మంచి మాట

హనుమ జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతులిత బలధామం హేమ శైలాభ దేహం
దను జవన కృశాం జ్ఞానినామగ్ర గణ్యం
సకల గుణ నిధానం వానరాణా మధీశం
రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి
శ్రీరామ భక్తాగ్రేసరుడు, అతులిత బలధాముడు, ఆపద్బాంధవుడు, సకలభీష్ట వరదుడు అయిన హనుమంతుడు వైశాఖ బహుళ దశమి దినమున జన్మించాడని హనుమంతుని జయంతిని పురస్కరించుకుని ప్రతిఇంట్లోను, ప్రతిదేవాలయంలోను వేడుకలు చేస్తారు.
ఆంజనేయుడు బలానికి, ధైర్యానికి, జ్ఞానానికి, సాహసానికి ప్రతిరూపంగా నిలిచిన దైవం. శ్రీరాముని బంటుగా, రాక్షస మూకకు, దుర్మార్గుల పాలిట యమునిగా తను నమ్మిన భక్తులకు కొండంత అండగా నిలుస్తాడు. అంజనీపుత్రునిగా, వాయు తనయునిగా, ఈనాటికి కూడా చిరంజీవిగా హిమాలయాల్లో తపోనిష్టలో చిరంజీవిగా వెలుగొందుతున్నాడు. ప్రతి రామమందిరంలో మనకు ఆంజనేయుడు కనిపిస్తాడు. అదీ కాక ఆంజనేయునికి ప్రత్యేక ఆలయాలు భారతదేశంలోనే వేల సంఖ్యలో ఉన్నాయి.
వానర రాజైన కేసరికి, ఆయన భార్య అంజనాదేవికి పుత్రునిగా పరమేశ్వరుడు తన నిజాంశతో అంజనాదేవి శ్రవణాంగము ద్వారా ఆమె గర్భమున ప్రవేశించాడు. వైశాఖ బహుళ దశమీ శనివారంనాడు వానరరూపంలో అంజనాదేవి గర్భమున శ్రీ ఆంజనేయుడు జన్మించాడు. ఈ విధంగా అంజనాదేవికి వాయుపుత్రుని పొందే మహద్భాగ్యము కలిగింది. కార్తీక కృష్ణ చతుర్దశి హనుమజ్జయంతిగా కొందరు జరుపుకుంటారు. హనుమజ్జయంతి నాడు పూజామందిరంలో స్వామి పటం పెట్టి
ఆంజనేయుని ఆహ్వానించి ధ్యానించి పూజించి పురుష సూక్త విధానంలో అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, నైవేద్యం మొదలైన షోడశోపచారములతో అష్టోత్తర శతనామ పారాయణతో పూజ చేయవలెను.
ధూపం సమర్పించినపుడు గుగ్గిలం సాంబ్రాణీతో దశాంగము, కలిపి ధూపం వేయవలెను. నైవేద్యం ఇచ్చునపుడు మామిడిపండ్లు, గుడాన్నము (బెల్లంతో చేసిన పొంగలి), వడలు నివేదన చేయవలెను. నువ్వులతో కలిపిన బెల్లం ఉండలు 18గాని 108 గాని చేసి నివేదించవలెను. ఎర్రని వస్తమ్రులతోను, ఎర్రని పుష్పములతోను, ఎర్ర చందనంతోను, ఎర్రని అక్షతలతోను ఆంజనేయస్వామిని ఆరాధించవలెను. దేవాలయానికి వెళ్లి స్వామివారిని దర్శించి తీర్ధప్రసాదాలు సేవించాలి. హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణ చేయాలి. అలా చేసిన అన్ని రంగాల్లోను ఎనలేని విజయం, ధైర్య సాహసాలు చేకూరుతాయి.
ఆంజనేయుడు ఆకాశంలో అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని చూసి పండుగా భ్రమించి దాన్ని తినడానికి ఆకాశమార్గాన బయలుదేరాడు. అది గమనించిన ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఎదుర్కొన్నాడు. ఆ దెబ్బకు హనుమంతుడు ఒక కొండపై పడి ప్రాణాలు కోల్పోయాడు. ఇది తెలుసుకున్న వాయుదేవుడు హనుమంతుని బతికించడానికి ఒక గుహలోకి తీసుకుపోయాడు. తన సంచారం వాయుదేవుడు ఆపివేసాడు. సర్వలోకాలకు గాలి అందక అతలాకుతలం అవసాగాయ. దేవతలంతా ఈ విడ్డూరం చూశారు. దీనికి కారణం కనుగొన్నారు. వారంతా వెంటనే వాయుదేవుని దగ్గరకు బయలుదేరారు.
వాయునందనుడు ఉన్న ఆ గుహ వధ్దకు వచ్చి బ్రహ్మదేవుడు హనుమంతుడ్ని బతికించాడు. ఇంద్రుడు మహిమగల పద్మమాల ఒకదాన్ని ఇచ్చి హనువుకు అంటే ఎడమ దవడకు దెబ్బ తగలడం చేత ఇకనుండి ఆ బాలుడు హనుమంతుడు అనే పేరుతో వెలుగొందును అని పలికెను. పరమేశ్వరుడు హనుమంతుడ్ని చిరంజీవిగా నిలుస్తాడని దీవించెను. మిగిలిన దేవతలంతా తలా ఒక వరం ఇచ్చి హనుమంతుడ్ని దీవించారు. తన కుమారుడు బతికినందుకు వాయుదేవుడు సంతోషించి తిరిగి లోక సంచారం చేయడం ప్రారంభించాడు. గాయత్రీ మంత్రములలో ‘వాయుపుత్రాయ విద్మహే పవమానాయ ధీమహితన్నో ఆంజనేయ ప్రచోదయాత్.’ అనే ‘ఆంజనేయ గాయత్రి’ మంత్రం విశేషపుణ్యాలను సమకూరుస్తుంది.ఆంజనేయస్వామికి మంగళ, శనివారాలు ఎంతో ప్రీతికరమైనవి. హనుమజ్జయంతినాడు ఆయనను తమలపాకులతో అర్చించడం శ్రేష్టం.

-ఆళ్ల నాగేశ్వరరావు