నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగణితజన్మకర్మదురితాంబుధిలో బహుదుఃఖవీచికల్
దెగిపడ నీదలేక, జగతీధవ నీపదభక్తి నావచే
దగిలి తరింప గోరితి బదంపడి నాదుభయంబు మాన్పవే
తగదని చిత్తమందిడక దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: ఓ లోకనాధా, ఓ రఘురామా, లెక్కింపరాని జన్మములందలి కర్మరపరంపరలచేత, కలిగిన పాపాలు సముద్రంలా అపారంగా ఉన్నాయి. ఆ పాపాల వల్ల అనేక దుఃఖాలు కెరటాలలా వచ్చి పడుతున్నాయి. వాటిని నాయంతట నేను నిర్మూలించుకోవడం సాధ్యం అయ్యే పని కాదు, అందుచేత నీ పాదాల మీద భక్తి కలిగి, దానిని ఓడలాగ చేసుకుని, ఈదరాని సముద్రాన్ని ఓడచే సులభంగా దాటినట్టు నా పాపాలను తేలికగా పోగొట్టుకొనదలిచాను. నా ఈ సంకల్పాన్ని నీవు తగినది కాదు అని నిరాకరించక, అనగా స్వీకరించి నా వెరపును, భయాన్ని నిర్మూలించుమా.

దాశరథీ శతకములోని పద్యము

దాశరథీ శతకములోని పద్యము