భక్తి కథలు

స్వామియే శరణం అయ్యప్పా! 36

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక రోజు అడవిలోనుండి కట్టెలు కొట్టి తెచ్చుకోవడానికి వెళ్లాడు! అడవి మార్గంలో వెళుతున్న అతనికి చిన్న కుటీరం ముందు కూర్చుని తనలో తాను మాటాడుకుంటున్న ఒక వృద్ధురాలు కనిపించింది! అప్రయత్నంగా ఆమె వైపు అడుగులు వేశాడు విజయుడు!
***
‘‘మణికంఠా! స్వామీ! ఇంకా ఎప్పుడు నీకు నామీద దయ కలుగుతుంది? ఎప్పుడు ఈ వృద్ధురాలిని చూడటానికి వస్తావు?’’’ తనలో తను గొణుక్కుంటున్న ఆమెను సమీపించాడు విజయుడు!
కళ్లు మూసుకుని ధ్యానిస్తున్నట్లుగా వున్న ఆ వృద్ధురాలిమీద భక్తి గౌరవాలతో నిండిపోయింది మనస్సు!
‘తను ధ్యానిస్తున్న ఓంకారం సగుణరూపంతో తనకు దర్శనమిచ్చే మార్గం ఈమె చెప్పగలదేమో’ అని తోచడంతో ‘‘అమ్మా! అమ్మా!’’ అంటూ పిలిచాడు మృదువుగా!
పలకరింపుకు మెల్లగా కళ్లు తెరిచి చూసిందామె! సమీపంగా నిలిచిన అతని వైపు ఆప్యాయంగా చూస్తూ ‘‘ఎవరు నాయనా నీవు?’’ అని అడిగింది!
‘‘అమ్మా! నా పేరు విజయుడు! ఇక్కడే దగ్గర్లో వున్న గ్రామంలో వుంటున్నాను!
‘ఓంకారం తారకబ్రహ్మ నాద తనువు! ఆ ఓంకారాన్ని ధ్యానిస్తూ వుండు, నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది!’ అని ఒక సాధు పుంగవుడు నాకు ఉపదేశించాడు!
నేను సంసారిని! అడవిలో ఏ చెట్టు క్రిందో కూర్చుని ఓంకారాన్ని ధ్యానిస్తూ తపస్సు చేసే అవకాశము, సామర్థ్యము లేవు! రోజూ నియమంగా కొంతసేపు ధ్యానిస్తుంటాను! దానితో తారకబ్రహ్మ సంతుష్టుడై నా కోరిక తీరుస్తాడంటావా? తారకబ్రహ్మ అంటే ఎవరు? నాకు చూడాలని వుంది! ఆ అవకాశం లభిస్తుదంటావా?’’ అని అడిగాడు.
చిన్నగా మందహాసం చేసింది వృద్ధురాలు!
‘‘నా కోరికా అదే! తారకబ్రహ్మ హరిహరుల పుత్రుడైన మణికంఠుడని, ఆయన భూలోక వాసులను ఉద్ధరించడానికి త్వరలోనే ఈ ప్రాంతానికి వస్తాడని నాకు మా గురువుగారు తెలిపారు. తారకబ్రహ్మ ఈ సృష్టికంతా మూలం! ఆయన సంకల్ప మాత్రం చేత చరాచర సృష్టి జరిగింది! తనను శరణువేడినవారిని సంసార సాగరంనుండి తరింపజేసి అనుగ్రహిస్తాడు గనక తారకబ్రహ్మగా ఆరాధింపబడుతున్నాడు! ఆయనకు అనంతమైన నామాలున్నాయి! ఏ నామంతో పిలిచినా ఆ స్వామికే చెందుతాయి! జ్యోతిరూపంతో వెలిగే ఆ స్వామి మన వంటివారికోసమే రూపుధారణ కావిస్తాడు! ఒక్కొక్క రూపుకు ఒక్కొక్క ప్రయోజనం వుంటుంది! దుష్టశిక్షణ, శిష్టరక్షణే ప్రధాన లక్ష్యాలుగా తారకబ్రహ్మ ఆవిర్భవిస్తుంటాడు! మరికొద్దికాలంలో దేవతలను బాధిస్తున్న ఒక రాక్షసిని వధించడానికి భూమిపై అవతరించబోతున్నాడని తెలిపి నన్నిక్కడే మహిమాన్వితమైన మణిహారాన్ని కంఠాన ధరించి, ధర్మరక్షణ కావించే ధర్మశాస్తాగా అవతరించబోతున్న ఆ స్వామి దివ్య రూపాన్ని ధ్యానిస్తూ ఉండమని ఆదేశించి హిమాలయాలవైపు సాగిపోపోయారు మా గురుదేవులు! నేనిక్కడ ఆ స్వామి రాకకోసం ఎదురుచూస్తూ వున్నాను! నా పేరు శబరి!’’ అని వివరంగా చెప్పింది శబరి అనే పేరుగల ఆ వృద్ధురాలు!
‘‘శబరిమాతా! నీవు చెప్పిన విషయాలు విని తారకబ్రహ్మను దర్శించాలన్న కోరిక నాలో మరింత అధికమైంది! నా కోరిక తీరే మార్గం నీవే తెలియజేసి నన్ను ధన్యుడిని కావించు!’’ అంటూ వేడుకున్నాడు విజయుడు!
కొంతసేపు ఆలోచించి అన్నది శబరిమాత! ‘‘నాయనా! నాకు తెలిసిన దేవరహస్యం నీకు తెలుపుతున్నాను! నిన్ను చూస్తుంటే అందుకు అర్హుడివేనని నా మనస్సుకు అనిపించటమే అందుకు కారణం!’’ అంటూ ఆమె చెబుతుంటే శ్రద్ధగా వినసాగాడు విజయుడు!

కళ్లు మూసుకుని గంభీరమైన కంఠంతో నెమ్మదిగా చెప్పసాగింది శబరి!

-ఇంకాఉంది

రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక,
36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003

-డా. టి.కళ్యాణీ సచ్చిదానందం