డైలీ సీరియల్

పూలకుండీలు 48

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మీ ప్రయత్నంలో ఆడబిడ్డ అయినా మగ బిడ్డ అయినా సమానంగా స్వీకరించండి. అదే నా రిక్వెస్ట్’’ అప్పటిదాకా నవ్వుతూ మాట్లాడిన డాక్టర్ ఎందుకో ఒక్కసారిగా గంభీరంగా మారిపోతూ అన్నారు.
లింగ వివక్షకు బలైపోతున్న ఆడపిల్లలపట్ల మనసు నిండా సానుభూతి నింపుకున్న డాక్టర్ విశ్వామిత్ర అభ్యర్థనకు జల జల కన్నీళ్ళు జాలువారుతున్న కళ్ళతో ‘‘ప్రమాణం చేసి చెబుతున్నాం సార్! మాకు అమ్మాయి కలిగినా అబ్బాయి కలిగినా వారిని దైవమిచ్చిన ప్రసాదంగా స్వీకరించి మా గుండెలమీద పెంచుకుంటాం’’ అంటూ అనిత, కిషోర్‌లిద్దరూ డాక్టర్‌కి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బయటకు నడిచారు.
అదే రోజు రాత్రి హైదరాబాద్ ఫోన్ చేసి డాక్టర్ అంకిరెడ్డితో మాట్లాడిన అనితా, కిషోర్‌లు వాళ్ళు రేటూ డేటూ ఫిక్స్ చేసుకున్నారు.
హాస్పిటల్ వాళ్ళు ఎప్పుడైతే అనితా వాళ్ళ కేస్ టేకప్ చేశారో అప్పుడే అర్జంట్‌గా ఓ ఆడమనిషి కావాలని తమ ఏజెంట్ వెంకటరెడ్డికి తెలియజేశారు.
ఆ వెంకటరెడ్డి పాల్వంచలోని తన ఏజెంట్ ఆర్‌ఎంపి లింగయ్యను ఫోన్లో కాంటాక్ట్ చేసి విషయం చెప్పాడు.
అంతే!
వెంటనే రంగంలోకి దిగిన ఆర్‌ఎంపి లింగయ్య వారం రోజుల్లో శాంతమ్మను వలవేసి పట్టుకుని సరోగసి మదర్‌గా ఒప్పించి ఏడు నెల్ల కింద హైదరాబాద్ పంపించాడు.
ఆ తరువాత అమెరికా నుండి హైదరాబాద్ వచ్చిన అనిత, కిషోర్ దంపతులు అజంతా హాస్పిటల్లో డాక్టర్ అంకిరెడ్డిని కలిసి వాళ్ళ ఒప్పందం మేరకు పనె్నండు లక్షలకు చెక్ ఇచ్చేసి, డాక్టర్లకు కావాల్సినవేవో అందజేసి తిరిగి అమెరికా వెళ్లిపోయాడు.
****
‘‘అదీ జరిగిన విషయం. అప్పుడు అన్నింటికీ ఒప్పుకున్న వాడే ఇప్పుడిలా హాస్పిటల్ ముందుకొచ్చి గొడవ చేస్తున్నాడు’’ అంటూ అప్పటిదాకా జరిగిన ఒక్కో సంఘటననూ సంక్షిప్తంగా వివరించి చెప్పాడు చైర్మన్ అంకిరెడ్డి ఎస్సైతో.
‘‘అబ్బో మీరు చెప్పేదంతా వింటుంటే అంతా ఓ కథలా అన్పిస్తుంది సార్!’’ చైర్మన్ని పసందు చేస్తూ అనుకొచ్చాడు ఎస్సై.
ఇంతలో ఏదో ఫోన్ రావడంతో ఎత్తిన చైర్మన్ అంకిరెడ్డి ‘‘అలాగలాగే అరగంటలో అక్కడుంటాను’’ అంటూ ఫోన్ కట్ చేసి తిరిగి ఎస్సై వైపు చూస్తూ ‘‘సరే కలుద్దామండీ! నేనర్జంటుగా ఓ చోటుకెళ్లి రావాలి. మీ మిసెస్ అకౌంట్‌లో ఎవౌంట్ క్రెడిటవుతుంది తీసుకోండి’’ అంటూ లేచి షేక్‌హ్యాండిచ్చాడు.
‘‘ఓకే సార్! అలాగే,. కానీ ఆ గల్లీ లీడర్ల విషయం మీరు చూసుకుంటే, ఆ బికారిగాళ్ళ సంగతి నేను చూసుకుంటాను సరేనా’’ అంటూ చైర్మన్‌కి వినయంగా నమస్కారం చేసిన ఎస్సై నెమ్మదిగా వెనుదిరిగాడు.
లిఫ్ట్ దిగి ఎల్లయ్య వాళ్ళ దగ్గరికి వస్తూ వస్తూనే ‘‘ఏంట్రా దగుల్బాజీ నాకొడకా! నీ పెళ్ళాన్ని హాస్పిటల్ వాళ్ళు మోసం చేసి ఎక్కడో దాచారా? ఎక్కడ దాచారో మేం చూపెట్టాలా! అంటూ ఫెడేల్‌మని ఎల్లయ్య కుడి చెంపమీద చాచిపెట్టి కొట్టాడు ఎస్సై.
ఆ దెబ్బకు అంతతెత్తుకు ఎగిరి ఆవల పడ్డాడు ఎల్లయ్య.
ఆ దృశ్యాన్ని చూసిన ఎల్లయ్య తల్లిదండ్రులు, పిల్లలు ఒక్కసారిగా గొల్లుమని ఏడ్చుకుంటూ లేచి కిందపడిన ఎల్లయ్య దగ్గరికి పరుగులు తీశారు.
అది చూసిన గల్లీ లీడర్లు ‘‘ఓర్నీయమ్మ! ఇందేందిరో ఈ దిక్కులేనోల్లకు ఏదో సాయం జేసేవాడిలా మన ముందు ఫోజ్‌బెట్టి పెద్ద పులి లెక్క లోపలికెళ్లిన ఎస్సైగాడు ఇంతసేపు లోపల కూర్చుని ఏం బిస్కెట్లు తిన్నాడో ఏమోగానీ వస్తా వస్తానే ఊరోని మీద చెయ్యి చేసుకుంటున్నాడు! ఇప్పుడు మనం కలుగచేసుకుంటే ఎనకా ముందూ చూడకుండా మనను కూడా న్యూసెన్స్ కేసు కింద నాలుగు జబురుకుంటాడేమో, ఇప్పుడేం చేద్దాం?’’ అనుకుంటూ చెవులు కొరుక్కోసాగారు.
అంతలోనే వాళ్ళదగ్గరికొచ్చిన సెక్యూరిటీ గార్డు ఒకడు ‘‘మిమ్ముల్ని ఫైనాన్స్ మేనేజర్ రమ్మంటున్నాడు’’ అంటూ వార్త మోసుకొచ్చాడు.
ఆ వార్త వింటూనే వాళ్ళ ముఖాలు విప్పారిపోతుంటే లేచి తిన్నగా ఎస్సై దగ్గరికివెళ్లిన గల్లీలీడర్లు ‘‘అసలేమైంది సార్!’’ గుంట నక్కల మాదిరిగా అడిగారు.
‘‘నేను చెప్పేదేముంది ఇదుగో ఈ పేపర్లే చెబుతాయి చూడండీ!’’ అంటూ తన చేతిలోని పేపర్లను విసరుగా లీడర్ల చేతికిచ్చాడు ఎస్సై.
ఆ పేపర్లను వడి వడిగా అటూ ఇటూ తిరగేసి గల్లీ లీడర్లు ఎల్లయ్య దగ్గరికొచ్చి ‘‘అరే మాదర్చోద్! ఏందిరా నువ్ చేసిన పని? ఏడు నెల్ల కింద నీ అంతట నువ్ నీ పెళ్ళాన్ని హాస్పిటల్లో జేర్పించిన డబ్బులు తీసుకొని పొయ్యి. ఇప్పుడేమో ఏమీ జరుగని నంగసాని తుంగబుర్రలెక్క ఈ ముసలోళ్లను, పొల్లగాళ్ళనూ ఎమ్మటి పెట్టుకొని వచ్చి హాస్పిటల్ ముందు బైఠాయించి పబ్లిక్‌కు సఫర్‌జేస్తావ్‌లే’’ అంటూ ఎల్లయ్యను నానా దుర్భాషలాడారు.
వాళ్ళు అంటున్నదేంటో ఏ మాత్రం అర్థంగాని ఎల్లయ్య ఎస్సై చేతి దెబ్బతిన్న చెంపను అరచేత నెమరుకుంటూ ‘‘ఏంది మీరనేది?!’’ విచిత్రపడిపోతూ అన్నాడు.
‘‘ఇదుగో ఈ సంతకం నీదేనా చూడు’’ అంటూ ఎస్సై ఇచ్చిన పేపర్లను ఎల్లయ్యకు చూపించారు.
ఆ సంతకాన్ని చూడడంతోనే ఏడునెలోల కింద జరిగిన సంగతులన్నీ మరోమారు కళ్ళముందర బొంగరం మాదిరిగా తిరుగుతుంటే ‘‘అప్పుడు నీ భార్య గర్భసంచికి గడ్డైంది, వెంటనే ఆపరేషన్ చెయ్యకుంటే ప్రాణానికే ప్రమాదమని ఫోన్ చేస్తే అప్పటికప్పుడు బొంబాయినించి ఉరుకొచ్చి సంతకం జేసిపోయిన కాయితాలియ్యి.

- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు