నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. అంబుజముఖి యక్కన్న ప్రి
యంబొనరఁగ మత్స్యగంధి యనఁగా ధర్మా
ర్థంబుగఁ దన తండ్రి నియో
గంబున నయ్యమున నోడఁ గడుపుచు నుండెన్

భావం; బ్రహ్మ శాపం పొందిన అద్రిక అను అప్సరస తన శాపం తీరుటకు వసురాజు వీర్యాన్ని మ్రింగి గర్భవతి అయింది. చేప రూపంలో నున్న అద్రిక పొట్ట చీల్చి చూసిన జాలర్లు అందులో నుంచి వచ్చిన మనుష్యుల రూపంలోనున్న శిశువులను చూచి ఆశ్చర్యానందాలకు గురయ్యారు. వారు వెంటనే దాశరాజుకీ విషయం చెప్పి ఆయనకు వీరిద్దరినీ ఒప్పగించారు. ఇక అపుడు బాలుడేమో మత్స్య రాజు అన్న పేరుతో పెరిగి పెద్దయై మత్స్యదేశాధిపతి అయినాడు. కూతురేమో మత్స్యగంధి అన్న పేరుతో దాశరాజు దగ్గర పెరుగుతోంది. పద్మం వంటి చక్కటి ముఖం గల ఆ కన్య మత్స్యగంధి అనే పేరుగల దై తన తండ్రి ఆజ్ఞచొప్పున యమునా నదిలో ఓడ నడుపుచున్నది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము