వారం వారం గోచారం

వారం వారం గోచారం (24-6-2018 నుంచి 30-6-2018 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఆదివారం పరిచయాలు విస్తరిస్తాయి. భాగస్వామ్యానుబంధాలు బలపడతాయి. పెద్దలతో సంప్రదింపులుంటాయి. ఆత్మవిశ్వాసం. ఉత్సాహంగా కాలం గడుపుతారు. సోమ మంగళవారాల్లో అన్ని పనుల్లో అప్రమత్తంగా మెలగాలి. ఊహించని ఇబ్బందులు. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. ఆర్థిక నిల్వలు కోల్పోయే అవకాశం. బుధ గురు శుక్రవారాల్లో కీర్తిప్రతిష్ఠలు, ఆనందం. ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. భాగస్వామ్యాల్లో సంతృప్తి. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. అన్ని పనుల్లో అనుకూలత. సంతృప్తి. సంప్రదింపులకు అనుకూలం. ప్రయాణాలకు అవకాశం.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఆదివారం వ్యతిరేకతలు తప్పకపోవచ్చు. అన్ని పనుల్లో శ్రమతో కార్యనిర్వహణ. గుర్తింపు. శత్రు రోగ రుణాలపై విజయం. సోమ మంగళవారాల్లో పరిచయాలు పెంచుకునే ప్రయత్నం. భాగస్వామ్యాల్లో కొంత జాగ్రత్త. అనుబంధాల్లో అప్రమత్తంగా మెలగాలి. అనుకోని సమస్యలుంటాయి. బుధ గురు శుక్ర వారాల్లో అన్ని పనుల్లోనూ సమస్యలుంటాయి. ఊహించని ఇబ్బందులు. అనారోగ్య సూచనలు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవడం మంచిది. అన్ని పనుల్లోనూ శ్రమ, విసుగు, చిరాకులను అధిగమించాలి. శ్రమరహిత ప్రయోజనాలను కోరవద్దు. ముందు జాగ్రత్తలు అవసరం. శనివారంనాడు లక్ష్యాలను సాధించే యత్నం.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఆదివారం మనోభీష్టాలు నెరవేరుతాయి. సంతానంతో సంతోషంగా గడుపుతారు. ఆలోచనలకు చక్కని రూపకల్పన. ప్లానింగ్ సంతృప్తినిస్తుంది. ఉత్సాహంగా గడుపుతారు. సోమ మంగళవారాల్లో పోటీలు చికాకులు తప్పకపోవచ్చు. కార్యక్రమాలను శ్రమతో నిర్వహిస్తారు. వ్యవహారాల్లో ఒత్తిడులుంటాయి. వ్యతిరేక ప్రభావాలను అధిగమించాలి. గుర్తింపు ఉన్నా సంతోషం లభించదు. జాగ్రత్త అవసరం. బుధ గురు శుక్రవారాల్లో భాగస్వామ్యాల్లో అనుకూలత. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు. కొత్త పరిచయాల్లో అప్రమత్తంగా మెలగాలి. స్నేహానుబంధాల్లో ఒత్తిడులుంటాయి. వైవాహికానుబంధాల్లోనూ కొంత చికాకు తప్పదు.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఆదివారం గృహ వాహనాది సౌకర్యాలు మెరుగుపరచుకుంటారు. ఆహార విహారాల కోసం ప్రయత్నిస్తారు. విద్యాత్మక కార్యక్రమాలకు అనుకూలం. సౌఖ్యంగా గడిపేందుకు కృషి చేయాలి. సోమ మంగళవారాల్లో అభీష్టాలు నెరవేరుతాయి. మంచి ప్లానింగ్‌తో కార్యక్రమాల నిర్వహణ. సంతానవర్గ సంతోషం. కొత్త కార్యక్రమాలపై దృష్టి. ఉపాసన, ఉన్నత విద్యలపై ఆసక్తి. మనస్సును ఏకాగ్రం చేయడానికి ప్రయత్నించాలి. బుధ గురు శుక్రవారాల్లో అన్ని పనుల్లో వ్యతిరేకతలలు ఎదురౌతాయి. శ్రమతో కార్యక్రమాలను నిర్వహించాలి. ఆధ్యాత్మిక భావాలలో ఘర్షణ అధికం. శత్రు రోగ రుణాలు పెరిగే