నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపములొందువేళ రణపన్నగభూతభయజ్వరాదులం
దాపదనొందువేళ, భరతాగ్రజ,మిమ్ము భజించువారికిం
బ్రాపుగ నీవు దమ్ముడిరు ప్రక్కియలం జని తద్విపత్తి సం
తాపముమాని; కాతురట దాశరథీ కరుణాపయోనిధీ.

తా: ఓ దశరథరామా! భరతుని అన్నయైన శ్రీరామా, పాపములు పొందునపుడు, యుద్ధము, సర్పములు, భూతములు, జ్వరములు (తాపము-రోగము) మొదలైన వానిచేత ఆపద కలిగినప్పుడు నిన్ను సేవించేవారిని, కొలిచేవారిని సహాయము చేయబోయి, నీవు, నీ తమ్ముడైన లక్ష్మణుడును రెండు పక్కల నిలిచి వారి ఆపదలను పోగొట్టి రక్షింతువని లోకులు చెప్పుదురు. కాబట్టి నిన్ను సేవించు నన్ను కాపాడవా?

దాశరథీ శతకములోని పద్యము

దాశరథీ శతకములోని పద్యము