వారం వారం గోచారం

వారం వారం గోచారం (20-5-2018 నుంచి 26-5-2018 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఆది సోమ వారాల్లో సౌకర్యాలు పెంచుకోవడంపై దృష్టి పెడతారు. సౌఖ్యం కోసం ప్రయత్నం. ఆహార విహరాల కోసం కాలం ధనం వెచ్చిస్తారు. శ్రమతో కార్యనిర్వహణ. వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. అధికారులతో జాగ్రత్తగా మెలగాలి. సామాజిక గౌరవం పెంచుకునే ప్రయత్నం. మంగళ బుధవారాల్లో మనోభీష్టాలు నెరవేరుతాయి. నూతన కార్యక్రమ ప్రణాళికలు. సంతాన వర్గ వ్యవహారాలపై దృష్టి. స్పెక్యులేషన్ వ్యవహారాలుంటాయి. ప్లానింగ్ అనుకూలిస్తుంది. లాభాలు ఆశించినంతగా ఉండవు. ప్రయోజనాలు పొందాలంటే శ్రమ పడాలి. గురు శుక్ర శనివారాల్లో వ్యతిరేకతలపై విజయం. పోటీ రంగంలో అనుకూలత. వ్యాపారాల్లో వ్యతిరేకతలున్నా శ్రమతో ఫలితాలుంటాయి. ఖర్చులు పెట్టుబడులపై దృష్టి. ధనాన్ని దానంగా మలచుకుంటే మేలు.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఆది సోమవారాల్లో సంప్రదింపులున్నా జాగ్రత్త అవసరం. దగ్గరి ప్రయాణాదుల్లో కొంత శ్రమ. ఇతరుల సహకారాన్ని ఆశిస్తారు. ఆశించినంత లభించక ఇబ్బంది పడతారు. దూర ప్రయాణాలకు, ఆధ్యాత్మిక వ్యవహారాలకు అనుకూలం. సంతృప్తిగా గడిపేందుకు ప్రయత్నం. మంగళ బుధవారాల్లో సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. ఆహార విహారాల్లో జాగ్రత్త వహించాలి. శారీరక మానసిక ఒత్తిడులు తప్పకపోవచ్చు. మాతృవర్గ సమస్యలుంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. అధికారిక వ్యవహారాలుంటాయి. గురు శుక్ర శనివారాల్లో మనోభీష్టాలు నెరవేరుతాయి. సంతానవర్గ వ్యవహారాల్లో శుభ పరిణామాలు. సంతృప్తిగా గడుపుతారు. ప్లానింగ్ ఫలిస్తుంది. లాభాలు ఆశించినంతగా ఉండవు. ప్రయోజనాలు ఇబ్బందికి గురి చేయవచ్చు.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఆది సోమవారాల్లో కుటుంబంలో సమస్యలకు అవకాశం. ఆర్థిక నిర్ణయాదుల్లో జాగ్రత్త. మాటల్లో తొందరపాటు కూడదు. నిల్వధనం కోల్పోయే అవకాశం. అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. శ్రమరహిత ధనంపై దృష్టి. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. మంగళ బుధ వారాల్లో సంప్రదింపుల్లో జాగ్రత్త అవసరం. అధికారిక వ్యవహారాల్లో ఒత్తిడులు, ఖర్చులకు అవకాశం. సహకారం ఆశించినంతగా లభించకపోవచ్చు. ఆధ్యాత్మిక, ధార్మిక వ్యవహారాలకు అవకాశం. దూర ప్రయాణాలపై ఆసక్తి, సంతృప్తి. గురు శుక్ర శనివారాల్లో సౌకర్యాలు పెంచుకుంటారు. ఆహార విహారాల్లో కొంత శ్రమ ఉన్నా సౌఖ్యం లభిస్తుంది. గృహ వాహనాది వ్యవహారాల్లో నూతన నిర్ణయాదులుంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో కొంత ఒత్తిడి, గౌరవం తగ్గవచ్చు.