వారం వారం గోచారం

వారం వారం గోచారం (30-6-2019 నుంచి 6-7-2019 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఈ వారం ప్రారంభంలో కుటుంబంలో అనుకూలత. బంధువర్గంతో సమావేశం. మాట విలువ పెరుగుతుంది. ఆర్థిక నిల్వలు పెంచుకునే దృష్టి. ఆత్మీయులను కలుసుకుంటారు. వారం మధ్యమంలో సంప్రదింపులకు అనుకూలం. కొన్ని వార్తల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇతరుల సహకారం విషయంలో జాగ్రత్తలు అవసరం. సోదరవర్గంతో అప్రమత్తంగా మెలగాలి. అధికారుల, స్ర్తివర్గ సహకారం లభిస్తుంది. గౌరవ లోపం లేకుండా చూసుకోవాలి. వారాంతంలో ఆహార విహారాలపై దృష్టి. గృహ వాహనాదులను సమకూర్చుకుంటారు. విందులు వినోదాలు సంతోషాన్నిస్తాయి. కృషి రంగంలో గుర్తింపు. విద్యారంగంలోని వారికి అనుకూలం. కొంత ఒత్తిడి ఉన్నా శ్రమతో ఫలితాలుంటాయి. ఆధ్యాత్మిక వాతావరణం వల్ల మేలు కలుగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఈ వారం ప్రారంభంలో వృత్తిపరమైన గుర్తింపు లభిస్తుంది. అధికారిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు. సామాజిక గౌరవం పెరుగుతుంది. పితృవర్గ వ్యవహారాలపై దృష్టి. వ్యాపార వ్యవహారాల్లో అనుకూలత. శ్రమతో కార్యక్రమాలుంటాయి. ప్రమోషన్‌లకు అవకాశం. వారం మధ్యమంలో అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. లాభాలు సంతోషాన్నిస్తాయి. పెద్దల ఆశీస్సులు, అనుకూలత. కార్యక్రమాల నిర్వహణలో కొన్ని అనుకూలతలుంటాయి. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. అధికారుల ఆదరణ కూడా ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. వారాంతంలో ఖర్చులు పెట్టుబడులుంటాయి. పరామర్శలకు అవకాశం. విశ్రాంతి లోపం సంభవం. విందులు వినోదాలలో తొందరపాటు కూడదు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఈ వారం ప్రారంభంలో వ్యతిరేక ప్రభావాలు అధికం. పోటీలు ఒత్తిడులున్నా అధిగమించాల్సిన అవసరం ఉంది. శ్రమతో కార్యక్రమాలను నిర్వహిస్తారు. పోటీ రంగంలో అనుకూలత. రుణాదుల ఇబ్బంది తగ్గిపోతుంది. అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలసిపోయే అవకాశం. వారం మధ్యమంలో భాగస్వామ్యాల్లో అప్రమత్తంగా మెలగాలి. పరిచయాలు ఇబ్బంది పెట్టే సూచనలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. అధికారిక పరిచయాలు పెంచుకుంటారు. కాలం ధనం కోల్పోకుండా చూసుకోవాలి. వ్యాపారాదుల్లో, వ్యాపార భాగస్వామ్యాల్లో మాత్రం కొంత జాగ్రత్త తప్పదు. నిర్ణయాదులు ఇబ్బంది పెట్టే అవకాశం. ప్రయాణాదుల్లో జాగ్రత్త. వారాంతంలో అన్ని పనుల్లోనూ ఇబ్బందులుంటాయి. ప్రమాదాలకు అవకాశం. తొందరపాటు చర్యలు కూడదు.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. నిర్ణయాదులు లాభిస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. అనేక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది. శ్రమ ఉంటుంది. ఫలితం అనుకూలం. కార్యనిర్వహణ సమర్థంగా ఉంటుంది. గుర్తింపు, గౌరవాలు లభిస్తాయి. వారం మధ్యమంలో కుటుంబ వ్యవహారాలపై దృష్టి. బంధుమిత్రులతో చిన్నచిన్న ఇబ్బందులున్నా సంతోషంగానే గడుపుతారు. మాటల్లో కొంత చమత్కార ధోరణి, కొంత అధికారిక భావన. నిల్వధనంపై దృష్టి ఉన్నా కొంత బలవంతంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. భాగస్వామ్యాల్లో, స్నేహానుబంధాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వారాంతంలో సంప్రదింపులకు అనుకూలం. సహకారం కోసం ప్రయత్నిస్తారు. దగ్గరి ప్రయాణాలుంటాయి. తొందరపాటు కూడదు.