డైలీ సీరియల్

బడబాగ్ని 45

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందుకే నా పుట్టుక, చదువు అన్నీ యిక్కడే.. కాకపోతే యింట్లో మా అమ్మా నాన్నా.. తెలుగు మాత్రమే మాట్లాడేవారు. అందుకే నాకు తెలుగు యింత బాగా వచ్చేసింది.. ఇంక కోర్టులో అంటావా, జడ్జి తెలుగు ఆయనే. కేసుల్ని బట్టి.. తెలుగేతరులయితే హిందీ, యింగ్లీష్ వాడతాం.. ఏదో అలా నడిచిపోతోంది.. యిక్కడి వాతావరణం, మనుష్యులూ అంతా బాగుంటుందయ్యా, అందుకే ఇక్కడే సెటిల్ అయిపోయాం.. అయినా యిప్పుడంతా ప్రపంచీకరణం వచ్చేసింది కదా.. అదేమిటీ గ్లోబల్ విలేజ్.. అదేదో.. అయినా అమెరికాలో ఒక స్టేట్ మొత్తం ఆంధ్రా వాళ్ళేనట.. ఒకప్పుడు.. ఓ జోక్ చెప్పేవారు..
ఆయనెవరూ నీల్‌ఆమ్‌స్ట్రాంగ్ అనే ఆయన చంద్రమండలంలో ప్రప్రథమంగా ప్రవేశించి తమ దేశపు జెండా పాతేడట.. ఆయన నేనే కదా తొలి ప్రవేశించి రికార్డ్ సృష్టించినది అని ఆనందపడేలోపు.. ‘చాయ్.. చాయ్’ అంటూ మలయాళీ అక్కడికి వచ్చేడట.. హా హా హా’’ పెద్దగా నవ్వేడాయన.
విషయం విన్నదే అయినా ఆయన హావభావ ప్రకటన నవ్వు తెప్పించింది రాహుల్‌కి.
‘‘్భలేవారే సార్ మీరు, భలే మాట్లాడతారు.. మీరు ‘తెలుగువారా’ అన్న చిన్న ప్రశ్నకి ఇంత సమాధానం చెప్పి పెద్ద లాయర్ అనిపించుకున్నారు’’ తను కూడా నవ్వుతూ అన్నాడు రాహుల్.
‘‘సరే మరి నే వెళ్లిరానా.. అదే వెళ్లి నా సామానుతో రానా’’ యింకా నవ్వుతూనే అడిగాడు.
‘‘సరే.. వెళ్లిరా.. భోజనం కూడా ఇక్కడే సుమా..’’ ఆదరంగా అన్నాడాయన.
ఆ రోజుకి ఆ పల్లెటూరుకి వెళ్లి తనకి కావలసిన వస్తువులతో మర్నాడు లాయర్ భగవాన్ ఇంటికి చేరాడు రాహుల్.
నాలుగు రోజులకే అర్థం అయింది ఆయన మనిషి మంచివాడేననీ, మంచి సమర్థుడనీ, కాకపోతే అందరూ తనని గుర్తించి గౌరవించి, పెద్దరికం యియ్యాలనే మనస్తత్వం అనీ.
ఆయన తన విషయాలు పట్టించుకుని, తనకి అన్ని సదుపాయాలూ వున్నాయా లేదా అని ఆరాటపడటం, తమ యింట్లో ఒకడుగా ఆప్యాయంగా చూడడం రాహుల్‌ని ఎంతగానో ప్రభావితం చేసింది.
‘‘ఆదివారం ఆయన యింట్లో ఖాళీగా ఉండడం చూసి కేసు విషయం మాట్లాడబోయాడు.. ఆదివారం సెలవోయ్, రా ఒక ఎత్తు వేద్దాం అంటూ చదరంగం ఆట మొదలుపెట్టాడాయన.. ఆయనకి ఆ ఆట అంటే పిచ్చనీ, అందులో మంచి ఉద్దండుడనీ అర్థం అయింది రాహుల్‌కి.
***
రాత్రి భోజనాల దగ్గర చెప్పాడు, రేపు ఉదయమే మనం ఒక దగ్గరికి వెడుతున్నాం త్వరగా తెమిలి ఉండమనీ..
