వారం వారం గోచారం

వారం వారం గోచారం (11-8-2019 నుంచి 17-8-2019 వరకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఈ వారం ప్రారంభంలో ఉన్నత లక్ష్యాలపై దృష్టి. అభ్యున్నతి సాధించే ప్రయత్నం. కీర్తి ప్రతిష్ఠలు ఉంటాయి. కొంత అసంతృప్తి కూడా తప్పకపోవచ్చు. ఆధ్యాత్మికమైన ప్రయాణాల వల్ల పరిపూర్ణమైన అనుకూలత ఏర్పడుతుంది. సౌకర్యాలు పెరుగుతాయి. సౌఖ్యంగా గడుపుతారు. వారం మధ్యమంలో వృత్తిలో వత్తిడులు. శ్రమతో గౌరవం పెరుగుతుంది. సామాజికాంశాలు చర్చలోకి వస్తాయి. పితృవర్గ వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. ఆహార విహారాల్లో కొంత అప్రమత్తంగా మెలగాలి. అనేక బాధ్యతలు నిర్వర్తించాల్సిన సమయం. ప్రయాణాల విషయంలోనూ కొంత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఆలోచనల్లో కొంత వత్తిడి తప్పకపోవచ్చు. వారాంతంలో వేరువేరు రూపాల్లో ప్రయోజనాలుంటాయి. ఆశించిన పనులలో లాభాలు కలుగుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఈ వారం ప్రారంభంలో ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. నిర్ణయాదుల్లో ఆలస్యం సంభవం. అన్ని పనుల్లోనూ ఆచితూచి వ్యవహరించాలి. సంతానవర్గ వ్యవహారాలు కొంత చికాకును తెప్పించవచ్చు. స్పెక్యులేషన్ కూడా ఆశించినట్లు ఉండదు. అనవసర విషయాల ఆలోచనల కన్నా ఆధ్యాత్మిక జీవనం మరింత శ్రేష్ఠం. వారం మధ్యమంలో పోటీలు, ఒత్తిడులు, చికాకులున్నా విజయం సాధిస్తారు. వేరు వేరు వ్యక్తుల వ్యతిరేకతలు అర్థం అవుతున్నా అధిగమించే ప్రయత్నం చేస్తుండాలి. రుణాదులపై విజయం సాధిస్తారు. పోటీ రంగంలో గుర్తింపు. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. కార్యనిర్వహణ దక్షత. మొండితనంతో పనులు నిర్వహిస్తారు. వారాంతంలో భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు. పరిచయాలు పెంచుకుంటారు. కొత్త పనులపై దృష్టి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఈ వారం ప్రారంభంలో నిర్ణయాదులు ఇబ్బందులకు గురి చేస్తాయి. ఆత్మవిశ్వాసం తగ్గే అవకాశం. అన్ని పనుల్లోనూ కొంత ఆలస్యం. బాధ్యతలు అధికం. నిర్వహించలేక సతమతమవుతుంటారు. దైవధాన్యం వల్ల శక్తిని పెంచుకునే అవకాశం కలుగుతుంది. వారం మధ్యమంలో కుటుంబ ఆర్థికాంశాల్లో శుభ పరిణామాలు. మాట విలువ పెరుగుతుంది. ఆర్థిక నిల్వలను పెంచుకునే ప్రయత్నం. బంధువర్గ వ్యవహారాల్లో శుభ పరిణామాలుంటాయి. వేరు వేరు కార్యక్రమాలను నిర్వహించే ప్రయత్నం. కొన్ని అనుకోని సంఘటనలకు అవకాశం ఉంటుంది. వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాలి. వారాంతంలో సంప్రదింపులకు అవకాశం ఉంది. సహకారం లాభిస్తుంది. దగ్గరి ప్రయాణాలుంటాయి. వ్యవహారాల్లో అనుకూలత. పరిచయాలు, స్నేహానుబంధాలు లాభిస్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో అనుకోని ఇబ్బందులుంటాయి. అనారోగ్యం కూడా కలిగే అవకాశం. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. తొందరపాటు కూడదు. ముఖ్య నిర్ణయాలు వాయిదా వేసుకోవడం శ్రేష్ఠం. దానధర్మాల వల్ల మేలు కలుగుతుంది. కాలం ధనం శ్రమ వ్యర్థం కావచ్చు. వారం మధ్యమంలో సుదూర ప్రయాణ భావనలుంటాయి. కీర్తి ప్రతిష్ఠలు పెంచుకుంటారు. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. ఆధ్యాత్మిక ప్రయాణాలకు అవకాశం. సంతృప్తిగా గడుపుతారు. వైజ్ఞానిక, పరిశోధన, విద్యారంగాల వారికి అభివృద్ధి. ఉన్నత విద్య, ఉద్యోగాదులకు, గుర్తింపులకు చక్కని అవకాశం. వారాంతంలో పదోన్నతులపై దృష్టి. చేస్తున్న పనిలో సంతోషం. శ్రమ ఉన్నప్పటికీ అందరినీ కలుసుకుంటారు. సామాజిక గౌరవం, గుర్తింపులు పెంచుకుంటారు.