రాష్ట్రీయం

వనవాసీ కల్యాణాశ్రమం ఆవిర్భావ దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 24: ఆదివాసీలను కాపాడేందుకు 1952 డిసెంబర్ 26న ఛత్తీస్‌ఘడ్‌లోని జష్‌పూర్‌నగర్‌లో అఖిల భారత వనవాసీ కళ్యాణాశ్రమం ప్రారంభమైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది డిసెంబర్ 26న కళ్యాణాశ్రమ ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నారు. అఖిల భారత స్థాయిలో 370 వనవాసీ జిల్లాలకు గాను 328 జిల్లాల్లో 50,717 వనవాసీ గ్రామాలలో కార్యకలాపాలు నిర్వహించడం జరుగుతోంది. దేశం మొత్తంలో 250 విద్యార్థి నిలయాలు, 4,100 విద్యాకేంద్రాల నిర్వహణ జరుగుతోంది. వనవాసీ కళ్యాణాశ్రమం ద్వారా అంబర్ ఛర్ఖా పరిశ్రమ స్థాపించి దారంతీయడం, బట్టలు నేయడం ప్రారంభమైంది. తేనెటీగల పెంపకం వంటి కుటీర పరిశ్రమలు కూడా స్థాపించబడ్డాయి. కళ్యాణాశ్రమం ద్వారా గిరిజనుల సర్వతోముఖాభివృద్ధి, వారి సమస్యలకు న్యాయసహాయం అందించడం, సంస్కృతీ వైభవాన్ని కాపాడ్డం, క్రీడలతో గిరిజనులకు మానసిక ఉల్లాసాన్ని కలిగించడం వంటివి నిర్వహిస్తున్నట్లు ఆయా వర్గాలు వెల్లడించాయి. ఆదిలాబాద్ జిల్లాలో కేశ్లాపూర్ వద్ద నాగోబా జాతర, వరంగల్ జిల్లాలో మేడారంలో సమ్మక్క, సారమ్మ జాతర, మహబూబ్‌నగర్ జిల్లాలో మన్నసూర్ వద్ద శ్రీసలేశ్వరం జాతర, విశాఖ జిల్లా పాడేరు వద్ద మఠం గ్రామంలో దుర్గాష్టమి ఉత్సవాలు వంటివి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ 26న వనవాసీ కళ్యాణాశ్రమం ఆవిర్భావం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు వెల్లడించాయి.