మంచి పాత్రలకే ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* హీరోయిన్ వామికా గబ్బి
‘భలే మంచిరోజు’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమై మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది వామికా గబ్బి. ఆ సినిమా తరువాత ఆమె నటిస్తున్న చిత్రం ‘నన్ను వదిలి నీవు పోలేవులే’. బాలకృష్ణ కోల హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి గీతాంజలి శ్రీరాఘవ దర్శకత్వం వహిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 18న విడుదలవుతున్న సందర్భంగా వామికా చెప్పిన విశేషాలు...
డిఫరెంట్ షేడ్స్ వున్న పాత్ర
ఈ సినిమాలో నా పాత్ర పేరు మనోజ. మోడరన్‌గా వుండే అమ్మాయి. కానీ ట్రెడిషనల్‌గా ఆలోచిస్తుంది. ముఖ్యంగా నటనకు మంచి స్కోప్ వున్న పాత్ర ఇది. పెళ్లి బంధానికి సంబంధించిన కథతో తెరకెక్కిన ఈ సినిమాలో ఎమోషన్స్ బాగుంటాయి. ముఖ్యంగా నా నటనకు మంచి అప్లాజ్ రావడం ఆనందంగా వుంది. ఇప్పటికే తమిళంలో ఘనవిజయం సాధించిన సినిమా ఇది. తెలుగులో కూడా అలాంటి రిజల్టే వస్తుందని ఆశిస్తున్నా.
ప్రాముఖ్యత వున్న పాత్రల్లో
ఈ కథ అద్భుతంగా వుంటుంది. పాటలు, రొమాన్స్, అనవసరమైన సన్నివేశాలు వుండవు. దాంతోపాటు లేడీ డైరెక్టర్ కావడంతో నాకు ఇంకా సులువైంది. ఆమెతో పనిచేయడంవల్ల చాలా నేర్చుకున్నాను. గీతాంజలి చాలా టాలెంట్ వున్న దర్శకురాలు. నేను సౌత్‌లో చేసిన రెండు సినిమాలకు మంచి గుర్తింపు రావడం ఆనందంగా వుంది. ఈ సినిమా నిర్మాతలు కూడా చాలా చక్కగా చూసుకున్నారు. ఇకపై నేను చేసే సినిమాల్లో నా పాత్రకు ప్రాముఖ్యత వుంటేనే నటించాలని వుంది. ఇప్పటికే పలువురు దర్శక నిర్మాతలు అడుగుతున్నారు.