కడప

శివనామ స్మరణతో మారుమోగిన ఆలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మార్చి 7: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాలోని అటవీప్రాంతంలో వెలసిన శైవక్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుమోగాయి. శివరాత్రిని పురస్కరించుకుని శివపార్వతుల కల్యాణం వైభవోపేతంగా నిర్వహించారు. సోమవారం రాత్రి శైవక్షేత్రాల్లో శివపార్వతుల ఉత్సవ విగ్రహాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. అనంతరం శైవక్షేత్రాలకు వెళ్లిన కొంతమంది భక్తులు తిరుగుముఖం పట్టారు. జిల్లా నలుమూలల నుంచే గాకుండా కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున భక్తులు జిల్లాలో శేషాచలం అటవీ ప్రాంతంలో వెలసిన పొలతల పుణ్యక్షేత్రం, సిద్దవటం నలమల అడవుల్లో వెలసిన శ్రీనిత్యపూజయ్యస్వామి కోన, బద్వేలు నల్లమల అడవిలోని లంకమల శైవక్షేత్రం, మైదుకూరు దగ్గరలోని భైరవకోన శైవక్షేత్రం, రాజంపేట సమీపంలోని అత్తిరాల, పులివెందుల సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో వెలసిన నామాలగుండు, భానుగుట్ట శైవక్షేత్రాలు తోపాటు పుష్పగిరి, కన్యతీర్థం, అగస్త్యేశ్వరాలయం, సంగమేశ్వరాలయం శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి. మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలకు జిల్లాలోని వివిధ డిపోల నుంచి 400 పైబడి ఆర్టీసి బస్సులను అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి లారీలు, ట్రాక్టర్లు, మినీ లారీలతోపాటు పెద్ద ఎత్తున ఆటోలలో భక్తులు శైవక్షేత్రాలకు వెళ్లారు. శైవక్షేత్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆయా ప్రాంతాల్లోని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.