వారం వారం గోచారం

వారం వారం గోచారం (16-9-2018 నుంచి 22-9-2018 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఆదివారం అనుకోని ఇబ్బందులున్నా సమయస్ఫూర్తితో బయటపడతారు. సంతానవర్గ సహకారం సంతృప్తినిస్తుంది. ఆలోచనల్లో ఒత్తిడి. కొన్ని సంఘటనలు మనస్తాప కారణవౌతాయి. సోమవారం అన్ని పనులకు అనుకూలం. వృత్తి ఉద్యోగాదుల్లో కొంత ఒత్తిడి వల్ల సంతృప్తి లోపం. కీర్తి ప్రతిష్ఠలు. మంగళవారం భాగస్వామ్యాలపై దృష్టి. భాగస్వామ్యాల్లో అనుకూలత. అధికారిక వ్యవహారాల్లో ఒత్తిడులుంటాయి. బుధవారం వ్యతిరేకతలపై విజయం. పోటీలు ఒత్తిడులున్నా లక్ష్యాలను సాధిస్తారు. విహార యాత్రలకు అవకాశం. గురువారం వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. గుర్తింపు లభిస్తుంది. ఋణ రోగాదులను అధిగమిస్తారు. శ్రమాధిక్యం. శుక్రవారం సౌకర్యాలను సమకూర్చుకుంటారు. అధికారిక ప్రయాణాలు. పితృవర్గ వ్యవహారాలపై దృష్టి. విజయసాధన.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఆదివారం సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. ఆహార విహారాలపై దృష్టి. నిర్ణయాదులు సంతోషాన్నిస్తాయి. కొంత వత్తిడి తప్పకపోవచ్చు. లాభాలపై దృష్టి. ఆర్థిక నిల్వల వల్ల సంతోషం. సోమవారం వ్యతిరేక ప్రభావాలు ఇబ్బంది పెట్టే అవకాశం. మనోభీష్టాలు ఫలిస్తాయి. ఆలోచనలకు రూపకల్పన. మంగళవారం సోదరీమణులతో సంప్రదింపులుంటాయి. సంతానవర్గ సంతోషం. ప్రయాణాలకు అవకాశం. సంతృప్తి అధికం. బుధవారం కుటుంబ ఆర్థికాంశాల్లో జాగ్రత్తగా మెలగాలి. మాటల్లో తొందరపాటు కూడదు. ఆర్థిక నష్టాలు. గురువారం అన్ని పనుల్లో ఎదురీదాల్సి వస్తుంది. శ్రమానంతర గుర్తింపు లభిస్తుంది. వ్యవహారాల్లో జాగ్రత్త. శుక్రవారం ఖర్చులు పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి. పోటీలు, ఒత్తిడులు, చికాకులకు అవకాశం.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఆదివారం ఖర్చులు పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి. విందులు వినోదాలకు అనుకూలం. ఉన్నత విద్యల కోసం దూర ప్రయాణ దృష్టి. వ్యాపారాదుల్లో సంతృప్తి లభిస్తుంది. సోమవారం కుటుంబ ఆర్థికాంశాల్లో జాగ్రత్త అవసరం. మాట తీరులో నైరాశ్యం. నిర్ణయాదులు ఒత్తిడులకు గురి చేయవచ్చు. మంగళవారం లాభాలు సంతృప్తినిస్తాయి. పెద్దల ఆశీస్సులు. అన్ని పనుల్లోనూ సంతోషం. బుధవారం వృత్తి ఉద్యోగాదుల్లో ఉన్నతి. పదోన్నతులకు అవకాశం. శ్రమతో గుర్తింపు. సామాజిక గౌరవం. నిర్ణయాల్లో ఒత్తిడి. గురువారం కుటుంబ ఆర్థికాంశాల్లో జాగ్రత్త అవసరం. అధికారిక వ్యవహారాల్లో కొంత అప్రమత్తంగా మెలగాలి. శుక్రవారం మాట తీరులో అనుకూలత. ఆర్థిక నిల్వలు శ్రమకు గురి చేస్తాయి. కార్యక్రమాల్లో ఆచితూచి వ్యవహరించాలి.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఆదివారం భాగస్వామ్యాలు ప్రభావితం చేస్తాయి. సౌకర్యాలపై దృష్టి. ఆహార విహారాలుంటాయి. గృహ వాహనాదుల వల్ల సంతోషం. అనుబంధాలు పెరుగుతాయి. సోమవారం అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్య భావనలు. కార్యక్రమాల వాయిదా మంచిది. శ్రమ. మంగళవారం వ్యతిరేకతలుంటాయి. పోటీలు ఒత్తిడి ఇబ్బంది పెట్టవచ్చు. శత్రువుల వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. బుధవారం ఆలోచనల్లో ఒత్తిడులు. సంతానవర్గ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. తొందరపాటు కూడదు. ఇబ్బందులుంటాయి. గురువారం భాగస్వామ్యాల్లో జాగ్రత్త అవసరం. నిర్ణయాదులు ఇబ్బందులకు గురి చేస్తాయి. సౌకర్యలోపాలు. శుక్రవారం సంప్రదింపులకు అనుకూలత. దూర ప్రయాణాలుంటాయి. కీర్తి ప్రతిష్ఠలుంటాయి. సహకారం లభిస్తుంది. శనివారం అసంతృప్తి.