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఆది సోమ వారాల్లో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. శారీరక ఒత్తిడులున్నా నూతన కార్యక్రమాల నిర్వహణపై దృష్టి. కార్యక్రమాలు సంతృప్తినిస్తాయి. భాగస్వామ్యాల్లో కొంత జాగ్రత్త. పరిచయాలు స్నేహానుబంధాల్లో ఇబ్బందులకు అవకాశం. శ్రమ ఉన్నా కార్యక్రమాలను నిర్వహించే ప్రయత్నం. మంగళ బుధ వారాల్లో కుటుంబంలో అనుకూలత. నిల్వధనం పెంచుకునే ప్రయత్నం. మాటల్లో కొంత అధికారిక ధోరణి. అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలుంటాయి. కొత్త నిర్ణయాదులను వాయిదా వేసుకోవడం మంచిది. గురు శుక్ర శనివారాల్లో వ్యాపారాదుల్లో సంప్రదింపులకు అనుకూలం. వాణిజ్యవేత్తల సహకారం లభిస్తుంది. శ్రమతో కార్యక్రమాలుంటాయి. లక్ష్యాలను సాధిస్తారు. ఆధ్యాత్మిక వ్యవహారాలుంటాయి. ప్రయాణాదులకు అవకాశం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఆది సోమ వారాల్లో ఖర్చులు పెట్టుబడుల్లో అనుకూలత. ఆహార విహారాల కోసం అధికమైన ఖర్చులు. విందులు వినోదాలుంటాయి. సౌఖ్యంగా గడుపుతారు. ప్రయాణావకాశాలు. వ్యతిరేక ప్రభావాలున్నా శ్రమతో అధిగమిస్తారు. పోటీలు ఒత్తిడులున్నా కొంత జాగ్రత్తగా మెలగాలి. శత్రు రోగాదులు ఇబ్బందిని కలిగిస్తాయి. మంగళ బుధ వారాల్లో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. అన్ని పనుల నిర్వహణకు అనుకూలం. వృత్తి ఉద్యోగాది వ్యవహారాలు, అధికారిక కార్యాలకు అనుకూలత. భాగస్వామ్యాల్లో, స్నేహానుబంధాల్లో ఆచితూచి వ్యవహరించాలి. గురు శుక్ర శనివారాల్లో ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో అనుకూలత. చమత్కారంగా భాషిస్తారు. మాట విలువ పెరుగుతుంది. అనుకోని సమస్యలుంటాయి. శ్రమరహిత ఆదాయంపై దృష్టి. అప్రమత్తంగా మెలగాలి.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఆది సోమ వారాల్లో లాభాలపై దృష్టి. ఆశించిన ప్రయోజనాలు అందవు. పెద్దలతో కొంత జాగ్రత్త. అయినా కొంత మేలు జరుగుతుంది. ఆలోచనలకు రూపకల్పన. మనోభీష్టాలు నెరవేరుతాయి. సంతానవర్గ వ్యవహారాల్లో అనుకూలత. ప్లానింగ్ సంతృప్తినిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో సతమతం అవుతారు. మంగళ బుధవారాల్లో కర్చులు పెట్టుబడులు అధికం. తొందరపడి వ్యర్థంగా కోల్పోవద్దు. ఆసుపత్రులు, పరామర్శలకు అవకాశం. వ్యతిరేకతలు అధికవౌతాయి. పోటీలు ఒత్తిడులు లేకుండా చూసుకోవాలి. శ్రమాధిక్యం. గురు శుక్ర శనివారాల్లో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కార్యక్రమాల నిర్వహణ, రూపకల్పనలో బిజీగా గడుపుతారు. కొత్త పనులపై దృష్టి. వ్యవహారాల్లో సంతృప్తి, అనుకూలత. భాగస్వామ్యాల్లో కొంత జాగ్రత్త. పరిచయాల్లో ఒత్తిడులు.