అవకాశాలు. పోటీలు, ఒత్తిడులను అధిగమించాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఆదివారం సంప్రదింపులకు అనుకూలం. పెద్దలు, గురువులు సహకరిస్తారు. సోదర వర్గంతో అప్రమత్తంగా మెలగాలి. దగ్గరి ప్రయాణాలుంటాయి. ఖర్చులు పెట్టుబడులు అధికం. విహార యాత్రలు. సోమ మంగళ వారాల్లో ఇల్లు, వాహనాలకు సంబంధించిన అంశాలపై దృష్టి. విద్యాత్మక అంశాల్లో శుభ పరిణామాలు. ఆహార విహారాలపై మనసు ఉన్నా అప్రమత్తంగా ఉండాలి. శ్రమాధిక్యం. గృహాది సౌకర్యాలను పెంచే ప్రయత్నం. బుధ గురు శుక్రవారాల్లో అభీష్ట సిద్ధి. నూతన పరిశోధనాంశాలు ప్రభావితం చేస్తాయి. సంతానవర్గం యొక్క అనుకూలత. పెద్దలతో సంప్రదింపులకు అవకాశం. ఉపాసనా మార్గాలపై దృష్టి. మంచి ప్లానింగ్‌తో వ్యవహరిస్తారు.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)
ఆదివారం కుటుంబంలో అనుకూలత. మాట విలువ పెరుగుతుంది. ఆర్థిక నిల్వలు పెంచుకునే ప్రయత్నం. సంతోషంగా గడుపుతారు. మాట తీరులో సంతృప్తి. వ్యవహార శైలి బాగుంటుంది. సోమ మంగళవారాల్లో సంప్రదింపులపై దృష్టి. దగ్గరి ప్రయాణాలుంటాయి. ఇతరుల సహకారం లభిస్తుంది. సోదర వర్గంతో కొంత జాగ్రత్తగా మెలగాలి. సంతాన విషయంలో కొంత ఒత్తిడి తప్పకపోవచ్చు. మానసిక అస్థిరత్వం. బుధ గురు శుక్రవారాల్లో ఇల్లు, వాహనం మొదలైన విషయాల్లో ఒత్తిడులుంటాయి. ఆహార విహారాల్లో సర్దుబాటు అవసరం. తొందరపాటు కూడదు. విద్యాత్మక అంశాల్లో శ్రమ ఉంటుంది.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)
ఆదివారం నిర్ణయాదులు లాభిస్తాయి. అనేక కార్యక్రమాల ఒత్తిడి ఉన్నా ఉత్సాహంగా గడుపుతారు. నిర్వహణ బాధ్యతలతో సతమతవౌతారు. లాభాలు సంతృప్తినిస్తాయి. గౌరవం. సోమ మంగళ వారాల్లో కుటుంబ వ్యవహారాల్లో ఒత్తిడులు. ఆర్థిక నిల్వలు కోల్పేయే అవకాశం. మాటల్లో తొందరపాటు కూడదు. సౌకర్యాలు ప్రభావితం చేస్తాయి. ఆహార విహారాల్లో అప్రమత్తంగా మెలగాలి. సౌఖ్యం కోసం అధిక ప్రయత్నం. బుధ గురు శుక్రవారాల్లో సంప్రదింపుల్లో కొంత జాగ్రత్త. సోదర వర్గ సహకారం లభిస్తుంది. సేవక వర్గంతో జాగ్రత్త అవసరం. కొన్ని వార్తల వల్ల శ్రమ పెరిగే అవకాశం. అనుకూలత కూడా వుంటుంది. ఆధ్యాత్మిక యాత్రావకాశాలు.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆదివారం ఖర్చులు అధికం. విజ్ఞాన, ఆధ్యాత్మిక యాత్రల కోసం వెచ్చిస్తారు. లక్ష్యాలను సాధించే యత్నం. ఉన్నత వ్యవహారాలపై దృష్టి. ధార్మికమైన దానాదుల వల్ల అత్యంత మేలు. సోమ మంగళ వారాల్లో నిర్ణయాదుల్లో అనుకూలత. కార్యనిర్వహణలో తలమునకలు అవుతారు. వ్యవహార శైలిలో ఉన్నతి. సోదరులతో అనుబంధాలు విస్తరిస్తాయి. ఉత్సాహంగా గడుపుతారు. బాధ్యతలు సంతృప్తినిస్తాయి. బుధ గురు శుక్రవారాల్లో కుటుంబంలో కొంత అనుకూలత. మాట తీరులో కొంత జాగ్రత్త. ఆర్థిక వ్యవహారాల్లో శ్రమ. కుటుంబం కోసం కాలం ధనం వెచ్చిస్తారు. ధార్మిక వ్యవహారాల్లో ఖర్చులు చేయడం మంచిది. కార్యనిర్వహణ శక్తి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆదివారం లాభాలపై దృష్టి. అన్ని పనుల్లో ప్రయోజనాలుంటాయి. పెద్దల ఆశీస్సులు, అనుకూలత. కొన్ని అనుకోని సమస్యలున్నా అధిగమిస్తారు. బద్ధకం తగ్గించుకోవాలి. సోమ మంగళ వారాల్లో ఖర్చులు అధికం. పెట్టుబడుల వల్ల కుటుంబంలో అనుకూలత. యాత్రలకు, ప్రయాణాలకు అవకాశం. ఆర్థిక నిల్వలు తగ్గిపోయే సూచనలు. వ్యవహారాల్లో కొంత జాగ్రత్త. పరామర్శలకు అవకాశం ఉంది. బుధ గురు శుక్రవారాల్లో నిర్ణయాదులు లాభిస్తాయి. ఉత్సాహంగా వ్యవహరిస్తారు. కార్యనిర్వహణలో తలమునకలు అవుతారు. బాధ్యతలు పూర్తి చేస్తారు. శ్రమ ఉన్నా ఫలితం సంతోషంగా ఉంటుంది. వ్యవహారాల్లో సంతోషం. తృప్తి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)
ఆదివారం వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. అధికారుల ఆదరణ. పదోన్నతులకు, సామాజిక గౌరవాదులకు అవకాశం. వ్యతిరేక ప్రభావాలను అధిగమించే ప్రయత్నం. సోమ మంగళ వారాల్లో అన్ని పనుల్లోనూ ప్రయోజన దృష్టి. లాభాలు ఆశించినట్లుగా రాక ఇబ్బంది పడతారు. శారీరక శ్రమ అధికం. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. తొందరపాటు కూడదు. వ్యవహారాల్లో ఒత్తిడులుంటాయి. బుధ గురు శుక్రవారాల్లో ఖర్చులు పెట్టుబడుల్లో జాగ్రత్త. అనవసరమైన పనుల కోసం కాలం ధనం కోల్పోయే అవకాశం. కొన్ని ఖర్చుల వల్ల సామాజిక గౌరవం కూడా పెరుగుతుంది. ఆసుపత్రులు, పరామర్శలకు అవకాశం.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)
ఆదివారం అన్ని పనుల్లో ఉన్నతి. కీర్తిప్రతిష్టలకు అవకాశం. ఆధ్యాత్మిక యాత్రలకు అవకాశం. ధార్మిక వ్యవహారాలపై దృష్టి. కార్యనిర్వహణలో కొన్ని ఒత్తిడులుంటాయి. సోమ మంగళ వారాల్లో వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులుంటాయి. అధికారిక వ్యవహారాల కోసం అధికంగా ఖర్చులు చేయాల్సి ఉంటుంది. సామాజిక గౌరవం తగ్గే సూచనలు. తొందరపాటు కూడదు. పదోన్నతి విషయంలో ఇబ్బందులు. బుధ గురు శుక్రవారాల్లో లాభాలపై దృష్టి. ఆశించిన ప్రయోజనాలు అందకపోవచ్చు. పెద్దల ఆశీస్సులు మాత్రం లభిస్తాయి. ఉన్నతమైన వ్యవహారాలపై దృష్టి. బద్ధకపు భావనలను తగ్గించుకోవాలి. పరిశోధనల్లో విజయం కలుగుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదివారం అన్ని పనుల్లో జాగ్రత్త. అనుకోని సమస్యలుంటాయి. ముఖ్య కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలి. ఊహించని సంఘటనలుంటాయి. గౌరవ లోపం కూడా జరుగవచ్చు. సోమ మంగళ వారాల్లో అన్ని పనుల్లో అనుకూలత, లాభాలు. కీర్తిప్రతిష్ఠలు విస్తరించే సూచనలు. తొందరపాటు కూడదు. దూర ప్రాంతాలకు ప్రయాణ భావనలు. పరిశోధనా రంగాల వారికి అత్యున్నతి. ఉపాసనపై దృష్టి పెట్టాలి. బుధ గురు శుక్రవారాల్లో వృత్తి ఉద్యోగాదులపై దృష్టి. శ్రమతో గుర్తింపు. సామాజిక గౌరవం కోల్పోకుండా చూసుకోవాలి. అనుకోని కార్యక్రమాలకు అవకాశం. కొంత అప్రమత్తంగా మెలగాలి. అధికారిక వ్యవహారాలుంటాయి.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