ఈ వైభోగంతో ఆనందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* డైరెక్టర్ నందినిరెడ్డి
నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నందినిరెడ్డి దర్శకత్వంలో శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై దామోదర్ ప్రసాద్ నిర్మించిన ‘కళ్యాణవైభోగమే’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతోన్న సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ప్లాటినమ్ డిస్క్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నందినిరెడ్డి మాట్లాడుతూ, ‘ఈ ఫంక్షన్ మా ఇంట్లో జరుపుకున్నట్లుంది. నేను తీసిన ‘అలా మొదలైంది’ కంటే ఈ సినిమాకు ఎక్కువ ప్రశంసలు దక్కాయి. నాకు చాలా సంతృప్తి లభించింది. మా యూనిట్ మొత్తం నమ్మి చేసిన సినిమా ఇది. కళ్యాణ్ మాలిక్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. లక్ష్మీభూపాల్ అందించిన డైలాగ్స్ అందరికీ నచ్చుతున్నాయి. ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అన్నారు. నాగశౌర్య మాట్లాడుతూ, ఈమధ్యకాలంలో నాకు ఏ సినిమా కూడా మంచి హిట్ దక్కలేదని, కానీ ఈ సినిమాతో కొత్త ఉత్సాహాన్ని అందించారని, కథను నమ్మి ఈ పాత్రకు నేను న్యాయం చేశానని, తనకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలన్నారు. నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ, నందిని కథను బాగా డీల్ చేశారని, అలాగే ప్రతి ఒక్క ఆర్టిస్టు, టెక్నీషియన్ ఎంతో సపోర్టు అందించారన్నారు.