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఆది సోమ వారాల్లో వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులుంటాయి. అధికారులతో జాగ్రత్తగా మెలగాలి. పదోన్నతులలో ఒత్తిడులు. శ్రమాధిక్యం. సామాజిక గౌరవం కోసం ప్రయత్నం. ఆహార విహారాలపై దృష్టి. సౌఖ్యం కోసం ప్రయత్నం. గృహ వాహనాదుల వైపు దృష్టి ఉంటుంది. మంగళ బుధ వారాల్లో లాభాలపై దృష్టి. అధిక శ్రమ వల్ల ప్రయోజనాలు. అనుకోని ఇబ్బందులకు అవకాశం. అధికారిక వ్యవహారాల్లో జాగ్రత్త. ఆలోచనలకు రూపకల్పన. సంతానవర్గ సహకారం. కొత్త పనులకు ప్లానింగ్. నిర్ణయాదుల్లో సంతృప్తి. గురు శుక్ర శనివారాల్లో ఖర్చులు పెట్టుబడులుంటాయి. వేరువేరు వ్యాపారాదులపై దృష్టి. భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు. విందులు వినోదాలకు అవకాశం. వ్యతిరేకతలుంటాయి. శారీరక ఒత్తిడులు. పోటీ రంగంలో కొంత జాగ్రత్త అవసరం.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఆది సోమ వారాల్లో లక్ష్యాలను సాధించే ప్రయత్నం. ఉన్నత వ్యవహారాలు. అన్ని పనులకు అనుకూలత. సంతృప్తి. అభీష్ట సిద్ధి. కీర్తి ప్రతిష్టలు, గౌరవాదులుంటాయి. దూర ప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలుంటాయి. సంప్రదింపుల్లో జాగ్రత్త. మాటల్లో తొట్రుపాటుకు అవకాశం. సహకార లోపాలు. మంగళ బుధవారాల్లో వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు. అధికారిక వ్యవహారాల్లో అనుకూలత ఉన్నా శ్రమ బాగా ఉంటుంది. సామాజిక గౌరవం కోసం ప్రయత్నం. ఆహార విహారాల్లో జాగ్రత్త. సౌఖ్య లోపాలుంటాయి. సౌకర్యాల వల్ల సమస్యలు. గురు శుక్ర శని వారాల్లో వ్యాపార వ్యవహారాల్లో లాభాల కోసం ప్రయత్నం. ప్రయోజనాలు శ్రమకు గురి చేయవచ్చు. మనోభీష్టాలు నెరవేరుతాయి. సంతానం కోసం ఖర్చులుంటాయి. ధార్మిక వ్యవహారాలపై దృష్టి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఆది సోమ వారాల్లో అనుకోని సమస్యలుంటాయి. నూతన నిర్ణయాదులను వాయిదా వేసుకోవాలి. అనుకోని ప్రయోజనాలున్నా అప్రమత్తంగా ఉండాలి. శ్రమ రహిత లాభాలకు దూరంగా మెలగాలి. కుటుంబంలో ఒత్తిడులు. శారీరక శ్రమ తప్పకపోవచ్చు. మాటల్లోనూ సమస్యలుంటాయి. మంగళ బుధ వారాల్లో దూర ప్రయాణాలకు అవకాశం. ఆధ్యాత్మిక వ్యవహారాలలో పురోగతి. వ్యతిరేక ప్రభావాలను అధిగమించాలి. గుర్తింపు కీర్తి ప్రతిష్టలపై దృష్టి. సంప్రదింపుల్లోనూ జాగ్రత్త అవసరం. సహకారం ఆశించినంతగా ఉండదు. గురు శుక్ర శనివారాల్లో వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమ. అధికారిక వ్యవహారాల్లో జాగ్రత్త. వ్యాపారాదుల్లో శ్రమతో లాభాలుంటాయి. సౌకర్యాలు సంతృప్తినిస్తాయి. ఆహార విహారాల్లో శుభ పరిణామాలు. సంతోషం, సంతృప్తి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఆది సోమ వారాల్లో భాగస్వామ్యాలపై దృష్టి. నూతన