భక్తి కథలు

స్వామియే శరణం అయ్యప్పా! 14

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూలోకంలో మహిష రూపంలో మహిషిని ఆనందపరుస్తున్న సుందరదత్తుడు భూతనాధుని ఆవిర్భావం జరగగానే మోక్షాన్ని పొందాడు! అతని మరణంతో మహిషిలో తిరిగి క్రోధావేశాలు కట్టలు త్రెంచుకుని పొంగివచ్చాయి! గుహలోనుండి వెలికివచ్చి పాతాళంలోని రాక్షసులను కూడకట్టుకుని దేవతలమీద యుద్ధం ప్రకటించి స్వర్గాన్ని స్వాధీనపరచుకుని ముల్లోకాలలో తిరిగి రాక్షస పాలన నెలకొల్పింది.
దేవతలు దీన వదనాలతో కైలాసానికి వచ్చారు! కళావిహీనులై కనిపిస్తున్న వాళ్లకు వూరట కలిగించాయి పరమేశ్వరుని వాక్కులు .
‘‘ఇంద్రాది దేవతలారా! మీ కష్టాలు త్వరలోనే తీరగలవు! భూతనాధుడు భూలోకానికి వెళ్లి ఆ మహిషిని వధించే సమయం ఆసన్నమైంది’’.
మేఘ గంభీర స్వరంతో పరమేశ్వరుడిచ్చిన అభయానికి కలతదేరారు దేవతలు!
‘‘ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్నాము స్వామీ! భూతనాధుడు వెంటనే బయలుదేరి భూలోకాన్ని చేరి మహిషిని ఎదుర్కొని హతం కావిస్తాడని అనుకుంటున్నాము! మా అంచనా సరైనదేనా స్వామీ?’’ అంటూ ప్రశ్నించాడు ఇంద్రుడు ఆతురత నిండిన స్వరంతో!
‘‘అంతటి తొందరపాటు తగదు ఇంద్రా! మహిషి అంతం కావడానికి మరికొంత కాలం వేచి వుండక తప్పదు! ఆమె పొందిన వరానుసారం హరిహర పుత్రుడు భూలోకంలో పనె్నండు సంవత్సరాలు రాజవంశంలో పెరగవలసి వుందన్న విషయం మరవవద్దు!’’ అని గంభీరంగా గర్తుచేశాడు పరమేశ్వరుడు,!
‘‘క్షమించండి స్వామీ! నా తొందరపాటుతనాన్ని మన్నించండి!’’ అంటూ చేతుల జోడించి నమస్కరించాడు ఇంద్రుడు!
‘‘పితృదేవులకు ప్రణామాలు’’ అంటూ అప్పుడే పత్నులతో సహా వచ్చి నమస్కరించాడు భూతనాధుడు! అతనివైపు ప్రసన్నంగా చూసి ‘‘పుత్రా! రాక్షస సంహారం కావించడానికి నీవు భూమిపై అవతరించవలసిన సమయం ఆసన్నమైంది!’’ అన్నాడు పరమేశ్వరుడు!
ఇంద్రుడు భక్తిపూర్వకంగా భూతనాథునికి నమస్కరించాడు! పరిపరి విధాలుగా స్తుతించాడు, భూతనాధు స్తుతి.
పంచ బాణకోటి కోమలాకృతే కృపానిధే
పంచగవ్య పాయసాన్న పావకాది మోదకా
పంచభూత సంచయ ప్రపంచ భూతపాలకా!
పూర్ణ పుష్కళ సమేత భూతనాథ పాహిమాం!
(కోటి మన్మథుల సౌందర్యం కలవాడివి! దయానిధివి! పాయసం, పానకాలు ఇష్టపడే స్వామి! పంచభూతాత్మకం అయిన ప్రపంచాన్ని పాలించేవాడవు! పూర్ణ, పుష్కళ అనే దేవేరులతో కూడిన భూతనాధా! మమ్మల్ని కాపాడు)
‘‘వీర బాహు వర్ణనీయ వీర్య శౌర్య వారిధే
వారిజాసనాది దేవవంద్య సుందరాకృతే
వారణేంద్ర వాజి సింహ వాహ భక్త సేవధే
పూర్ణ పుష్కళ సమేత భూతనాధ!
పాహిమామం’’
(వీరత్వంతో నిండిన బాహువులతో వీర్య శౌర్యాలు మూర్త్భీవించిన సముద్రానివి! ఓ భూతనాధా! దేవతలందరికీ వందనీయుడవు! గజ, అశ్వ, సింహాలు వాహనాలుగా కలిగినవాడవు! భక్తులకు కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చేవాడవు! పూర్ణా, పుష్కళ దేవేరులతో కూడిన స్వామీ! మమ్మల్ని కాపాడు)
‘‘సామగానలోల శాంతశీల ధర్మ పాలకా
సోమ సుందరాస్య సాధు పూజనీయ పాదుకా
సామ దాన భేద దండ శాస్త్ర నీతి భూతకా
పూర్ణ పుష్కళా సమేత భూతనాధ పాహిమాం!
(సామగాన ప్రియుడవు! శాంతి స్వభావుడవు! చంద్రునిలా సుందర రూపం గలవాడవు! నీ పాదాలను సాధుజనం పూజిస్తారు. చతురోపాయాలు- సామ, దాన, భేద, దండోపాయాలు తెలిసిన ధర్మశాస్తవు! పూర్ణ, పుష్కళా సమేతుడవైన భూతనాధా! మమ్మల్ని కాపాడు!)
అంటూ ఇంద్రుడు చేసిన స్తుతులకు మెచ్చి అభయం ప్రసాదించాడు భూతనాథుడు!
‘‘ఇంద్రాది దేవతలారా! త్వరలోనే స్వర్గ భోగాలు మీకు లభించగలవు! నిశ్చితంగా ఉండండి’’ అన్నాడు.
భూతనాథునికి, పరమేశ్వరునికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుని బయలుదేరారు దేవతలు!
వారు వెళ్ళాక తనను చూడవచ్చిన బ్రహ్మ, విష్ణువులవైపు చిరునవ్వుతో చూస్తూ ‘‘్భతనాథుడు భూలోకానికి వెళ్లవలసిన సమయం ఆసన్నమైంది’’ అన్నాడు పరమేశ్శరుడు.
***

- ఇంకాఉంది
.....................................................................................................
రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక,
36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003

డా. టి.కళ్యాణీ సచ్చిదానందం