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. శారీరక ఒత్తిడులుంటాయి. ఆహార విహారాల్లో జాగ్రత్త అవసరం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. ప్రయాణాదుల్లో ఒత్తిడులు. సౌఖ్య లోపం. గృహ వాహనాదుల విషయంలో ముందు జాగ్రత్త అవసరం. విద్యా రంగంలోని వారికి శ్రమాధిక్యం. వారం మధ్యమంలో ఆలోచనలకు రూపకల్పన. మనోభీష్టాలు నెరవేరుతాయి. సంతానం వల్ల సంతోషం, సంతృప్తి. క్రియేటివిటీ పెంచుకుంటారు. కొత్త నిర్ణయాలు, ఆలోచనలు సంతోషాన్నిస్తాయి. వ్యవహార దక్షత. స్పెక్యులేషన్ లాభిస్తుంది. వేరు వేరు కార్యక్రమాలకు రూపకల్పన. వారాంతంలో పోటీలు అధికం. విజయం సాధించే ప్రయత్నం. అన్ని పనుల్లోనూ అనుకూలత. వ్యతిరేకతలపై విజయం. గుర్తింపు లభిస్తుంది. శారీరక ఒత్తిడులు తప్పకపోవచ్చు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఈ వారం ప్రారంభంలో ఖర్చులు పెట్టుబడులు అధికం. విశ్రాంతి లోపం. అనారోగ్య భావన ఉంటుంది. కాలం ధనం శ్రమ వ్యర్థమయ్యే సూచనలు. పరామర్శలకు అవకాశం. ఆసుపత్రుల దర్శనం లేకుండా చూసుకోవాలి. ప్రయాణాదుల్లో జాగ్రత్త. ఆహార విహారాలు, విందు వినోదాల్లో ఇబ్బందులుంటాయి. వారం మధ్యమంలో నిర్ణయాదులు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసంతో కార్యక్రమాల నిర్వహణ. కొత్త పనులపై దృష్టి. బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుకుంటారు. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. గుర్తింపు లభిస్తుంది. వేరువేరు బాధ్యతలు సంతోషాన్నీ సంతృప్తినీ ఇస్తాయి. అనేక కార్యక్రమాలలో పాల్గొంటారు. వారాంతంలో కుటుంబ ఆర్థికాంశాలు ప్రభావితం చేస్తాయి. మాటల్లో కొంత తొందరపాటు ఉన్నా అనుకూలత. బంధువర్గ బాధ్యతలను నెరవేర్చుకుంటారు.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం ప్రారంభంలో భాగస్వామితో కొంత జాగ్రత్తగా మెలగాలి. సామాజిక అనుబంధాలు ఇబ్బంది పెట్టే సూచనలు. కొత్త పరిచయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. భాగస్వామితో కలిసి దైవకార్యాలపై దృష్టి కేంద్రీకరించడం మరింత శ్రేష్ఠం. బద్ధకం తగ్గించుకోవాలి. వారం మధ్యమంలో కొన్ని ఊహించని సంఘటనలుంటాయి. కొంత అనారోగ్య భావన కూడా ఉంటుంది. ముఖ్య నిర్ణయాల వాయిదా వల్ల మేలు కలుగుతుంది. దానధర్మాల వల్ల లోపాలు నివారించబడతాయి. చికాకు అధికం. అనుకోని నష్టాలు, ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా మెలగాలి. వారాంతంలో అన్ని పనులూ పరిపూర్ణం చేస్తారు. ఆనందంగా మెలగుతారు. సంతోషం, సంతృప్తి కలుగుతాయి. దూర ప్రయాణాల వైపు దృష్టి. ఆధ్యాత్మిక, వైజ్ఞానికాంశాల్లో ప్రగతి.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఈ వారం ప్రారంభంలో సంప్రదింపుల్లో జాగ్రత్త వహించాలి. సహకార లోపాలకు అవకాశం. సేవక వర్గంతో అనుకూలత ఉంటుంది. దగ్గరి ప్రయాణాదుల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. వార్తల వల్ల కొంత ఇబ్బంది ఏర్పడవచ్చు. కమ్యూనికేషన్స్‌లో అప్రమత్తంగా మెలగడం మంచిది. వారం మధ్యమంలో ఆహార విహారాలపై దృష్టి. గృహ వాహనాది సౌకర్యాలను పెంచుకునే ప్రయత్నం. సౌఖ్యంగా కాలం గడుపుతారు. వృత్తి ఉద్యోగాదులలో ఉన్నతి. శ్రమ ఉన్నా సంతోషంగా ఉంటుంది. ప్రయాణాలు సంతోషాన్నిస్తాయి. విద్యారంగంలోని వారికి మేలు కలుగుతుంది. సామాజిక గౌరవం పెరుగుతుంది. వారాంతంలో అభీష్టాలు నెరవేరుతాయి. క్రియేటివిటీ పెరుగుతుంది. సృజనాత్మకత. ఆలోచనలకు రూపకల్పన. సంతాన వర్గంతో సంతోషంగా గడుపుతారు.