పరిచయాలు. స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. పాతమిత్రుల పలకరింపు. ఆత్మవిశ్వాసంతో వ్యవహారాలుంటాయి. కార్యనిర్వహణకు అనుకూలం. ఖర్చులు పెట్టుబడులకు అవకాశం. విందులు వినోదాల్లో కొంత జాగ్రత్త. మంగళ బుధవారాల్లో అనుకోని సమస్యలు. అనారోగ్య లోపాలు. ఆలోచనలు ఇబ్బందులకు గురిచేయవచ్చు. కొత్త పనులను వాయిదా వేసుకోవాలి. ఆర్థిక సమస్యలు అధికం. మాట విలువ తగ్గే సూచనలు. కుటుంబంలో ఇబ్బందులు. గురు శుక్ర శనివారాల్లో అన్ని పనుల్లో అనుకూలత. లక్ష్యాలను సాధిస్తారు. ఉన్నత వ్యవహారాలపై దృష్టి. కీర్తి ప్రతిష్ఠలు, గుర్తింపు, గౌరవాదులుంటాయి. సహకార లోపాలకు అవకాశం. వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమతో గుర్తింపు.

కుంభం (ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఆది సోమ వారాల్లో వ్యతిరేకతలుంటాయి. పోటీలు ఒత్తిడులను శ్రమతో అధిగమించాలి. అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా మెలగాలి. గుర్తింపు లభిస్తుంది. వ్యవహారాల్లో విజయం. ఖర్చులు పెట్టుబడులు విందులు వినోదాలపై దృష్టి. ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో జాగ్రత్త. దానం మంచిది. మంగళ బుధ వారాల్లో పరిచయాలు శ్రమకు గురి చేస్తాయి. అనుబంధాల్లో ఒత్తిడులుంటాయి. భాగస్వామ్యాల్లో అప్రమత్తంగా మెలగాలి. ఆత్మవిశ్వాసంతో కార్యక్రమాల నిర్వసణ. సొంత పనులపై దృష్టి. శ్రమతో కార్యక్రమాలు. గురు శుక్ర శనివారాల్లో వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్త. అనుకోని ఇబ్బందులుంటాయి. సంప్రదింపులకు అనుకూలం. సహకారం లభిస్తుంది. కుటుంబ ఆర్థికాంశాల్లో ఆశించిన సంతృప్తి ఉండకపోవచ్చు. కీర్తి ప్రతిష్టలు, గౌరవాదులుంటాయి.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఆది సోమ వారాల్లో మానసిక ఉల్లాసం. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. సంతాన వర్గ వ్యవహారాలు చర్చిస్తారు. క్రియేటివిటీ ఉంటుంది. కొత్త పనుల్లో అనుకూలత. లాభాలు కొంత ఒత్తిడులకు గురి చేయవచ్చు. ప్రయోజనాలు శ్రమకు గురి చేస్తాయి. సామాజిక గౌరవం తగ్గే సూచనలు. మంగళ బుధవారాల్లో వ్యతిరేక ప్రభావాలు తప్పకపోవచ్చు. సామాజిక గౌరవం తగ్గే సూచనలు. మంగళ బుధవారాల్లో వ్యతిరేక ప్రభావాలు తప్పకపోవచ్చు. పోటీలు ఒత్తిడులు చికాకులుంటాయి. అధికారిక సంప్రదింపులకు అవకాశం. గుర్తింపు కోసం చేసే శ్రమ అధికం. ఖర్చులు పెట్టుబడుల్లో కొంత జాగ్రత్త. వ్యర్థంగా కాలం, ధనం కోల్పోయే అవకాశం. గురు శుక్ర శనివారాల్లో భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు, అనుబంధాలు విస్తరిస్తాయి. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. ఆర్థిక నిర్ణయాదులకు అనుకూలం. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