మంచి మాట

మహావైశాఖి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ పంచాంగ గణకులు పూర్ణిమ తిథికి ఎంతో ప్రాముఖ్యం ఇచ్చారు. సంవత్సరంలో వచ్చే ప్రతి పూర్ణిమకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఋతువులలో మొదటిదైన వసంతం ఋతురాజు. చైత్ర,వైశాఖ మాసాలు గలది. చైత్రం మధుమాసంగా, వైశాఖం మాధవ మాసంగా పేర్కొంటారు. వైశాఖ మాసం దైవీశక్తి కలదని ధార్మిక గ్రంథాలు చెప్పాయి.
జగద్గురువులు ఆది శంకరులు తమ వివేక చూడామణి’ గ్రంథంలో ఎందరో మహాత్ములు జన్మించి ‘వసంతం వలె లోకహితానికై పరిక్రమిస్త్తార’ని అన్నారు. వారు తమ జ్ఞానాన్ని అందరికీ పంచి లోకంలో జ్ఞానదీప్తులు వెలిగిస్తారనీ, ఏమీ ఇతరులనుండి ఆశించకుండా తమ అనుగ్రహ భాషణంతో ఫ్రజలను సన్మార్గం వైపు నడిపించి ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని ఇనుమడింపచేయడంలో దేశమంతటా పర్యటనలు చేస్తారని అన్నారు. మోడువారిన ప్రజల జీవితాలలో నిరాశా నిస్పృహలను తొలగించి జ్ఞాన బిక్షను ప్రసాదించి మానవజీవిత విలువలను తమ హితోపదేశాలతో ఉన్నత శిఖరాలను అందుకునేట్టు చేస్తారు. త్యాగము, సేవల విలువలను తెలియజేసివారి ప్రజల జీవితాలలో వసంతం పూయిస్తారు. అందుకే వారిని వసంతంతో పోలిక చేసారు విజ్ఞులు.
వైశాఖ మాసంలో చేసే స్నాన, ధ్యాన, జప హోమాదులు ఉత్కృష్టమైన ఫలాలను అందిస్తాయని ఆ కారణంగా ఎంతో మహిమాన్వితమైందని విజ్ఞులు చెబుతారు. ముఖ్యంగా ఈ మాసంలోని శక్తియంతా పూర్ణిమలో నిబంధించబడిందని, తత్కారణంగా సాధకులకు ఏంతో మేలు కలిగిస్తుందని అంటారు. వైశాఖ పూర్ణిమను వసంత పూర్ణిమగా, మహా వైశాఖిగా ప్రాచుర్యం పొందింది. ఈ పూర్ణిమ మహా మహిమాన్వితమని పురాణాలు ఉగ్గడిస్తున్నాయి. ఈమాసమంతా దానాది కార్యాలు చేయలేనివారు మాసపు చివరి మూడు రోజులైనా చేసే దానాలకు విశేష ప్రాధాన్యం ఉంది. జలదానం, వస్తద్రానం, ఛత్రదానం, పాదుకాదానం వంటివి చేస్తే గ్రహదోషాలు, అరిష్టాలు తొలగుతాయని అంటారు.
బోధనలచే పామరులు సైతం జ్ఞానులు అవుతారు. ఆ జ్ఞానవీచికలను ప్రబోధించే ఆధ్మాత్మికవేత్తలకు భారతదేశం పుట్టినిల్లు. అటువంటి జ్ఞానులెందరో ఈ వైశాఖమాసంలో ఆవిర్భవించారు. సామాన్యులను, అసామాన్యులెందరో వారివల్ల ప్రభావితులయ్యారు. అవతార పురుషులు, మహనీయులు, ఆచార్యులు తమ పుట్టుకకు వైశాఖ మాసాన్ని ఎంచుకున్నారా అన్నట్టుగా గౌతమబుద్ధుడు, ఆదిశంకరుడు, రామాను జుడు. హిందు సామ్రాజ్యాన్ని ప్రతిష్ఠించిన శ్రీ విద్యారణ్యస్వామి పుట్టిందీమాసంలోనే. అన్నమాచార్యుడు ఈమాసంలోనే జన్మనొందితే మహావిష్ణువు కూడా కూర్మావతారాన్ని దాల్చిందీ మాసంలోనే. జనులకు ప్రాణభిక్షనొసగే గంగామాత కూడా వైశాఖంలోనే భూలోకానికి ఏతెంచింది.
దుష్టశిక్షణార్థం నరమృగరూపంలో ఆవిర్భవించిన నృసింహుని జయంతిసైతం వైశాఖమే. అందుకే ఈమాసంలో ప్రతిదినమూ పుణ్య దినమే ఏకాలంలోనైనా మహావిష్ణువును స్మరించి పుణ్యమార్జించవచ్చు.
సేవాకైంకర్యం ఎంత గొప్పదో, దూత సౌజన్యమూర్తి అయతే దుష్టులుకూడా శిష్టులుగా ఎలా మారవచ్చో తెలియజెప్పే ఆంజనేయుని జన్మదినంఈ మాసంలోనే ఉంది. శ్రీరాముని పరమభక్తుడు ఆంజనేయుని జన్మ తిథి వైశాఖ బహుళ దశమి అని పరాశర సంహిత ఉవాచ.
‘సర్వే మనోనిగ్రహ లక్షణాంతాః’’ అన్నారు. అనగా ‘సర్వవ్యవస్థలయందును, సర్వకాలములయందును మనస్సును నిగ్రహించుకొనుట అనే లక్షణము ఉత్తమమైనది. ధ్యానము ద్వారా మనో నిగ్రహాన్ని సాధించకల్గితే అదే మన పాలిట దివ్యశక్తియై మనలో సత్య దయాది సద్గుణములను పెంచి, భక్తి, జ్ఞాన, వైరాగ్య భావనలను కలిగించి దివ్యమైన ఆత్మజ్ఞాన మార్గమున మనలను పయనించేటట్లు చేసి, శాశ్వతమైన ముక్తిని ప్రసాదిస్తుంది. పశుపక్ష్యాదులకంటె మానవుడు దేహము చేత, బుద్ధి చేత, జ్ఞానాదుల చేత అధికుడై ఉన్నాడు. ఇతర జంతుజాతి సాధించలేని నిత్యానందమును, దివ్యానందమును, అఖండానందమును సంపాదించునపుడే మానవజన్మ కృతార్థత పొందుతుంది. అటువంటి నిశ్చల మనస్సు సాధించడానికి దైవధ్యానమే సుమార్గం. ఆ మార్గాన్ని సులువు చేయడానికి ఆంజనేయుని స్మరణ ఎంతో ప్రాధాన్యతను పొందుతుంది. కనుక వైశాఖ దశమినాడు ఆంజనేయుణ్ణి ఎర్రనిపూలతో, తమల పాకులతో అర్చిస్తారు.

-ఎ.సీతారామారావు

-ఎ.సీతారామారావు