నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపలలొమ, రామ, రఘుపుంగవ రామ, త్రిలోక రాజ్య సం
స్థాపనరాయ,మోక్ష ఫలదాయక రామ, మదీయ పాపముల్
పాపగదయ్య రామ, నిను ప్రస్తుతి చేసేదనయ్య, రామ, సీ
తాపతి రామ, భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!

భావము: రామా, నీవు రాజులలోకెల్లా శ్రేష్ఠుడవు. మరి రఘు వంశంలో పుట్టిన వారిలో శ్రేష్ఠుడవు. ముల్లోకములు స్థిరముగా వుండేటట్లు పరిపాలించే సమర్థుడవు మోక్షమును కైవల్యమును, దాని ఫలమును ఇచ్చేవాడవు. నిన్ను స్తోత్రము చేస్తాను. నీవు లక్ష్మీదేవి వంటి సీతాదేవికి భర్తవు. ఇటువంటి గొప్పదనం కలిగినవాడవు కాబట్టి తెలిసినంత వరకు నిన్ను పొగడెదను. ఆ పొగడ్తను బట్టి అయినను నా పాపములను పోగొట్టి నన్ను కాపాడుము.

దాశరథీ శతకములోని పద్యము

దాశరథీ శతకములోని పద్యము