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో ఉన్నత వ్యవహారాలకు అనుకూలం. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. విద్యా, పరిశోధన రంగాల్లో శుభ పరిణామాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ, ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. వారం మధ్యమంలో వృత్తి ఉద్యోగాదుల్లో గుర్తింపు ఉంటుంది. అధికారుల ఆదరణ ఉంటుంది. సామాజిక గౌరవం, గుర్తింపు పెరుగుతుంది. ప్రమోషన్‌లు, నూతన పదవులకు అనుకూలం. తండ్రి వర్గానికి సంబంధించిన వ్యవహారాల్లో పాల్గొంటారు. అన్ని పనుల్లోనూ శ్రమ ఉన్నా అనుకూలత ఉంటుంది. వారాంతంలో ప్రయోజనాలు అధికం. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. వ్యవహారాలలో లాభాలున్నా ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారాదుల్లోనూ శుభ పరిణామాలుంటాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఈ వారం ప్రారంభంలో ప్రణాళికాబద్ధమైన వ్యవహారాలు ఉంటాయి. ఆలోచనలు ఫలిస్తాయి. సృజనాత్మకత పెంచుకుంటారు. నూతన కార్యక్రమాలపై దృష్టి. సంతానవర్గ వ్యవహారాలు సంతోషాన్నిస్తాయి. కొన్ని పోటీలు తప్పకపోవచ్చు. మనోభీష్టాలు నెరవేరుతాయి. సంతోషంగా గడుపుతారు. వారం మధ్యమంలో వ్యతిరేకతలు అధికం. పోటీలు వత్తిడులను అధిగమించాలి. వ్యవహారాలలో ఇబ్బందులుంటాయి. రుణాదులను అధిగమిస్తారు. చికాకులు కొన్ని ఉన్నా శ్రమతో అధిగమిస్తారు. గుర్తింపు లభిస్తుంది. నిర్ణయాదులకు అనుకూలం. వారాంతంలో వ్యాపార భాగస్వామ్యాలకు అనుకూలం. పరిచయాలు స్నేహానుబంధాలకు అనుకూలత. కొత్త పనుల నిర్వహణలో సమస్యలుండే అవకాశం. భాగస్వామితోనూ కొంత జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం ప్రారంభంలో వేరు వేరు రూపాల్లో ఖర్చులు చేయాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలకు అనుకూలం. దానధర్మాల వల్ల మేలు. పెట్టుబడుల్లో పాజిటివిటీ ఉండాలి. పరామర్శలకు అవకాశం. పదిమంది శ్రేయస్సు కోసం కాలం ధనం వినియోగించడం మంచిది. వారం మధ్యమంలో నిర్ణయాదుల్లో కొంత తొందరపాటు, తత్తరపాటు ఉంటుంది. ఆత్మవిశ్వాసం ఉన్నా కొంత భయం, ఒత్తిడి తప్పకపోవచ్చు. ఆనందంగా గడపాలని ఉన్నప్పటికీ ఆరోగ్య సమస్యలకు అవకాశం ఉంటుంది. నిర్ణయాదుల్లో స్పష్టత అవసరం. ఇతరుల ప్రభావానికి లొంగవద్దు. వారాంతంలో కుటుంబ, ఆర్థికాంశాలు ప్రభావితం చేస్తాయి. బంధువర్గంతో అప్రమత్తంగా మెలగాలి. మాటల్లో కొంత తొందరపాటుకు అవకాశం ఉంది. ఆర్థిక నిల్వలను పెంచుకుంటారు.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)
ఈ వారం ప్రారంభంలో అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. అనుకోని సమస్యలుంటాయి. తొందరపాటు చర్యల వల్ల ఇబ్బంది. ముఖ్య నిర్ణయాదులను వాయిదా వేసుకోవాలి. ఊహించని సంఘటనలుంటాయి. కొన్ని శ్రమ రహిత ప్రయోజనాలు, వాటి వల్ల సమస్యలు ఉత్పన్నం కావచ్చు. వారం మధ్యమంలో కీర్తిప్రతిష్టలకు అవకాశం. తక్కువ శ్రమతో ఎక్కువ గుర్తింపు ఉంటుంది. పెద్దపెద్ద కార్యక్రమాలకు ప్రణాళికలుంటాయి. ఆధ్యాత్మిక ప్రయాణాల వల్ల మేలు కలుగుతుంది. లక్ష్యాలను సాధిస్తారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. వారాంతంలో వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. సామాజిక గౌరవం పెరుగుతున్నా ఏవో కొన్ని అభ్యంతరాలు, అడ్డంకులకు అవకాశం ఉంది. కార్యనిర్వహణలో జాగ్రత్తగా మెలగాలి.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఈ వారం ప్రారంభంలో ఆహార విహారాలకు అనుకూలం. సౌఖ్యాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. విందులు వినోదాలు సంతోషాన్నిస్తాయి. కృషితో కార్యక్రమాల నిర్వహణ. గృహ వాహనాది సౌకర్యాలు పెంచుకుంటారు. మాతృవర్గ వ్యవహారాల్లో సంతృప్తి. విద్యారంగంలోని వారికి గుర్తింపు. వారం మధ్యమంలో ఆలోచనలకు రూపకల్పన. మానసిక వత్తిడులుంటాయి. సంతాన వర్గంతో అనుకూలత. సృజనాత్మకత పెంచుకుంటారు. కొత్త పనులపై దృష్టి ఉన్నా కొంత జాగ్రత్త అవసరం. బాధ్యతలు అధికం అవుతాయి. వారాంతంలో వ్యతిరేకతలు అధికం. పోటీలు ఒత్తిడులు ఇబ్బందులు పెడతాయి. చికాకులను అధిగమించాలి. వ్యతిరేకతలపై విజయం. గుర్తింపు లభిస్తుంది. శ్రమ అత్యధికంగా ఉంటుంది. రుణ రోగాదులపై విజయం.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఈ వారం ప్రారంభంలో లాభాలు ప్రభావితం చేస్తాయి. అన్ని పనుల్లోనూ ప్రయోజన దృష్టి ఉంటుంది. పెద్దల ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తారు. సోదర వర్గంతోనూ అనుకూలత. కార్యనిర్వహణలో తెలియని అనుకూలత ఉంటుంది. వారం మధ్యమంలో వ్యర్థంగా ఖర్చులుంటాయి. కాలం ధనం వ్యర్థం కాకుండా చూసుకోవాలి. తొందరపాటు కూడదు. సౌఖ్యంపై మనసు ఉంటుంది. కానీ ఇబ్బందులకు ఆస్కారం. పెట్టుబడుల్లో అప్రమత్తంగా మెలగాలి. దానధర్మాల వల్ల మేలు కలుగుతుంది. విందులు వినోదాలుంటాయి. వారాంతంలో ఆత్మవిశ్వాసంతో కార్యక్రమాలను నిర్వహించే ప్రయత్నం. నిర్ణయాదులు లాభిస్తాయి. ఆలోచనలు ఫలిస్తాయి. కార్యనిర్వహణ దక్షత. వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాలి. శ్రమ ఉన్నా విజయం లభిస్తుంది. కొత్త పనులపై దృష్టి.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఈ వారం ప్రారంభంలో భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు పెంచుకుంటారు. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. వ్యాపారాదుల్లోనూ అనుకూలత. స్ర్తి వర్గంతో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. స్నేహానుబంధాలు గుర్తుకు వస్తాయి. పాత మిత్రుల ఫోన్‌కాల్స్ అందుతాయి. వారం మధ్యమంలో అన్ని పనుల్లోనూ జాగ్రత్త. వేరు వేరు రూపాల్లో సమస్యలుంటాయి. వ్యాపారాదుల్లో కొంత వరకు మేలు. అధికారులు, టాక్స్‌పేమెంట్స్, సౌఖ్యాలు, ఫ్యాన్సీ వ్యవహారాలన్నింటిలోనూ అప్రమత్తంగా మెలగాలి. తొందరపాటు కూడదు. వీలైనంత వరకు నిర్ణయాదులు వాయిదా వేసుకోవాలి. వారాంతంలో ఉన్నత వ్యవహారాలపై దృష్టి. కార్యక్రమాల్లో శుభ పరిణామాలు. లక్ష్యాలను సాధిస్తారు. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూలత.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులకు అనుకూలం. ఇతరులకు సహకరించే ప్రయత్నం. దగ్గరి ప్రయాణాలుంటాయి. సోదరవర్గంతో అనుకూలత. రచనలకు గుర్తింపు. వారం మధ్యమంలో ఆహార విహారాలపై దృష్టి. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. కొన్ని వత్తిడులుంటాయి. గృహ వాహనాది సౌకర్యాలు శ్రమకు గురిచేసే అవకాశం. విద్యారంగంలోని వారికి ఇబ్బందులు. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ చేయాల్సి వస్తుంది. అన్ని పనుల్లోనూ జాగ్రత్తగా మెలగాలి. వారాంతంలో ఆలోచనలకు రూపకల్పన. మానసికంగా కొంత వత్తిడి ఉంటుంది. నిర్ణయాదులు ఇబ్బంది పెట్టవచ్చు. తొందరపాటు కూడదు. సంతానవర్గంతో జాగ్రత్తగా మెలగాలి. సృజనాత్మక వ్యవహారాలుంటాయి. కొత్త పనులపై దృష్టి పెరుగుతుంది. కొన్ని కార్యాల వల్ల ఆందోళనగా ఉంటుంది.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744