ఉదయం ఎనిమిది గంటలకల్లా కారు సిద్ధంగా ఉంది.. ఎక్కడికీ అని కూడా అడగనియ్యకుండా అతనిని తొందరపెట్టి కారు ఎక్కించేసాడాయన.
వెడుతుండగా చెప్పేడు.. క్రిందటి జనవరి న్యూ యియర్ సెలబ్రేషన్స్ నాడు అక్కడకి దగ్గరలో ఉన్న హిల్ స్టేషన్‌లో హత్య జరిగిన చోటుకి ఇప్పుడు మనం వెడుతున్నది అని, రాహుల్ ఏం మాట్లాడలేదు.. ఆయన ఎలా దర్యాప్తు చేస్తాడో చూద్దాం అన్నట్టు చూస్తుండిపోయాడు.
ముందుగా రోహిత్ కుటుంబ సమేతంగా బస చేసిన రిసార్ట్‌కి వెళ్ళేరు.
అక్కడ తన ఐడెంటికీ చెప్పి ఆ రోజు రోహిత్ బస చేసిన కాటేజ్.. అక్కడనుంచి హత్య జరిగిన ప్రదేశం, సమయం అన్నీ వాళ్లని వివరంగా అడిగాడు.
రోహిత్ ఎక్కడనుంచి వచ్చాడు, ఏం చేసేవాడు.. యిక్కడ ఎన్ని రోజులు వున్నాడు అన్నీ వివరంగా అడిగి తెలుసుకున్నాడు, లాయర్ భగవాన్.
రోహిత్ ఆంధ్రావాలా అనీ, సిరామిక్ టైల్స్ వ్యాపారం అని చెప్పాడనీ.. అతను భార్యా, యిద్దరు ఆడపిల్లలతో వారం రోజుల జాలీ ట్రిప్‌కి వచ్చేడనీ హిందీలో చెప్పేడా వాచ్‌మెన్ తివారీ.
ఏమైనా అనుమానాస్పద సంఘటన కానీ, పరిస్థితులు కానీ, వ్యక్తులు కానీ ఆ రోజు అంటే హత్య జరగడానికి ముందు అక్కడ వున్నట్టు అనిపించిందా అనీ, రోహిత్ కుటుంబ వ్యక్తులు ఎవరితోనైనా ఘర్షణ పడ్డట్టు అనిపించిందా అని.. అడిగిన ప్రశ్ననే పలు రకాలుగా అడిగి వాళ్ళని తికమక పెట్టి ప్రశ్నల వర్షం కురిపించిన ఆయన్ని మెచ్చుకోలుగా చూసేడు రాహుల్.
‘‘ఆ రోజు అక్కడికి ఎవరైనా పిక్నిక్‌కి వచ్చారా’’ అన్న రాహుల్ ప్రశ్నకి పోలీస్ ఎకాడమీ వాళ్ళు వచ్చేరని చెప్పాడు అక్కడి వాచ్‌మెన్.
‘‘అక్కడికి ఎంత దూరంలో’’ అన్న ప్రశ్నకి అక్కడనుంచి కనుచూపు మేరలో ఉన్న గార్డెన్ రిసార్ట్స్ చూపించేడు అతను.
రోహిత్ వంటరిగా ఎక్కడికైనా వెళ్ళేవాడా అన్న రాహుల్ ప్రశ్నకి-
‘‘రోజూ ఉదయానే్న జాగింగ్‌కి వెళ్లేవాడు, తరువాత భార్య పిల్లలతో బయట పచ్చికలో కూర్చుని కబుర్లు, తర్వాత యింకా ఎక్కడికి వెళ్లినా కుటుంబమంతా కలిసి వెళ్ళేవారు’’ చెప్పాడు అతను.
అక్కడ వున్న రోజుల్లో అతను కానీ, అతని కుటుంబంలోనివారు కానీ ఎవరితోనైనా గొడవ పడటం కానీ, ఏదైనా ఘర్షణ పడటం కానీ, అతనిని ఎవరైనా కలుసుకోవడం లాంటివి జరిగాయా అని అడిగిన రాహుల్ ప్రశ్నకి.. అతను ఒక్క క్షణం ఆలోచించి జవాబు చెప్పేడు.

- ఇంకాఉంది

- మీనాక్షి శ్రీనివాస్