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఈ వారం ప్రారంభంలో లాభాలున్నా ఆశించిన సంతోషం అందకపోవచ్చు. కొత్త పనుల నిర్వహణలో జాగ్రత్త. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. ప్రయోజనాలు లభించినా అసంతృప్తి. వ్యవహారాల్లో కొంత అప్రమత్తత అవసరం. వారం మధ్యమంలో ఖర్చులు పెట్టుబడులు అధికం. విందులు వినోదాల కోసం వెచ్చిస్తారు. విశ్రాంతిగా, సౌఖ్యంగా కాలం గడుపుతారు. వారాంతంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. అనేక బాధ్యతలు నిర్వర్తిస్తారు. కొత్త పనులపై దృష్టి. వేరువేరు కార్యక్రమాల నిర్వహణలో శ్రమ తప్పకపోవచ్చు. గుర్తింపు లభిస్తుంది. సామాజిక అనుబంధాల్లో కొంత వత్తిడి ఉంటుంది. భాగస్వామితో తొందరపాటుగా ప్రవర్తించకూడదు. నిర్ణయాదులకు అనుకూలం. శ్రమ ఉన్నా కార్యనిర్వహణ ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఈ వారం ప్రారంభంలో వ్యతిరేక ప్రభావాలు అత్యధికం. అనేక కార్యక్రమాలను నిర్వహించాల్సి వస్తుంది. శారీరకమైన ఒత్తిడులు అధిగమించాలి. ఆర్థిక వ్యవహారాలు, ఇచ్చి పుచ్చుకోవడం మొదలైన అంశాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పోటీ రంగంలో విజయం సాధించినా కొంత అసంతృప్తి ఉంటుంది. చికాకులను దైవధ్యానంతో అధిగమించి విజయం సాధించాలి. వారం మధ్యమంలో సామాజిక అనుబంధాలు పెంచుకుంటారు. పూర్వ మిత్రుల కలయిక లేదా సంప్రదింపులుంటాయి. పరిచయాలు ప్రభావితం చేస్తాయి. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కొత్త పనుల నిర్వహణపై దృష్టి పెరుగుతుంది. శారీరకమైన ఒత్తిడులు తప్పకపోవచ్చు. వారాంతంలో అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా మెలగాలి. అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఈ వారం ప్రారంభంలో కుటుంబ సంబంధాల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. బంధువర్గంతోనూ అప్రమత్తంగా మెలగాలి. ఆర్థిక నిల్వలను కోల్పోయే అవకాశం. మాట విలువ తగ్గే సూచనలు. కొంత ఆర్థిక అసంతృప్తి ఉంటుంది. వారం మధ్యమంలో సంప్రదింపులకు అనుకూలం. సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్ లాభిస్తాయి. దగ్గరి ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. సోదరవర్గ వ్యవహారాల్లో సంతోషం, సంతృప్తి ఉంటుంది. ఉన్నత లక్ష్యాలను సాధించే ప్రయత్నం. విద్యా ఉద్యోగ రంగాల్లో కీర్తి ప్రతిష్ఠలను పెంచుకుంటారు. గౌరవం పెరుగుతుంది. వారాంతంలో ఆహార విహారాల్లో అనుకూలత. సౌఖ్యంగా గడుపుతారు. గృహ వాహనాది సౌకర్యాలను పెంచుకునే ప్రయత్నం. విద్యారంగంలోని వారికి మరింత అనుకూలత.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ వారం ప్రారంభంలో సామాజిక గౌరవం తగ్గే సూచనలు. ఉద్యోగ తదితర బాధ్యతల నిర్వహణలో శ్రమ అధికం. పితృవర్గ వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాలి. ఆశించిన పదోన్నతులు అందక నీరసానికి లోనయ్యే అవకాశం. కొంత నిరాశ తప్పకపోవచ్చు. సౌకర్యాలపై దృష్టి ఉన్నా శ్రమ ఉంటుంది. వారం మధ్యమంలో అన్ని రూపాల్లో ప్రయోజనాలుంటాయి. వేరువేరు లాభాలు సంతోషాన్నీ సంతృప్తినీ ఇస్తాయి. గుర్తింపు, గౌరవాదులు సంభవం. పెద్దల అనుకూలత, ఆశీస్సులు లభిస్తాయి. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. ఆలోచనలు అనేక రూపాల్లో ఉంటాయి. కార్యనిర్వహణలో జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. వారాంతంలో విశ్రాంతి లభిస్తుంది. ఖర్చులు పెట్టుబడులు అధికవౌతాయి. ప్రయాణాలకు అవకాశం. సౌఖ్యంగా కాలం గడుపుతారు.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744