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఆదివారం సంప్రదింపులకు అనుకూలం. సోదరవర్గ వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. ఖర్చులు పెట్టుబడులుంటాయి. పరామర్శలకు అవకాశం. విశ్రాంతి కోసం ప్రయత్నం. సోమవారం ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. నైరాశ్య ధోరణులకు అవకాశం. సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. మంగళవారం కుటుంబంలో అనుకూలత. అందరూ ఆనందంగా గడుపుతారు. విందులు వినోదాలు ఉంటాయి. బుధవారం నిర్ణయాదులు ఒత్తిడులకు గురిచేస్తాయి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. ఆహార విహారాల్లో జాగ్రత్త. గురువారం మనోభీష్టాలు నెరవేరుతాయి. శారీరక ఒత్తిడులకు అవకాశం. సంతానవర్గ అనుకూలత. సృజనాత్మకత. శుక్రవారం లాభాలు సంతృప్తినిస్తాయి. నూతన కార్యక్రమాల ప్రణాళికలుంటాయి. ఆలోచనలకు రూపకల్పన.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఆదివారం అన్ని పనుల్లోనూ ప్రయోజన దృష్టి. లాభాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాల్లో లోపాలకు అవకాశం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. జాగ్రత్తగా మెలగాలి. సోమవారం నిర్ణయ లోపాలుంటాయి. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. ఆత్మవిశ్వాస లోపాలకు అవకాశం. లాభాలు కోల్పోవచ్చు. మంగళవారం ఖర్చులు పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి. వృత్తి ఉద్యోగాదుల్లో ఇబ్బందులకు అవకాశం. బుధవారం ఉన్నత వ్యవహారాలపై దృష్టి. కీర్తిప్రతిష్ఠలు ఏర్పడుతున్నా అప్రమత్తంగానే మెలగాలి. సంతృప్తి లోపం. గురువారం నిర్ణయాదుల్లో జాగ్రత్త వహించాలి. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. అధికారిక ప్రయోజనాలుంటాయి. శుక్రవారం భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరించే అవకాశం.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఆదివారం వ్యతిరేకతలు ఇబ్బంది పెట్టవచ్చు. పోటీలు ఒత్తిడులను అధిగమించాలి. సంప్రదింపులకు అనుకూలం. అధికారుల సహకారం లభిస్తుంది. సంతోషం. సోమవారం భాగస్వామ్యాలకు అనుకూలం. అనుకోని ఇబ్బందులు. పరిచయాలు. అనుబంధాల్లో కొంత జాగ్రత్త అవసరం. మంగళవారీ అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. సంతానవర్గ వ్యవహారాల్లో అనుకూలత. బుధవారం సౌకర్యాలు ఇబ్బంది పెట్టే అవకాశం. ప్రయాణాదుల్లో జాగ్రత్త. సౌఖ్య లోపం. శ్రమాధిక్యం. గురువారం అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. నిర్ణయాదులు వాయిదా వేసుకోవాలి. కార్యక్రమాల్లో ఒత్తిడులు. శుక్రవారం ఊహించని నష్టాలుంటాయి. కుటుంబంలో ఇబ్బందులకు అవకాశం. మాటల్లో జాగ్రత్త అవసరం. శనివారం లక్ష్యాలను సాధించే ప్రయత్నం.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఆదివారం కుటుంబ ఆర్థికాంశాల్లో శుభ పరిణామాలు. మాట తీరు మెరుగుపడుతుంది. అన్ని పనుల్లో లాభాలకు అవకాశం. ప్రయోజనాలు సంతృప్తినిస్తాయి. వ్యవహార విజయం. సోమవారం సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. ఆహార విహారాల్లో ఇబ్బందులు. సంప్రదింపుల్లో జాగ్రత్త. మంగళవారం సంతోషంగా గడుపుతారు. అన్ని పనులు సులువుగా నెరవేరుతాయి. ఇతరుల సహకారం లభిస్తుంది. బుధవారం ఖర్చులు పెట్టుబడుల్లో జాగ్రత్త. ప్రభుత్వపు పన్నులు చెల్లించాల్సి వస్తుంది. పరామర్శలకు అవకాశం. గురువారం సౌకర్యాదులపై దృష్టి. ఆహార విహారాల్లో అనుకూలత. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. వ్యర్థ ప్రయాణాలు. శుక్రవారం వృత్తి ఉద్యోగాదుల్లో జాగ్రత్త వహించాలి. గౌరవం పెంచుకునే ప్రయత్నం.

కుంభం (ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఆదివారం భాగస్వామ్యాల్లో ఒత్తిడులుంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. అధికారిక వ్యవహారాల్లో సంతోషం. గుర్తింపు, గౌరవాదులు లభిస్తాయి. సోమవారం వ్యర్థమైన ప్రయాణాలకు అవకాశం. ఆశించిన ప్రయోజనాలు అందకపోవచ్చు. లాభాలు కోల్పోయే అవకాశం. మంగళవారం కొత్త పనుల నిర్వహణపై దృష్టి. విద్య, ఉద్యోగాదుల్లో గౌరవ ప్రతిష్ఠలుంటాయి. అన్ని పనుల్లో లాభాలు. బుధవారం అనుకోని ఇబ్బందులు. భాగస్వామ్య లోపాలు. అనారోగ్య భావనలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త. గురువారం ఖర్చులు పెట్టుబడులు వ్యర్థం కావచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్త. అనుకోని సమస్యలు. ఊహించని సంఘటనలు. శుక్రవారం వ్యతిరేకతలు ప్రభావితం చేస్తాయి. పరామర్శలకు అవకాశం. విశ్రాంతి ఆశించినంతగా లభించదు.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఆదివారం సంప్రదింపులుంటాయి. అధికారుల, వ్యాపారుల, మేధావుల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలు. సోదర వర్గంపై ప్రత్యేక దృష్టి. ఆలోచనలకు రూపకల్పన. సోమవారం వ్యతిరేక ప్రభావాలున్నా గుర్తింపు లభిస్తుంది. భాగస్వామ్యాల ఒత్తిడులుంటాయి. జాగ్రత్త అవసరం. మంగళవారం ప్రయాణాది సౌకర్యాలు సంతృప్తినిస్తాయి. ఆహార విహారాలకు అనుకూలం. పోటీల్లో విజయం. బుధవారం అధికారిక వ్యవహారాలుంటాయి. ప్రయాణాలకు అవకాశం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. విజయం. గురువారం అధికారిక ప్రయాణాలుంటాయి. సోదరవర్గంతో సంప్రదింపులకు అవకాశం. భాగస్వామ్యాల్లో అనుకూలత. శుక్రవారం పరిచయాలు విస్తరిస్తాయి. అనుబంధాలు మెరుగుపడతాయి. వ్యవహార విజయం. శనివారం భాగస్వామ్యాల్లో ఒత్తిడులు.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఆదివారం నిర్ణయాదులు సంతృప్తినిస్తాయి. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. సామాజిక గౌరవం. వ్యాపార వ్యవహారాల్లో అనుకూలత. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. సోమవారం కుటుంబంలో అనుకూలత. ఆర్థిక నిర్ణయాదుల్లో సంతోషం. మాట తీరులో కొంత నైరాశ్యం. సంప్రదింపుల్లో జాగ్రత్త. మంగళవారం ఖర్చులు పెట్టుబడులు అధికం. విందులు వినోదాలు విహారాలు సంతృప్తినిస్తాయి. ప్రయాణావకాశాలు. బుధవారం అధికారిక లాభాలుంటాయి. పెద్దల ఆశీస్సుల కోసం ప్రయత్నం. ప్రయోజన దృష్టి అధికవౌతుంది. గురువారం వృత్తి ఉద్యోగాదులు సంతోషాన్నిస్తాయి. సంప్రదింపులకు అనుకూలం. దగ్గరి ప్రయాణాలు. శుక్రవారం లక్ష్యాలను సాధించే ప్రయత్నం. ఉన్నత విద్యలపై దృష్టి. సోదరవర్గ సహకారం లభిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదివారం వ్యతిరేక ప్రభావాలున్నా గుర్తింపు లభిస్తుంది. ఉన్నత విద్య ఉద్యోగాదులపై దృష్టి. కీర్తి ప్రతిష్ఠలు శ్రమతో లభిస్తాయి. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో అనుకూలత. సంతృప్తి. సోమవారం లాభాలు ఇబ్బంది పెట్టే సూచనలు. వృత్తి ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. వ్యవహారాల్లో ఇబ్బందులుంటాయి. మంగళవారం అనుకోని సమస్యలకు అవకాశం. ఊహించని సంఘటనలు. లాభాలు కోల్పోయే అవకాశం. బుధవారం భాగస్వామ్యాలు, పరిచయాల్లో ఇబ్బందులకు అవకాశం. లాభాలు శ్రమకు గురి చేస్తాయి. శ్రమాధిక్యం. గురువారం జీవిత భాగస్వామితో జాగ్రత్తగా మెలగాలి. లాభాలున్నా ఆశిచిన సంతోషం లభించకపోవచ్చు. శుక్రవారం మనోభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. సంతానవర్గ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744