా.. మరో మాట నువ్వు హైదరాబాద్ వెడతానన్నావ్, నీకు అభ్యంతరం లేకపోతే అజిత్ అక్కడ పోస్టింగ్ కనుక వాడి సాయం తీసుకోవచ్చు.. వాడికిప్పుడు నీమీద ఏ కోపం లేదు.. నీకూ వాడిమీద కోపం లేకపోతే..
‘‘్ఛ ఛ.. నాకు వాడిమీద ఏం కోపం.. ఒకప్పుడు ఉండేది నిజమే. కానీ చిన్నతనం పోయి పెద్దరికం వచ్చాక అనిపించింది. జరిగినదాంట్లో వాడి తప్పు ఏం ఉంది.. నాలాగే వాడూ పుట్టాడు. చిన్నతనం నుంచి నా తండ్రి కాని తండ్రి నామీద చూపిన తేడావలన మా యిద్దరిమధ్యా అంతరం పెరిగిపోయింది. నీకో సంగతి తెలుసా, నాకు అమర్ హత్య, అందులో నిందితుడిగా అజిత్ అరెస్ట్ కావడంవలనే, వాడిని రక్షించుకోవడానికే నేను వెంటనే రంగంలో దిగటం, అప్పటికి ఈ మిస్టీరియస్ హత్యల గురించి నాకు ఒక ఖచ్చితమైన అభిప్రాయం లేదు.. వాడికోసమే నేను ఇందులో డీప్‌గా ఇన్‌వాల్వ్ అయ్యాను.. వాడు కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నాడు. అందుకే వాడిని, నిజానికి మీ అందరినీ దూరం పెట్టడం.. నువ్వే మధ్య మధ్యలో వద్దాన్నా దూరిపోతున్నావ్..’’ చిన్నగా నవ్వేడు.
‘‘అయితే వాళ్లని రమ్మని ఫోన్ చెయ్యనా?’’ అడిగేడు అనే్వష్.
‘‘వద్దు.. నువ్వు కూడా వెంటనే హాస్టల్‌కి వెళ్లిపో. మీరు సాధ్యమైనంత త్వరగా ఇక్కడినుండి వెళ్లిపోండి. నాతో ఎక్కువగా టచ్‌లో ఉండకండి.. జాగ్రత్తగా ఉండండి. ఈ కేస్ గురించి మరిచిపోయినట్లే ఉండండి. లేకపోతే మీకు కూడా ప్రమాదం.. నువ్వు వచ్చి చాలాసేపు అయింది, ఇంక వెళ్ళు. అవసరమైనపుడు నేనే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తా.. ఓ.కె. ఆల్ ది బెస్ట్ నీకు, వాళ్లకి కూడా...’’
ప్చ్.. నేనే అనవసరంగా నిన్ను అనుమానించి, కోర్టులో దోషిగా నిలబెట్టకపోతే.. కమల్ చేసే పరిశోధన ఫలించి అసలు హంతకుడూ దొరికేవాడు.. ముఖ్యంగా కమల్ బతికేవాడు.. ఏదో చేద్దామనుకుని ఏదో చేసి మీ ప్రాణంమీదకు తెచ్చాను..’’ బాధగా అన్నాడు అనే్వష్.
‘‘అరే.. నువ్వే కాదు నీ పరిస్థితిలో ఎవరున్నా అంతే చేస్తారు. నేనే విషయం వివరించి మిమ్మల్ని కలుపుకుని పోకుండా... మీకు అనుమానం వచ్చేలా ప్రవర్తించి.. ఈ పరిస్థితి తెచ్చింది.. ప్చ్.. లీవిట్.. ఏం జరగాలని రాసి ఉందో అదే జరుగుతుంది. గీతలో కృష్ణుడు చెప్పినట్టు- చేసేవాడెవడు, చేయించేవాడెవడు.. అన్నీ ఆపైవాడే..’’ వేదాంతం వచ్చింది రాహుల్‌కి.
‘‘కానీ జాగ్రత్త, నీకు కూడా ఏదైనా జరగరానిది జరిగితే..’’ మాట మాత్రంగానైనా ఆ మాట అనుకుందుకి మనసు విప్పలేదు అనే్వష్‌కి.
‘‘సరే ఏం జరగదులే.. వర్రీ అవకు.. వెళ్ళు.. యిప్పటికే చాలా రాత్రి అయ్యింది.
అక్కడ సాహు అడిగేడు అనే్వష్ గురించి, అతను లాయర్ భగవాన్‌గారికి థాంక్స్ చెప్పి తాము ఇక్కడినుంచి వెళ్లిపోతున్నాం అని చెప్పి రావడానికి వెళ్ళేడు’’ అని చెప్పాడు అజిత్, ఎందుకో అతను రాహుల్ దగ్గరకి వెళ్ళేడు అన్న నిజం చెప్పలేదు.
***

-ఇంకాఉంది

- మీనాక్షి శ్రీనివాస్