నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. ఘనముగ నయ్యింద్రోత్సవ
మొనరించు మహీనతులకు నొగి నాయుర్వ
ర్ధనము నగుఁ బెరుఁగు సంతతి
యనవరతము ధరణిఁ బ్రజకు నభివృద్ధి యగున్
భావం: ఇంద్రోత్సవాన్ని వైభవంగా చేసే రాజులకు ఆయువు పెరుగుతుంది. సంతతి వృద్ధి చెందుతుంది. అతని రాజ్యంలోని ప్రజకు ఎల్లప్పుడూ అభివృద్ధి జరుగుతుంది. ముని ఆశ్రమం చూడగానే వసుమహారాజుతపస్సులోకి మునగిపోయాడు. దాన్ని చూచిన ఇంద్రుడు ఆశ్చర్యానందాలతో ఆరాజును చూచి పొగిడి వసువును ఇంద్రలోకానికి తరుచుగా వచ్చిపోయేట్టుగా ఉండుమని అడిగాడు. అట్లా రావడానికివీలుగా దివ్యత్వాన్ని, మణిసువర్ణమయమైన దివ్యవిమానాన్ని , వాడాపోనీ దివ్యకమలాలు గల ఓ విమానాన్ని, దుష్టశిక్షణకు శిష్టరకణ కు పనికివచ్చే వేణుయష్టిని కూడా ఆరాజుకు ఇచ్చాడు. అవి అన్నీ తీసుకొన్న ఆ వసువు అపరిమితానందంలో ఇంద్రలోకంలోను, భూలోకంలోను స్వేచ్ఛగా విహరించేవాడు. దాంతో అతనిని ఉపరిచరుడు అని పేరుతో జనులు వ్యవహరించేవారు. ఆ ఉపరిచరుడు ఇంద్రోత్సవాన్ని జరిపించేవాడు. దీనివల్ల వారివృద్ధి జరిగేది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము