భక్తి కథలు

స్వామియే శరణం అయ్యప్పా! 35

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నగా మందహాసం చేసి ‘‘నీవు సరిగానే విన్నావు! నీ దుఃఖాన్ని పోగొట్టి శాంతిని ప్రసాదించి కర్తవ్యోన్ముఖుడిని చేసే బాధ్యత నాపై పెట్టి పంపాడు హరిహరపుత్రుడు! ఈ చరాచర సృష్టిని పాలించి, లయం చేసే హరిహరుల పుత్రుని, తారకబ్రహ్మను (అందరినీ తరింపజేసేవాడు) నీ పుత్రుడుగా భావిస్తూ నీ దగ్గరే వుండిపోవాలని ఆశించటం అవివేకం రాజా! తారకబ్రహ్మ ధర్మాన్ని శాసించే ధర్మనాశా పూర్వం నీకిచ్చిన వరానికి కట్టుబడి ఇప్పుడు నీకు కుమారుడై ఇన్ని సంవత్సరాలు నీకు అంతులేని ఆనందాన్ని ప్రసాదించడం జరిగింది! నా తపఃశక్తితో నీకు నీ గత జన్మ విషయాలు అవగతవౌతాయి! చూడు’’ అంటూ దివ్యదృష్టిని ప్రసాదించాడు! రాజశఖరుడు కుతూహలంగా చూడసాగాడు!
***

రాజశేఖరుని గత జన్మ వృత్తాంతము- విజయుని కథ
‘‘హర హర మహాదేవ! శంభో శంకర! భవగతి భిక్షాందేహి!’’
బయటనుండి ఎవరో పిలుస్తుండటంతో లేచి వెళ్లి తలుపు తీశాడు విజయుడు! కాషాయ వస్త్రాలు ధరించి, నుదుట విభూతిరేఖలు దిద్దుకుని, మెడలో రుద్రాక్ష మాలలతో నిలిచి ఉన్నాడు ఒక సన్యాసి!
‘‘నాయనా! కాశీ పట్టణానికి వెళుతున్నాను విశే్వశ్వర జ్యోతిర్లింగ దర్శనానికి! ఈ రోజుకు ఇక్కడ బస చేయడానికి చోటివ్వగలవా?’’ అడిగాడు.
‘‘తప్పకుండా స్వామీ! లోపలకు దయచేయండి! నా భార్య అస్వస్థురాలు! పుట్టింటికి వెళ్లింది! నేను చేసిన ఉపాహారం ఉన్నది! కూర్చోండి! ఇప్పుడే తెస్తాను!’’ అని చాప పరచి సన్యాసిని కూర్చోమని లోపలకు వెళ్లాడు విజయుడు!
అడవికి సమీపంగా వున్న ఆ గ్రామంలో నివశిస్తున్న సామాన్య గృహస్థుడు విజయుడు! సదాచార బ్రహ్మణ వంశంలో పుట్టి పౌరోహిత్యం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు!
లోపలనుండి అటుకులతో చేసిన ఉపాహారాన్ని ఆకులో పెట్టుకుని తీసుకువచ్చాడు!
‘‘ఇంతకంటే మీకు పెట్టడానికి ఏమీ లేనందుకు విచారిస్తున్నాను! స్వామి! ఈ అటుకులు, అరటిపళ్లు స్వీకరించండి!’’ వినయంగా చెప్పి ప్రక్కనే కూర్చుని విసరసాగాడు విజయుడు!
‘‘నీ వినయం, నీవు చేస్తున్న అతిథి సత్కారం ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి! నీవెందుకో బాధపడుతున్నట్లుగా తోస్తున్నది నీ ముఖం చూస్తుంటే! నీ భార్య అస్వస్థత గూర్చి చింతిస్తున్నావా?’’ ఆదరంగా అడిగాడు సన్యాసి తినటం ముగించి!
‘‘అవును స్వామీ! సంతానం లేని బాధ ఆమెనెంతగానో క్రుంగదీస్తున్నది! నాకూ ఆ బాధ వుంది కానీ బయటకు చెప్పుకోవటం లేదు. నిబ్బరంగా వుండటానికే ప్రయత్నిస్తున్నాను! ఎవరేది చెబితే ఆ పూజా వ్రతాలు చేస్తూనే వున్నాము! అయినా భగవంతుడికి మా మీద దయ కలగటంలేదు. ఈ జన్మకు సంతాన ప్రాప్తి లేదని నేను సరిపుచ్చుకుంటున్నాను గానీ నా భార్యే ఆ కొరతను మర్చిపోలేకుండా వుంది!’’ అంటూ మనస్సులోని బాధను సన్యాసిముందు వెళ్ళబోసుకున్నాడు.
అతని ముఖంలోకి కొన్ని క్షణాలు దీక్షగా చూశాడు సన్యాసి!
‘‘ఊ! ఆ విధంగా నిరాశ చెందవద్దు! ఓంకార రూపుడైన పరమాత్మ అనుగ్రహిస్తే ఏ కోరికైనా ఫలిస్తుంది! కానీ నిష్ఠతో గురువు ఉపదేశంపొంది ఓంకార రూపుని ధ్యానిస్తే తప్పక ఫలితం లభిస్తుంది! ఇలారా!’’ అంటూ దగ్గరకు పిలిచి చెవిలో ప్రణవాన్ని (ఓంకారాన్ని) మూడుసార్లు వినిపించాడు సన్యాసి!
‘‘ఓంకారం భగవంతుని నాదస్వరూపం! ఈ ప్రణవనాదాన్ని నిష్ఠతో ఏకాగ్రతతో జపించు! త్వరలోనే నీ కోరిక తీరే మార్గం లభిస్తంది!’’ అని చెప్పి మర్నాడు ప్రయాణామై వెళ్లిపోయాడు సన్యాసి!
ఆయన ఉపదేశించిన ప్రణవాన్ని నిర్మలమైన హృదయంతో ధ్యానించసాగాడు విజయుడు! ఇతర కార్యాలు చూసుకోవలసి వుండటంతో రోజూ కొంతసేసపు ఆ ధ్యానంలో గడిపేవాడు!

-ఇంకాఉంది

రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక,
36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003

-డా. టి. కళ్యాణీ సచ్చిదానందం